Political News

బీసీ రిజర్వేషన్లపై తేల్చేసిన సుప్రీం

ఆంధ్రప్రదేశ్ లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ప్రత్యేకంగా అసెంబ్లీలో జీవో పాస్ చేసిన సంగతి తెలిసిందే. అయితే, రిజర్వేషన్లు 50 శాతం మించకూడదు అని సుప్రీం కోర్టు మార్గదర్శకాలకు ఈ జీవో విరుద్ధంగా ఉందని ఏపీ హైకోర్టు ఆ జీవోను రద్దు చేసింది. ఈ క్రమంలోనే హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టులో ఏపీ ప్రభుత్వం స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఏపీ సర్కార్ కు సుప్రీం కోర్టు షాకిచ్చింది. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీం కోర్టు ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేసింది.

ఈ విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీ ప్రభుత్వం నిర్వహించిన కుటుంబ సర్వేను ఏ రకంగా ప్రామాణికంగా తీసుకుంటారని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీని ప్రశ్నించింది. అయితే, ఎందుకు తీసుకోకూడదని ముకుల్ రోహత్గీ వాదించారు. పూర్తిస్థాయిలో వాదనలు వినిపించేందుకు మరికొంత సమయం కావాలని ఆయన కోరారు. అయితే, అందుకు నిరాకరించిన సుప్రీం కోర్టు ఏపీ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ కొట్టివేసింది. దీంతో, బీసీలకు మరిన్ని రాజకీయ అవకాశాలు కల్పించాలన్న సీఎం చంద్రబాబు సంకల్పానికి అడ్డుకట్టపడినట్లుంది.

అయితే సుప్రీంకోర్టు తీర్పునకు సంబంధం లేకుండా బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించాలని చంద్రబాబు నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఆయా నియోజకవర్గాలలో బీసీలకు 34 శాతం కోటా ప్రకారం ఇవ్వాలని చంద్రబాబు ఫిక్స్ అయ్యారు. తాజాగా సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో మరో నాలుగైదు రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.

This post was last modified on October 9, 2026 11:56 am

Share

Recent Posts

తీరం చేరని ఏజెంట్ దర్శకుడి కలలు

ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం లాంటి బ్లాక్ బస్టర్లతో దర్శకుడు సురేందర్ రెడ్డి పీక్స్ చూశారు. అల్లు అర్జున్, రవితేజ…

36 minutes ago

ఫౌజీ ప్లాన్ మారడం వెనుక ఏం జరిగింది

ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి,…

1 hour ago

తమన్ ఈసారి నెగిటివిటీని దాటేయాలి

టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…

2 hours ago

పండగ బోణీ చేయాల్సింది కళ్యాణే

పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…

2 hours ago

5 కోట్ల వ‌ర‌కు జీఎస్టీ ఎగ్గొట్టారా…

వస్తు, సేవ‌ల ప‌న్ను.. జీఎస్టీ విధానంలో కీల‌క మార్పులు చేయ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రైనా వ్యాపారులు పారిశ్రామిక వేత్త‌లు.. జీఎస్టీ…

5 hours ago

మస్క్ అంబానీ మధ్య శాటిలైట్ ఫైట్

భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ యుద్దానికి తెర లేచింది. మొట్టమొదటిసారిగా అంబానీ ఆధిపత్యానికి సవాల్ ఎదురైంది. ఈ క్రమంలో ప్రపంచ…

6 hours ago