ఇండియన్ సినిమాల్లో ఎంతో బోల్డ్‌గా నటించే కథానాయికల్లో రాధికా ఆప్టే ఒకరు. ఆమె కెరీర్ ఆరంభంలోనే కొన్ని చిత్రాల్లో న్యూడ్‌గా నటించింది. ఆమె న్యూడ్ క్లిప్స్ అప్పట్లో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి కూడా. లేటెస్ట్‌గా ‘లస్ట్ స్టోరీస్’లోనూ హాట్ హాట్ సీన్లు చేసింది. కాకపోతే రాధికది ఏదో కుర్రకారును రెచ్చగొట్టి సొమ్ము చేసుకోవాలనుకునే వైఖరి కాదు.
కేవలం డబ్బు కోసం ఆమె అలా నటించదు. కథకు అవసరం అంటే.. పాత్రను అనుసరించే ఆ సీన్లు చేస్తుంది. ఆమె బోల్డ్‌గా నటించిన సినిమాల్లో చాలా వరకు ఆర్ట్ ఫిలిమ్సే. అంతర్జాతీయ స్థాయిలో పేరు పొంది.. ఫిలిం ఫెస్టివల్స్‌లో ప్రదర్శితమై అవార్డులు కూడా అందుకున్నవి. ఐతే ఆ సినిమాల్లో తన అప్పీయరెన్స్ చూసి.. వేరే చిత్రాల ఫిలిం మేకర్స్ తనను చాలా తేలిగ్గా తీసుకున్నారని రాధిక తాజాగా ఒక ఇంటర్వ్యూలో వాపోయింది.
కెరీర్ ఆరంభంలో న్యూడ్ సీన్లు చేశాను కదా అని.. లిప్ లాక్, ఇంటిమేట్ సీన్ల కోసం చాలామంది ఫిలిం మేకర్స్ తనను బలవంతపెట్టినట్లు ఆమె చెప్పుకొచ్చింది. లిప్ లాక్, ఇంటిమేట్ సీన్లు చేయాలంటే అందుకు కథ పరంగా బలమైన కారణం ఉండాలని.. ఆ కారణమే తాను అడుగుతుంటానని రాధిక చెప్పింది. కానీ లిప్ లాక్ సీన్ గురించి చెప్పి… ఏముంది 15 సెకన్లు ఏదో అలా ముద్దు సీన్ కవర్ చేసేయండి అన్నట్లు మాట్లాడతారని రాధిక చెప్పింది.
తాను కెరీర్ ఆరంభంలో నగ్నంగా నటించాను కాబట్టి ఏం చెప్పినా ఒప్పేసుకుంటుందిలే అని తేలిగ్గా తీసుకుంటున్నారని, కానీ తాను అవసరం లేకుండా, బలమైన కారణం లేకుండా ఆ సీన్లు చేయనని రాధిక స్పష్టం చేసింది. ఒక సినిమాలో యాక్షన్ సన్నివేశం చేస్తుండగా.. షర్ట్ బటన్స్ తీసేసి నటించాలని ఒక దర్శకుడు అడిగాడని, అలా కుదరదంటే.. కనీసం బ్రాతో అయినా ఆ సీన్ చేయాలని అడిగాడని.. ఆ దర్శకుడి పేరు చెబితే అందరూ షాకవుతారని రాధిక వ్యాఖ్యానించింది. ఇలాంటి సన్నివేశాలతో సినిమాను అమ్ముకోవాలని చూడడం కరెక్ట్ కాదని ఆమె అభిప్రాయపడింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates