సినిమా రిలీజ్ తర్వాత పెట్టే సక్సెస్ మీట్ల గురించి నిన్న ఇద్దరు హీరోలు క్రేజీ కామెంట్స్ చేశారు. రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ సక్సెస్ మీట్స్ పెట్టడం కామన్ అయిపోయిందని, అందుకే తన సినిమాలకు అలాంటి ఈవెంట్లు చేయడం మానేశానని, ‘ఈఎన్ఈ రిపీట్’ నిజంగా సక్సెస్ అయింది కాబట్టే ఈవెంట్ పెట్టుకున్నామని అన్నాడు విశ్వక్సేన్.
మరోవైపు నేచురల్ స్టార్ నాని తాను ప్రొడ్యూస్ చేసిన ‘అలియాస్ రుక్మిణీ’కి సంబంధించిన వేడుకలో మాట్లాడుతూ.. రిలీజ్ తర్వాత సక్సెస్ మీట్లు జోక్‌గా మారిపోయిన ఈ రోజుల్లో.. రిలీజ్‌కు ముందే తాము బ్లాక్ బస్టర్ పార్టీ చేసుకుంటున్నామని కామెంట్ చేశాడు. ఐతే నాని ఊరికే ఏమీ ఈ మాట అనలేదని అర్థమవుతోంది. ఈ సినిమాకు తెగే ఫస్ట్ టికెట్ నుంచే లాభాలు రాబోతున్నాయట. ఈ విషయాన్ని నిర్మాతగా నాని ధ్రువీకరించాడు.
‘అలియాస్ రుక్మిణీ’ ఫస్ట్ టికెట్‌ను ఈ పార్టీలోనే నాని అమ్మకానికి పెట్టాడు. టీంలో ఒకరు డబ్బులిచ్చి టికెట్ తీసుకున్నారు. ఇది తన ఫస్ట్ లాభం అని నాని చెప్పడం విశేషం. ఇక్కడి నుంచే తెగే ప్రతి టికెట్ మీద వచ్చే ఆదాయం తమకు ప్రాఫిటే అని నాని చెప్పాడు. దీన్ని బట్టి ‘అలియాస్ రుక్మిణీ’ మీద పెట్టిన బడ్జెట్ అంతా నాన్-థియేట్రికల్ రైట్స్ నుంచే నానికి రికవర్ అయిపోయిందన్నమాట. థియేటర్ల నుంచే వచ్చేదంతా లాభమే అనుకోవాలి.
ఈ సినిమాకు మంచి బజ్‌యే ఉంది కాబట్టి.. కలెక్షన్లు బాగానే వస్తాయని భావిస్తున్నారు. ఈజీగా నాని 20 కోట్లకు తక్కువ కాకుండా లాభాలు అందుకునే అవకాశముంది. నితిన్ సరసన బాలీవుడ్ భామ ఆఫియా సయ్యద్ నటించిన ఈ చిత్రాన్ని ‘దండోరా’ దర్శకుడు మురళీకాంత్ దేవసోత్ రూపొందించాడు. డిసెంబరు 4న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates