టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఈ వారం విడుదలైన సినిమాల్లో అందరూ మాట్లాడుకుంటున్నవి ఆకాశంలో ఒక తార, ఈ నగరానికి ఏమైంది రిపీట్, ఓమ్ మాత్రమే. కలెక్షన్ల పరంగా మూడు దేనికవే పోటీ పడుతూ ఆడియన్స్ ని థియేటర్ల వైపు లాగుతున్నాయి. టాక్ విషయంలో దుల్కర్ సల్మాన్ డామినేషన్ చూపిస్తుండగా నెక్స్ట్ విశ్వక్ సేన్ బృందం యూత్ ని ఆకట్టుకునే పనిలో బిజీగా ఉంది. పబ్లిక్ టాక్ మిశ్రమంగా ఉన్నా ఓం ఆక్యుపెన్సీలు బాగున్నాయి. అయితే వీటి మధ్యలో ఇంకో మూవీ వచ్చింది.
కీర్తి సురేష్ టైటిల్ రోల్ పోషించిన సత్యవాన్ సావిత్రి మొన్న శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో తీసినప్పటికీ డబ్బింగ్ చేసి తెలుగు వెర్షన్ కూడా సమాంతరంగా రిలీజ్ చేశారు. అయితే ప్రమోషన్ విషయంలో కనీస శ్రద్ధ తీసుకోకపోవడంతో జనానికి ఇది వచ్చిన సంగతే తెలియదు. దానికి తోడు కీర్తి సురేష్ నటించిన ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాలు గతంలో చాలా ఫెయిలయ్యాయి. అది కూడా బజ్ ఏర్పడకపోవడానికి ఒక కారణంగా చెప్పొచ్చు. ఇక్కడ ఇంకో ట్విస్టు ఉంది.
సత్యవాన్ సావిత్రికి డీసెంట్ టాక్ వచ్చింది. కొన్ని కంప్లయింట్స్ ఉన్నప్పటికీ అధిక శాతం జనాలు పూర్తిగా నిరాశపడలేదని అనడం పెద్ద రిలీఫ్. సావిత్రి అనే లాయర్ కు భర్త ఇరుక్కున్న హత్య కేసునే హ్యాండిల్ చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుంది. ఆమెను ఓడించాలని కంకణం కట్టుకున్న పబ్లిక్ ప్రాసిక్యూటర్ దాని కోసం రకరకాల ఎత్తుగడలు వేస్తాడు. ఇద్దరి మధ్య మైండ్ గేమ్ జరుగుతున్న టైంలో ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటాయి. అవేంటనేది థియేటర్లో చూడాల్సిన అసలు మ్యాటర్.
ప్రవీణ్ ఎస్ విజయ్ దర్శకత్వం వహించిన సత్యవాన్ సావిత్రిలో కీర్తి సురేష్, మిస్కిన్ పెర్ఫార్మన్స్ గురించి ఎక్కువ ప్రశంసలు వస్తున్నాయి. అంతా బాగానే ఉంది కానీ మూడు పోటీ సినిమాల మధ్య ఇది నిలదొక్కుకోవడం కష్టంగానే ఉంది. ఏదైనా సోలో డేట్ చూసుకుని వచ్చి ఉంటే కొంచెం మెరుగైన ఫలితం వచ్చేదేమో కానీ ఇలా కాంపిటీషన్ లో బలవంతంగా వస్తే కనీసం పబ్లిక్ నోటీస్ లో పడకుండానే సెలవు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ సినిమాకు తమిళంలో మాత్రమే ప్రచారం చేశారు.
This post was last modified on November 21, 2026 4:40 pm
ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన శ్రీ వెంకటేశ్వర స్వామికి ఓ అపరిచిత భక్తుడు భారీ కానుక సమర్పించడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.…
డిజిటల్ యుగం వెళ్ళిపోయి ఏఐ శకం మొదలైంది. పలకా బలపం స్థానంలో ట్యాబులు, ల్యాప్ ట్యాపులు వచ్చినప్పటి నుంచి టెక్నాలజీదే…
కొన్నిసార్లు అనుకోని అదృష్టాలు కలిసి వస్తాయి. శర్వానంద్ ప్రస్తుతం అదే ఎంజాయ్ చేయబోతున్నాడు. నవంబర్ 12 విడుదల కావాల్సిన భోగి…
తెలుగు లిరిసిస్టుల్లో వేటూరి సుందరరామ్మూర్తి, సీతారామశాస్త్రిలది వేరే లెవెల్. దశాబ్దాల పాటు తెలుగు పాటను అత్యున్నత స్థాయిలో నిలబెట్టిన ఘనత…
డిసెంబర్ 4 విడుదల కావాల్సిన వృషకర్మ వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వచ్చిన వార్త అక్కినేని అభిమానులను ఆందోళనకు…
కలెక్షన్లు పక్కన పెట్టి కంటెంట్ మాత్రమే పరిగణనలోకి తీసుకుంటే.. దేశంలో నంబర్ వన్ ఇండస్ట్రీ మాలీవుడ్‌యే అంటే భిన్నాభిప్రాయాలు ఉండవు.…