ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ ఇంతకుముందులా ఉదారంగా కొత్త సినిమాలను కొనట్లేదన్న సంగతి తెలిసిందే. నిర్మాతలు అడుగుతున్న రేట్లకు, వాళ్లు ఆఫర్ చేసే ధరలకు చాలా వ్యత్యాసం ఉంటోంది. చాలా సినిమాలకు రైట్స్ అమ్ముడవడం లేదు. ఒకసారి డీల్ ఓకే అయ్యాక కూడా రేట్లు మారుతున్న సందర్భాలు ఉంటున్నాయి. ఈ మధ్య థియేట్రికల్ పెర్ఫామెన్సుని బట్టి కూడా డిజిటల్ హక్కుల రేట్లు నిర్ణయమవుతున్నాయి.
థియేటర్ల నుంచి ఇంత కలెక్ట్ చేస్తే ఇంత రేటు అని కొన్ని స్లాబ్స్ పెడుతున్నాయి ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్. ఈ వీకెండ్లో తమిళ, తెలుగు భాషల్లో రిలీజై బ్లాక్ బస్టర్ దిశగా అడుగులు వేస్తున్న మండాడి సినిమాకు నిర్మాత ఈ రకమైన డీలే చేసుకుని జాక్ పాట్ కొట్టినట్లు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
కమెడియన్ టర్న్డ్ హీరో సూరి ప్రధాన పాత్రలో, సుహాస్ విలన్‌గా నటించిన మండాడి సినిమాపై నిర్మాత ఎల్రెడ్ కుమార్ రూ.45 కోట్లు ఖర్చుపెట్టాడు. ఈ సినిమాపై ఇది రిస్కీ బడ్జెటే. దీని ఓటీటీ హక్కులకు నిర్మాత రూ.25 కోట్లు డిమాండ్ చేయగా.. కానీ నెట్ ఫ్లిక్స్ రూ.15 కోట్లే ఇస్తానందట. ఈ విషయంలో అంగీకారం కుదరక.. నిర్మాతకు, నెట్‌ఫ్లిక్స్‌కు మధ్య ఒక డీల్ జరిగిందట.
ఈ సినిమా 50 కోట్ల గ్రాస్ మార్కును టచ్ చేస్తే రూ.30 కోట్లు.. రూ.60-80 కోట్ల మధ్య వసూళ్లు రాబడితే రూ.40 కోట్లు ఇచ్చేలా ఒప్పందం జరిగిందట. రూ.30 కోట్ల కంటే తక్కువ వసూళ్లు రాబడితే రూ.10 కోట్లే ఇచ్చేలా మాట్లాడుకున్నారట. ఐతే ఈ సినిమా ఇప్పుడు ఈజీగా రూ.60 కోట్ల మార్కును అందుకునేలా ఉంది. ఫుల్ రన్లో వంద కోట్ల క్లబ్బులోకి కూడా అడుగుపెట్టొచ్చంటున్నారు. బడ్జెట్లో 90 శాతం ఓటీటీ హక్కుల ద్వారా వస్తుండడంతో నిర్మాత జాక్‌పాట్ కొట్టినట్లే.
మండాడి సినిమాకు తమిళంలో పాజిటివ్ రివ్యూలు, టాక్ రాగా.. తెలుగులో మిక్స్డ్ టాక్, రివ్యూలు వచ్చాయి. కానీ సినిమా రెండు చోట్లా అంచనాలకు మించి ఆడుతోంది. ఈ చిత్రాన్ని ఒక సినిమా అనుభవం ఉన్న మదిమారన్ పుహళేంది అనే యువ దర్శకుడు రూపొందించాడు. సముద్రంలో తెరచాప పడవ పోటీల నేపథ్యంలో నడిచే సినిమా ఇది.
Gulte Telugu Telugu Political and Movie News Updates