Movie News

పవన్ కళ్యాణ్ – ఒక జన సేవకుడి ప్రస్థానం

సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు. ఎన్టీఆర్, ఎంజిఆర్, జయలలిత మొదలైన లెజెండ్స్ ది మర్చిపోలేని చరిత్ర. పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చినంత సులభం కాదు, అందులో నిలదొక్కుకుని బలమైన ముద్ర వేయడం. అందులోనూ ఒక పక్క సినిమాలు చేస్తూ ఇంకోవైపు ప్రజా సేవలో ఎలాంటి లోపము జరగకుండా చూసుకోవడం కత్తి మీద సాము లాంటిది. దాన్ని సాధించిన వాళ్ళలో పవన్ కళ్యాణ్ ప్రత్యేకం.

1996. చిరంజీవి తమ్ముడు అనే బ్రాండ్ తప్ప పవన్ కు వేరే గుర్తింపు లేదు. అందుకే మెగాస్టార్ సోదరుడనే స్టాంప్ ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’కి భారీ ఓపెనింగ్స్ తీసుకొచ్చింది. తనలోని నటుడిని ‘గోకులంలో సీత’ పరిచయం చేస్తే ‘సుస్వాగతం’ ఒక్కసారిగా యూత్ ఫాలోయింగ్ పెంచింది. ‘తొలిప్రేమ’ రికార్డులు బద్దలు కొట్టడంతో పాటు కుటుంబాలను మరింత దగ్గరికి తీసుకొస్తే తమ్ముడు, బద్రి తన స్థానాన్ని మరింత పెంచాయి. ఒక యూత్ ఫుల్ స్టోరీతో ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టడమనేది ‘ఖుషి’కి సాధ్యమైన హిస్టరీ.

ఈ క్రమంలో స్వీయ దర్శకత్వంలో ప్రయోగాత్మకంగా తీసిన ‘జానీ’ ఫెయిలవ్వడం ఒక పాఠం నేర్పింది. తర్వాత బాలు, బంగారం, అన్నవరం లాంటివి ఆశించిన ఫలితాలు ఇవ్వకపోయినా ‘గబ్బర్ సింగ్’తో సృష్టించిన మైలురాళ్ళు అభిమానుల పదేళ్ల ఆకలిని తీర్చేశాయి. ‘అత్తారింటికి దారేది’ విడుదలకు ముందే పైరసీ బారిన పడినా తట్టుకుని నిలబడి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. అన్నయ్య నెలకొల్పిన ప్రజారాజ్యంలో చురుకుగా పాల్గొన్న పవన్ దాని ప్రస్థానం అర్ధాంతరంగా ఆగిపోవడంతో కొంత గ్యాప్ తీసుకున్న మాట వాస్తవం. మధ్యలో గ్యాపులు బ్రేకులు వచ్చినా గత ఓజితో తన స్టామినా ఏమిటో ఋజువు చేయడం జనం అంత సులభంగా మర్చిపోలేరు.

నిజానికి పవన్ టాలీవుడ్ లోనే ఉండాలని, స్టార్ గా వందల సినిమాలు చేసేయాలనే తాపత్రయంలో ఎప్పుడూ లేరు. సమాజానికి ఏదో చేయాలనే తపనే 2014లో జనసేన స్థాపనకు దారి తీసింది. మొదటి అడుగులోనే పరాజయం ఎదురయ్యింది. రెండు సీట్లలో పోటీ చేసినా గెలవకపోవడం ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చింది. అయినా భయపడలేదు. తెలుగుదేశంతో స్నేహం తొలి దశలో ఫలితం ఇవ్వకపోయినా గెలవాలనే నమ్మకం, చంద్రబాబులాంటి అనుభవజ్ఞులతో జట్టు కడితే కలిగే ప్రయోజనం గుర్తించి ఆ బంధాన్ని కొనసాగించడం 2024లో ఏపీ ఉప ముఖ్యమంత్రి దాకా తన ప్రయాణాన్ని తీసుకొచ్చింది.

మధ్యలో ఎన్నో అవమానాలు, వ్యక్తిగత జీవితం మీద విమర్శలు, వ్యక్తిత్వ హననాలు అన్నీ చూశారు పవన్. ఇవి భరించలేకే చిరంజీవి రాజకీయాలకు స్వస్తి చెబితే అన్న ఓడిన చోటే తమ్ముడు గెలిచి చూపించాడు. జనసేన తొలినాళ్ళలో కనిపించిన పవన్ ఆవేశం ఇప్పుడు తగ్గింది. కారణం బాధ్యత పెరిగింది కాబట్టి. ఇది గుర్తించిన వాడే సరైన నాయకుడవుతాడని చెప్పడానికి పవన్ కళ్యాణే ఉదాహరణ. సినిమాలు రాజకీయాలకు అతీతంగా ఇంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించుకున్న పవన్ కళ్యాణ్ భవిష్యత్తు ఎవరూ అంచనా వేయలేకపోతున్నారు. ఎందుకంటే అధికార కాంక్ష కన్నా సేవా పిపాసే తనలో ఎక్కువ కనక. 

This post was last modified on September 2, 2026 10:08 am

Share

Recent Posts

పోటీ హడావిడి… నిలుస్తుందా గరివిడి

దసరా పండగ బాక్సాఫీస్ ఈసారి వైరెటీగా కనిపిస్తోంది. భీభత్సమైన హైప్ ఉండాల్సిన జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటుండగా,…

28 minutes ago

విజయ్ తో చంద్రబాబు ఏం చర్చించారు?

తమిళనాడు ముఖ్య‌మంత్రి జోసెఫ్ విజ‌య్‌.. మంగ‌ళ‌వారం సాయంత్రం విజ‌య‌వాడ‌లో ప‌ర్య‌టించేందుకు వ‌చ్చారు. తొలుత క‌న‌క‌దుర్గ‌మ్మ ఆల‌యాన్ని సంద‌ర్శించుకున్న ఆయ‌న‌.. అనంత‌రం..…

1 hour ago

సీజన్ మారితే ఫలితం ఎలా మారుతుంది

ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…

3 hours ago

విజయవాడలో సీఎం విజయ్ తెలుగు స్పీచ్… వైరల్!

తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…

3 hours ago

విజయవాడలో విజయ్… సౌండ్ అదిరింది బాసు

తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…

3 hours ago

జనసేనలోకి వంగవీటి రాధా?

వంగ‌వీటి రంగా వార‌సుడిగా రాజ‌కీయ అరంగేట్రం చేసిన ఆయ‌న కుమారుడు వంగ‌వీటి రాధా.. త్వ‌ర‌లోనే జ‌న‌సేన పార్టీ తీర్థం పుచ్చుకుంటార‌న్న…

4 hours ago