ప్రపంచంలోనే అత్యంత ధనికుల జాబితాలో ఉండే ముకేష్ అంబానీ కుటుంబానికి ఇండియాలో అసలు పోటీయే లేదు. ఎప్పటికప్పుడు వారి సంపద పెరుగుతూ ఉంటుంది. ఇటీవలే జియో పబ్లిక్ ఇష్యూను మొదలుపెట్టడంతో వారి సంపద ఎక్కడికో వెళ్లిపోయింది. లక్షల కోట్ల సామ్రాజ్యాన్ని నిర్మించిన ముకేష్ అంబానీ కుటుంబం.. సేవా కార్యక్రమాల్లోనూ ముందుంటుంది.
కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా వేల కోట్లతో సేవా కార్యక్రమాలు చేస్తుంటుంది. దాంతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా చేపట్టే ఛారిటీ ప్రోగ్రామ్స్ కూడా చాలానే ఉన్నాయి. తాజాగా అంబానీ ఫ్యామిలీ ఒక గొప్ప కార్యానికి శ్రీకారం చుట్టింది. ఎవ్వరి అండా లేని అభాగ్యులు 5 వేల మందికి ఆశ్రయం కల్పించింది.
తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలు.. పిల్లల ఆదరణకు దూరమైన సీనియర్ సిటిజన్లు.. ఇంకా వికలాంగులు.. ఇలా 5 వేలమంది కోసం ఒక టౌన్ షిప్ నిర్మించబోతోంది అంబానీల ఫ్యామిలీ. ముకేశ్ అంబాని భార్య నీతా అంబాని పుట్టిన రోజు సందర్భంగా నీతా అంబాని అనంత్ ఆశ్రయ్ పేరుతో ఈ ప్రాజెక్టును ప్రకటించారు. దీనికి భూమిపూజ కూడా చేశారు.
అనాథ పిల్లలు, వృద్ధుల కోసం ఆశ్రమాలు నడుపుతారు కానీ.. ఇలా ఒకే చోట 5 వేలమందికి ఉత్తమ సౌకర్యాలతో టౌన్ షిప్ నిర్మించడం మాత్రం అరుదు. అంబానీల కుటుంబానికి సంబంధించిన సేవా కార్యక్రమాలన్నీ రిలయెన్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుగుతాయి. దానికి నీతా అంబానీనే డైరెక్టర్. తనతో పాటు చిన్న కొడుకు అనంత్ పేరు మీద ఈ టౌన్‌షిప్‌ను నీతా నిర్వహించబోతున్నారు.
This post was last modified on November 2, 2026 8:55 am
పులివెందులలో జరుగుతున్న స్థానిక ఎన్నికల పోలింగ్‌ను పరిశీలించేందుకు వెళ్లిన జగన్‌కు అడుగడుగునా పరాభవాలు ఎదురయ్యాయి. ఆయన అడుగు పెట్టీ పెట్టడంతోనే…
అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో పదవతరగతి విద్యార్థినిపై రంపంతో దాడి చేసిన ఘటన యావత్ రాష్ట్రాన్ని కలవరపాటుకు గురించేసింది.…
ప్రధాని మోడీ మెడలు వంచుతామని.. ఆయనను గద్దె నుంచి దింపుతామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం ఢిల్లీలోని…
తమిళ సినిమాలో సెన్సేషనల్ జోడీ అంటే శింబు, నయనతారలదే. వీళ్లిద్దరూ కలిసి నటించిన తొలి చిత్రం ‘వల్లభ’ అప్పట్లో పెను…
దేశంలోని ముఖ్యమంత్రుల పనితీరు మీద తరుచుగా సర్వేలు జరుగుతుండటం మనకు తెలిసిందే. ముఖ్యమంత్రుల పనితీరు, ప్రజాదరణను బట్టి వారికి ర్యాంకులు…
వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్.. తన సొంత నియోజకవర్గం పులి వెందులలో ఆదివారం హల్చల్ చేసిన విషయం తెలిసిందే.…