ఇవాళ విడుదలైన ఆకాశంలో ఒక తార హీరోయిన్ సాత్విక వీరవల్లి ఇండస్ట్రీ దృష్టిలో బలంగా పడటం హాట్ టాపిక్ గా మారింది. మాములుగా తెరంగేట్రం చేసే అమ్మాయిలకు తొలి సినిమా విడుదలయ్యాక దానికొచ్చే స్పందన బట్టి ఆఫర్లు రావడం రాకపోవడం ఉంటుంది. ఒక్కోసారి ఫ్లాప్ అయినా నటన, లుక్స్ బాగుంటే దర్శక నిర్మాతలు వెంట పడతారు. ప్రాధమికంగా చూస్తే సాత్విక గ్లామర్ టైపు కాదు. పెర్ఫార్మన్స్, డాన్స్ నమ్ముకుని అడుగులు వేస్తోంది.
విశ్వసనీయ సమాచారం ప్రకారం సాత్వికకు అవకాశాలు బాగానే తలుపు తడుతున్నాయి. సుకుమార్ దర్శకత్వంలో త్వరలో సెట్స్ పైకి వెళ్ళబోతున్న రామ్ చరణ్ 17 కోసం ఆల్రెడీ ఫోటో షూట్ జరిగింది. సుక్కు నుంచి ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టేనని అంటున్నారు కానీ ప్రకటన వచ్చేదాకా ఖచ్చితంగా చెప్పలేం. బెదురులంక ఫేమ్ క్లాక్స్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా గీతా ఆర్ట్స్ నిర్మించే ఫాంటసీ డ్రామాలో సాత్విక లాకైపోయిందట. అఫీషియల్ గా త్వరలో చెబుతారు.
ఇవి కాకుండా ధృవ్ విక్రమ్ హీరోగా తమిళంలో రూపొందే ఒక యాక్షన్ డ్రామాకు సైతం ఈమెనే మొదటి ఆప్షన్ గా పెట్టుకున్నట్టు తెలిసింది. తొలి అడుగుల్లోనే ఇంత క్రేజ్ సంపాదించుకోవడం అంటే మాటలు కాదు. ఆ రకంగా చూసుకుంటే తను లక్కీ అని చెప్పాలి. ఆకాశంలో ఒక తార ట్రైలర్ చూస్తేనే నటన పరంగా ఒక క్లారిటీ వచ్చేస్తోంది. మొత్తం సినిమా చూశాక ప్రేక్షకులు కనక ఆమెను బాగా రిసీవ్ చేసుకుంటే టాలీవుడ్ ని వేధిస్తున్న హీరోయిన్ల కొరతకు కొత్త పరిష్కారం దొరికినట్టే.
ఎన్ఆర్ఐ కావడం వల్ల తెలుగు ధారాళంగా మాట్లాడ్డంలో ఇబ్బంది పడుతున్న సాత్విక వీరవల్లి త్వరలోనే ఆ అడ్డంకి అధిగమిస్తానని చెబుతోంది. పైన చెప్పిన మూడు సినిమాలు తనకే వచ్చేస్తే త్వరగా టాప్ లీగ్ కి చేరుకోవచ్చు. పైగా సుకుమార్ లాంటి వాళ్ళ చేతిలో పడితే ఎంత సానబడతారో రష్మిక మందన్న, సమంత లాంటి వాళ్ళను ఉదాహరణగా చెప్పొచ్చు. దుల్కర్ సల్మాన్ లాంటి టాలెంటెడ్ హీరో ఉన్నప్పటికీ ఆకాశంలో ఒక తారకు సంబంధించి ఈ అమ్మడి మీదే ఎక్కువ దృష్టి ఉండటం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates