రాప్తాడు ఘటన వెనుక యానిమల్ .. ఆర్జీవీ కౌంటర్
నిన్న ఏపీలోని అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన పాఠశాల ఘటన ఎంతటి సంచలనం రేపిందో తెలిసిందే. క్లాసు జరుగుతుండగా.. ఎలక్ట్రిక్ రంపంతో వచ్చిన ఓ ఉన్మాది.. తన ప్రేమను అంగీకరించలేదని ఒక అమ్మాయి మీద పాశవిక దాడికి దిగాడు. రంపపు కోతతో ఆ అమ్మాయి తీవ్ర గాయాల పాలైంది. ప్రస్తుతం బెంగళూరులో మృత్యువుతో పోరాడుతోంది. ఈ ఘటనలో మరో అమ్మాయి కూడా గాయపడింది.
తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనం రేపింది. చర్చనీయాంశంగా మారింది. ఐతే నిన్న ఈ ఘటన జరిగిన దగ్గర్నుంచి దర్శకుడు సందీప్ రెడ్డి వంగ మీద సోషల్ మీడియాలో ఒక వర్గం తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. అతను తీసిన యానిమల్ సినిమాలో హీరో తన అక్కను ఏడిపించిన వాళ్లకు బుద్ధి చెప్పడం కోసం మెషీన్ గన్ను పట్టుకుని క్లాస్‌రూంలోకి వెళ్లే సన్నివేశం ఉంటుంది. అది చూసే రాప్తాడులో ఉన్మాద ప్రేమికుడు ఇలా చేశాడంటూ కొందరు సూత్రీకరిస్తున్నారు.
సమాజంలో సున్నితత్వం తగ్గిపోతుండడానికి, హింసా ప్రవృత్తి పెరిగిపోతుండడానికి సినిమాల్లోని మితిమీరిన హింసాత్మక సన్నివేశాలు, చెడ్డ విషయాలను గ్లోరిఫై చేయడమే కారణమంటూ సోషల్ మీడియాలో పలువురు కామెంట్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే రాప్తాడు ఘటనకు, యానిమల్ మూవీలో సన్నివేశానికి ముడిపెడుతున్నారు. కానీ సినిమాల నుంచి చెడును నేర్చుకుంటున్నట్లయితే.. సినిమాల్లో చూపించే మంచిని ఎంతమేర తీసుకుంటున్నారన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. సీనియర్ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కూడా ఇదే రకమైన కామెంట్ చేశారు.
రాప్తాడు ఘటనకు, యానిమల్ సినిమాకు ముడిపెట్టడాన్ని తప్పుబడుతూ.. కిడ్నాపులకు రామాయణమే కారణం అన్నట్లుగా ఉందని ఆయన కౌంటర్ వేశారు. ఈ కామెంట్‌కు నెటిజన్ల నుంచి గట్టి మద్దతే లభిస్తోంది. అదే సమయంలో ఆయన పోస్టును తప్పుబడుతున్న వాళ్లూ ఉన్నారు.
This post was last modified on November 2, 2026 12:49 pm
కొన్ని రోజుల కిందట బాలీవుడ్ స్టార్ టైగర్ ష్రాఫ్ మీద నడి రోడ్డుపై కొందరు దుండగులు తుపాకులతో దాడికి పాల్పడడం…
ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలు చేసింది అత్యంత అరుదైన నేరం, వారు న్యాయ ప్రక్రియ నుంచి ఎప్పటికీ…
ప్రపంచంలోనే అత్యంత ధనికుల జాబితాలో ఉండే ముకేష్ అంబానీ కుటుంబానికి ఇండియాలో అసలు పోటీయే లేదు. ఎప్పటికప్పుడు వారి సంపద…
పులివెందులలో జరుగుతున్న స్థానిక ఎన్నికల పోలింగ్‌ను పరిశీలించేందుకు వెళ్లిన జగన్‌కు అడుగడుగునా పరాభవాలు ఎదురయ్యాయి. ఆయన అడుగు పెట్టీ పెట్టడంతోనే…
అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో పదవతరగతి విద్యార్థినిపై రంపంతో దాడి చేసిన ఘటన యావత్ రాష్ట్రాన్ని కలవరపాటుకు గురించేసింది.…
ప్రధాని మోడీ మెడలు వంచుతామని.. ఆయనను గద్దె నుంచి దింపుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం ఢిల్లీలోని…