Movie News

ఫౌజీ ప్లాన్ మారడం వెనుక ఏం జరిగింది

ప్రభాస్ అభిమానులు చాలా ఎగ్జైటింగ్ గా ఎదురు చూస్తున్న అప్డేట్స్ ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. డార్లింగ్ కెరీర్ లో బాహుబలి, కల్కి తర్వాత అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఫౌజీ కొత్త విడుదల తేదీ మార్చి 18 ఫిక్సయ్యిందని విశ్వసనీయ వర్గాల సమాచారం. మైత్రి మూవీ మేకర్స్ ప్రకటన ఇవ్వకపోయినా హీరో పుట్టినరోజు అక్టోబర్ 23 వస్తోంది కాబట్టి అదే రోజు టీజర్ తో పాటు రిలీజ్ డేట్ ని ప్రపంచానికి చెప్పబోతున్నారు. అంటే మార్చి 5 రావాల్సిన స్పిరిట్ వాయిదా పడిందని వేరే చెప్పనక్కర్లేదు.

ఇంతకీ అసలేం జరిగి ఉంటుందనే విషయానికి వద్దాం. ఫౌజీ ఇప్పటికే బడ్జెట్, ప్రొడక్షన్ పరంగా చాలా బరువు మోస్తోంది. డిసెంబర్ లో రావాల్సింది మళ్ళీ మూడు నెలలు పోస్ట్ పోన్ చేసుకోవడం ఓటిటి డీల్ కోణంలో పెద్ద ఇబ్బందిగా మారింది. కానీ స్పిరిట్ కు ఆ సమస్య లేదు. ఎప్పుడు అమ్మకానికి పెట్టినా క్షణాల్లో సోల్డవుట్ అయ్యే హాట్ కేక్ అది. ఫౌజీతో పోలిస్తే దానికున్న బడ్జెట్, రిస్క్ తక్కువ. సో తొందరపడకుండా తర్వాత వద్దామనే సూచన ప్రభాస్ ఇవ్వడం వల్లే సందీప్ వంగ ఎస్ చెప్పారట.

యానిమల్ విడుదలైన డిసెంబర్ లోనే స్పిరిట్ కూడా రిలీజ్ చేసేందుకు సందీప్ ప్రాథమికంగా అంగీకరించారని తెలిసింది. సంక్రాంతికి ఇలాంటి వయొలెంట్ సినిమాలు వర్కౌట్ కాకపోయే రిస్క్ ఉంది కాబట్టి ముందు నెల వచ్చేస్తే సలార్ లాగా అందరూ లాభపడవచ్చని ఆలోచన చేసి ఉంటారు. ఫౌజీ సంగతి చూస్తే దర్శకుడు హను రాఘవపూడి ఇంకో రెండు నెలలు దీని షూటింగ్ కోసమే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. కొన్ని ఎపిసోడ్స్ టెర్రిఫిక్ గా వచ్చాయని యూనిట్ సభ్యుల మాట.

ఈ లెక్కన ఫౌజీ, వారణాసి చాలా తక్కువ గ్యాప్ లో ఆడియన్స్ ని పలకరించబోతున్నాయి. బ్రిటిష్ ఆర్మీలో పని చేస్తూ తర్వాత దేశం కోసం ఏమైనా చేసే వీర సైనికుడిగా ప్రభాస్ పాత్ర ఫౌజీలో చాలా ఇంటెన్స్ గా ఉంటుందట. ముఖ్యంగా ఇంటర్వెల్ బ్లాక్, గుడిలో ఫైట్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు. హీరోయిన్ ఇమాన్విని ప్రెజెంట్ చేసిన విధానం సూపర్ గా వచ్చిందట. సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ ప్రస్తుతం టీజర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మీద వర్క్ చేస్తున్నట్టు వినికిడి.

This post was last modified on October 9, 2026 10:14 am

Share

Recent Posts

తమన్ ఈసారి నెగిటివిటీని దాటేయాలి

టాలీవుడ్ లో చాలా కాలంగా తమన్ ముద్ర వినిపించడం లేదు. ఓజి టైంలో అంచనాలు అందుకున్నాడు కానీ ఆ తర్వాత…

32 minutes ago

పండగ బోణీ చేయాల్సింది కళ్యాణే

పన్నెండు రోజుల ముందే టాలీవుడ్ బాక్సాఫీస్ దసరా పండగ మొదలైపోయింది. అన్నీ అనుకున్నట్టు జరిగి ఉంటే ఇవాళ ఆదర్శ కుటుంబం…

1 hour ago

5 కోట్ల వ‌ర‌కు జీఎస్టీ ఎగ్గొట్టారా…

వస్తు, సేవ‌ల ప‌న్ను.. జీఎస్టీ విధానంలో కీల‌క మార్పులు చేయ‌నున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎవ‌రైనా వ్యాపారులు పారిశ్రామిక వేత్త‌లు.. జీఎస్టీ…

4 hours ago

మస్క్ అంబానీ మధ్య శాటిలైట్ ఫైట్

భారత దేశంలో శాటిలైట్ ఇంటర్నెట్ యుద్దానికి తెర లేచింది. మొట్టమొదటిసారిగా అంబానీ ఆధిపత్యానికి సవాల్ ఎదురైంది. ఈ క్రమంలో ప్రపంచ…

4 hours ago

గోదావరి పుష్కరాలకు నిధులు ఇవ్వండి మోదీజీ

ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీతో ఏపీ సీఎం చంద్ర‌బాబు భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా అనేక అంశాల‌పై ఆయన కు విన‌తి…

7 hours ago

అంబానీయే ఇండియాకు బాసా?

భారత్‌లో ఇంటర్నెట్ సేవలు ప్రారంభించేందుకు ఎలాన్ మస్క్‌కు చెందిన స్టార్‌లింక్ కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది. కొన్ని అనుమతులు వచ్చినా ఇప్పటికీ సేవలు…

10 hours ago