ధనుష్ లిస్ట్ లో మరో తెలుగు సినిమా?

ఈ మధ్యకాలంలో తమిళ, మలయాళ నటులను టాలీవుడ్ కు తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. ‘పుష్ప’ సినిమాలో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ ను విలన్ గా తీసుకున్నారు. ఇక హీరో విజయ్ తో భారీ బడ్జెట్ సినిమా ప్లాన్ చేస్తున్నారు నిర్మాత దిల్ రాజు. ఈ సినిమాను వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేయబోతున్నారు. అలానే కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ని కూడా తెలుగులోకి తీసుకొస్తున్నారు. ఏషియన్ సినిమాస్ అధినేత నారాయణ్ కే దాస్ నారంగ్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేయనున్నారు.

ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొందించనున్నారు. ఇప్పుడు ఈ సినిమాతో పాటు ధనుష్ మరో స్ట్రెయిట్ తెలుగు సినిమా అంగీకరించినట్లు సమాచారం. ఓ యంగ్ డైరెక్టర్ కాంబినేషన్ లో తెలుగులో ఓ పెద్ద బ్యానర్ ఈ సినిమాను నిర్మించబోతోంది. అయితే ఈ సినిమాను తెలుగు, తమిళంతో పాటు హిందీలో కూడా తీస్తారా లేదా అనేది తెలియాల్సివుంది.

తెలుగులో ధనుష్ ఒప్పుకున్న ఈ రెండు సినిమాల్లో ముందుగా ఏ సినిమాను మొదలుపెడతారో చూడాలి. ఎందుకంటే ఇప్పటివరకు శేఖర్ కమ్ముల బౌండెడ్ స్క్రిప్ట్ ను సిద్ధం చేయలేదు. ధనుష్ కి కేవలం లైన్ చెప్పి ఓకే చేయించుకున్నారు. ఇంకా పూర్తి స్క్రిప్ట్ వినిపించాల్సివుంది. అయితే రెండో సినిమాకు యంగ్ డైరెక్టర్ దగ్గర స్క్రిప్ట్ రెడీగా ఉందట. కాబట్టి వీటిలో ఏది ముందుగా సెట్స్ పైకి తీసుకెళ్తారో చూడాలి!