Political News

మోదీ షాలను దేశం నుంచి పారిపోనివ్వం

ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలు చేసింది అత్యంత అరుదైన నేరం, వారు న్యాయ ప్రక్రియ నుంచి ఎప్పటికీ తప్పించుకోలేరని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన హెచ్చరిక రాజకీయ దుమారం రేపుతోంది. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ వైఖరికి వ్యతిరేకంగా ఓట్ బచావో – దేశ్ బచావో పేరుతోఇండియా కూటమి ఢిల్లీ రాంలీలా మైదానంలో నిర్వహించిన మహా సభలో రాహుల్ గాంధీ చేసిన ప్రసంగం దేశ వ్యాప్తంగా రాజకీయ వర్గాల్లో చర్చకు దారి తీసింది. జ్ఞానేష్ కుమార్ తర్వాత మోదీ, షాలే లక్ష్యమని స్పష్టం చేసిన రాహుల్ మోదీని దేశం నుంచి పారిపోనివ్వమని, న్యాయస్థానం ఎదుట నిలబెడతామని వార్నింగ్ ఇవ్వడం గమనార్హం.

సీఈసీ జ్ఞానేష్ కుమార్ జైలుకు వెళ్లడం ఖాయమని, తదుపరి లక్ష్యం మోదీ, షాలే అనిరాహుల్ గాంధీ స్పష్టం చేశారు. సర్ పేరుతో చేసిన ఓట్ చోరీ కేసులో చట్టం ముందు ఎంతటి వారైనా తలవంచక తప్పదన్నారు. జ్ఞానేష్ లేకుండా మోదీ ప్రధాని, అమిత్ షా హోం మంత్రి అయ్యే వారు కాదని చెప్పిన రాహుల్ గాంధీ ఎన్నికల అక్రమాలకు పాల్పడినప్పటికి గత ఎన్నికల్లో ఎన్డీఏ, ఇండియా కూటమికి మధ్య కేవలం 3 శాతం మాత్రమే ఓట్ల వ్యత్యాసం వుందని వివరించారు. ఇప్పుడు ఏకంగా 15 శాతం ఓట్లను తొలగించారని, మోదీ కోసమే సర్ ప్రక్రియ నిర్వహిస్తున్నారని ఆరోపించారు.

మోదీ ఎక్కడికీ పోరని అమిత్ షా చేసిన ప్రకటనను ప్రస్తావిస్తూ… ఓట్ చోరీ చేసిన మోదీని ఎక్కడికీ పోనివ్వమని స్పష్టం చేశారు. న్యాయపరమైన చర్యలను ఆయన ఎదుర్కోవడం తప్పదని హెచ్చరించారు. ఇప్పటికే మోదీ, అమిత్ షా, జ్ఞానేష్ కుమార్ నిద్రలేని రాత్రులు గడుపుతున్నారని విమర్శించారు. తాము మోదీలాగ ద్వేషాన్ని పెంచి పోషించమని, ప్రేమతో దేశంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడుతామని చెప్పారు. ఇద్దరు ముగ్గిరికే దేశాన్ని కుదువ పెట్టారని, దేశ ప్రజల సంపదను బడా బాబులు కబ్జా చేసేందుకు సహకరిస్తున్నారని ఆరోపించారు.

మొత్తం మీద ఢిల్లీ రాంలీలా మైదానంలో జరిగిన మహాసభ సక్సస్ అయ్యిందని వినిపిస్తుంది. ఇటీవల కాలంలో ఇంత పెద్ద సంఖ్యలో జనం తరలి రావడం ఇదే ప్రధమమని చెప్పొచ్చు. దేశం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు రాంలీలా మైదానానికి చేరుకోవడంతో ఇండియా కూటమి నాయకుల్లో ఉత్సాహం కనిపిస్తుంది. మోదీ ప్రధానిగా భాద్యతలు చేపట్టిన తర్వాత ఇంత పెద్ద నిరసనను ఎదుర్కోవడం కూడా ఇదే తొలిసారి. రానున్న రోజుల్లో ఓట్ చోరీ వివాదం మరింతగా కుదిపేసే సూచనలు కనిపిస్తున్నాయి.

This post was last modified on November 2, 2026 10:36 am

Share

Recent Posts

అంబానీల అద్భుత కార్యం

ప్ర‌పంచంలోనే అత్యంత ధ‌నికుల జాబితాలో ఉండే ముకేష్‌ అంబానీ కుటుంబానికి ఇండియాలో అస‌లు పోటీయే లేదు. ఎప్ప‌టిక‌ప్పుడు వారి సంప‌ద…

2 hours ago

జగన్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే…!

పులివెందుల‌లో జ‌రుగుతున్న స్థానిక ఎన్నిక‌ల పోలింగ్‌ను ప‌రిశీలించేందుకు వెళ్లిన జ‌గ‌న్‌కు అడుగ‌డుగునా ప‌రాభ‌వాలు ఎదుర‌య్యాయి. ఆయ‌న అడుగు పెట్టీ పెట్ట‌డంతోనే…

3 hours ago

కిరాతకుడు హేమంత్ పై కాల్పులు – సంబరాల్లో ప్రజలు

అనంతపురం జిల్లా రాప్తాడు ప్రభుత్వ పాఠశాలలో పదవతరగతి విద్యార్థినిపై రంపంతో దాడి చేసిన ఘటన యావత్ రాష్ట్రాన్ని కలవరపాటుకు గురించేసింది.…

4 hours ago

రేవంత్ రెడ్డి వానర సైన్యం

ప్ర‌ధాని మోడీ మెడ‌లు వంచుతామ‌ని.. ఆయ‌న‌ను గ‌ద్దె నుంచి దింపుతామ‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఆదివారం ఢిల్లీలోని…

4 hours ago

మళ్లీ శింబు-నయన్ జోడీ… నమ్మొచ్చా?

తమిళ సినిమాలో సెన్సేషనల్ జోడీ అంటే శింబు, నయనతారలదే. వీళ్లిద్దరూ కలిసి నటించిన తొలి చిత్రం ‘వల్లభ’ అప్పట్లో పెను…

12 hours ago

టాప్ టెన్ ముఖ్యమంత్రుల్లో తెలుగు నేతలు

దేశంలోని ముఖ్యమంత్రుల పనితీరు మీద తరుచుగా సర్వేలు జరుగుతుండటం మనకు తెలిసిందే. ముఖ్యమంత్రుల పనితీరు, ప్రజాదరణను బట్టి వారికి ర్యాంకులు…

12 hours ago