ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ అభిమానులు గర్వంగా ఫీలయ్యే సినిమాలిచ్చారు. ఆ నమ్మకంతోనే మాస్ మహారాజా కిక్ 2 చేయడానికి ఒప్పుకుంటే అది డిజాస్టర్ కావడం ఊహించని షాక్ ఇచ్చింది. త్వరగా కంబ్యాక్ కావాలనే ఉద్దేశంతో రీమేక్ అయినా సరే ధృవ చేయడం రామ్ చరణ్ లిస్టులో ఒక విజయాన్ని జోడించి పెట్టింది. ఆ టేకింగ్ చూసే చిరంజీవి సైరా నరసింహారెడ్డి లాంటి ప్యాన్ ఇండియా మూవీకి ఛాన్స్ ఇచ్చారు.
సైరా కూడా సూపర్ హిట్టే కానీ బడ్జెట్, బిజినెస్ భారీగా కావడం వల్ల కొన్ని చోట్ల ఆశించిన ఫలితం అందుకోలేదు. ఇదంతా ఒక ఎత్తు అయితే ఏజెంట్ చేసిన గాయం అంతా ఇంతా కాదు. అఖిల్ కెరీర్ లోనే కాదు టాలీవుడ్ హిస్టరీలోనే దారుణమైన డిజాస్టర్స్ లో ఒకటిగా నిలిచింది. అక్కడ పడిన బ్రేక్ నుంచి సూరి ఇప్పటిదాకా పికప్ కాలేదు. అదృష్టవశాత్తు పవన్ కళ్యాణ్ కు ఒక కథ చెప్పడం, ఆయనకు నచ్చడం, నిర్మాత రామ్ తాళ్ళూరి ముందుకు రావడం చకచకా జరిగిపోయాయి.
కట్ చేస్తే ఇదంతా గతంగా మారిపోయింది. ఓజి, హరిహర వీరమల్లు, ఉస్తాద్ భగత్ సింగ్ చాలా తక్కువ గ్యాప్ లో మూడు సినిమాలు ఇచ్చిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఓజి 2 తప్ప ఏదీ చేసే మూడ్ లో లేరు. ఇది కూడా దర్శకుడు సుజిత్ నాని బ్లడీ రోమియో పూర్తి చేసుకుని వచ్చాక స్టార్ట్ అవుతుంది. షూటింగ్ కి ఎంత టైం పడుతుందో చెప్పలేం. ఆలోగా ఎన్నికలు దగ్గరికి వచ్చినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే జనసేన అధినేతకు సినిమాలు చేయడమనేది ప్రాధాన్యత లేనిదిగా మారుతుంది.
మరి ఇప్పుడు సురేందర్ రెడ్డి ఇంకొంత కాలం వెయిట్ చేస్తారా లేక ఇంకో హీరో కోసం ట్రై చేస్తారా అనేది కాలమే సమాధానం చెప్పాలి. ఒకవేళ ఏజెంట్ కనీసం యావరేజ్ అయినా ఇంకొన్ని కాంబోలు ఈజీగా దొరికేవి. కానీ ఇప్పుడది మహా కష్టమైపోయింది. ఎలక్షన్ల లోపు నీ సినిమా చేస్తానని పవన్ నుంచి సురేందర్ రెడ్డికి హామీ దక్కితే హ్యాపీసే. కానీ అదంత సులభంగా జరిగే పనిలా కనిపించడం లేదు. మరి సూరికి కంబ్యాక్ ఎప్పుడు అవుతుందో, ఎవరు ఇస్తారోనని మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
This post was last modified on October 9, 2026 10:42 am
ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…
టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…
పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…
వస్తు, సేవల పన్ను.. జీఎస్టీ విధానంలో కీలక మార్పులు చేయనున్నారు. ఇప్పటి వరకు ఎవరైనా వ్యాపారులు పారిశ్రామిక వేత్తలు.. జీఎస్టీ…
భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ యుద్దానికి తెర లేచింది. మొట్టమొదటిసారిగా అంబానీ ఆధిపత్యానికి సవాల్ ఎదురైంది. ఈ క్రమంలో ప్రపంచ…
ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అనేక అంశాలపై ఆయన కు వినతి…