ఇది కియారా అద్వానీకే సాధ్యం

ఒకప్పుడు హీరోయిన్ల కెరీర్ మంచి ఊపులో సాగుతుంటే వాళ్లు పెళ్లి జోలికి వెళ్లేవాళ్లు కాదు. అవకాశాలు తగ్గిపోయి, ఫేడవుడ్ అవుతున్న దశలోనే ఆ ఆలోచన చేసేవాళ్లు. వివాహ బంధంలోకి వెళ్తే కెరీర్ పరంగా పరిమితులు ఏర్పడతాయని.. గ్లామర్ రోల్స్ చేయడం కష్టమని ఆలోచించేవాళ్లు. కానీ ఇప్పుడు ట్రెండు మారుతోంది. కెరీర్‌కు, పెళ్లికి ముడిపెట్టకుండా స్టార్ హీరోయిన్లు పెళ్ళి చేసుకుంటున్నారు. వివాహం తర్వాత కూడా గ్లామర్ రోల్స్ కొనసాగిస్తున్నారు. బాలీవుడ్లో ఈ ట్రెండ్ కనిపిస్తోంది.

దీపికా పదుకొనే, కియారా అద్వానీ లాంటి వాళ్లు.. వివాహ బంధంలోకి అడుగు పెట్టాక కూడా ఎలాంటి హాట్ హాట్ రోల్స్ చేశారో తెలిసిందే. ముఖ్యంగా కియారా అయితే.. కెరీర్ ఆరంభంలో ట్రెడిషనల్ రోల్స్ చేసి, తర్వాత గ్లామర్ విందు చేయడం మొదలుపెట్టింది. సిద్దార్థ్ మల్హోత్రాను పెళ్లి చేసుకున్నాక ఆమె స్పీడు తగ్గుతుందేమో అనుకుంటే.. ‘వార్-2’, ‘టాక్సిక్’ లాంటి చిత్రాల్లో ఎలా రెచ్చిపోయిందో తెలిసిందే. ఈ సినిమాలు చేస్తున్నపుడు ఆమె ప్రెగ్నెంట్ కావడం గమనార్హం.

ఒక పాపకు తల్లయ్యాక ఈ రెండు సినిమాల్లో తన అప్పీయరెన్స్ చూసి అందరూ షాకైపోయారు. ఐతే తొలి బిడ్డకు జన్మనించిన 15 నెలలకే కియారా మళ్లీ తల్లి అయినట్లు ఇప్పుడు వార్త బయటికి వచ్చింది. పెళ్ళి చేసుకుని, ఒక బిడ్డకు తల్లి అయ్యాక కియారాను హాట్ హాట్ రోల్స్‌లో చూసి అందరూ షాకవుతుంటే.. సగటు ఇల్లాలిలా ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా రెండోసారి ప్రెగ్నెంట్ కావడం ఇంకా పెద్ద షాక్.

ఓవైపు తెరపై అంత గ్లామరస్ రోల్స్ చేస్తూ.. ఇంకోవైపు సగటు మహిళలా తక్కువ గ్యాప్‌లో ఇద్దరు పిల్లల్ని కనడం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో ఇంతకుముందెన్నడూ చూడనిది. ఇలాంటి వైవిధ్యం కియారాకే సాధ్యం అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఐతే రెండో బిడ్డకు జన్మనివ్వడం కోసం మళ్లీ ఆమె గ్యాప్ తీసుకుంటుండడం మాత్రం అభిమానులకు నచ్చట్లేదు. ఈ గ్యాప్ తర్వాత మాత్రం కియారా ఆపకుండా సినిమాలు చేయాలని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.