14 ఏళ్లు వెనక్కి వెళ్తే.. బిజినెస్ మ్యాన్ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు పూరి జగన్నాథ్.. టాలీవుడ్ స్టార్ హీరోల గురించి చెప్పిన మాటలు ఆయా హీరోల అభిమానులను అమితంగా ఆకట్టుకున్నాయి. ఏ హీరోను ఏం చెప్పి సినిమా ఒప్పించవచ్చన్న దానిపై ఇండస్ట్రీలో ఉన్న ప్రచారాల గురించి పూరి జోక్ చేశాడందులో.
ఆ సందర్భంగా ఆయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి చెప్పిన జోక్ బాగా పేలింది. ఈ కథలో మీరు బాగా గన్నులు వాడతారు అని చెబితే.. పవన్ సినిమా ఓకే చేసేస్తాడంటూ పూరి చెప్పాడప్పుడు. ఐతే ఇది జస్ట్ జోక్ కాదని.. నిజమే అనిపించేలా ఇప్పుడు పంజా దర్శకుడు విష్ణువర్ధన్ మా ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు.
పవన్ పుట్టిన రోజును పురస్కరించుకుని పంజా మూవీ రీ రిలీజ్ అవుతున్న నేపథ్యంలో విష్ణువర్ధన్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా పవన్‌తో కలిసి సినిమా చేయాలనుకున్నపుడు తొలిసారి ఆయన్ని కలిసినప్పటి అనుభవాన్ని అతను గుర్తు చేసుకున్నాడు. తామిద్దరం ఆ రోజు ఎక్కువగా మాట్లాడుకున్నది గన్నుల గురించే అని.. ఆయన, తాను ఆ పాయింట్ దగ్గరే సింక్ అయ్యామని.. తమ ఇద్దరికీ తుపాకులంటే పిచ్చి అని చెప్పాడు విష్ణువర్ధన్. తాను ఆర్మీలో పని చేసినపుడు రియల్ గన్స్ వాడానని.. అవి తననెంతో ఎగ్జైట్ చేశాయని.. గన్స్ గురించి తనకున్న పరిజ్ఞానాన్ని పవన్‌తో పంచుకుంటే ఆయన బాగా ఎగ్జైట్ అయ్యారని విష్ణువర్ధన్ చెప్పాడు.
నిజానికి అప్పటికి తన దగ్గర పవన్ కోసం ఏ కథా లేదని.. అదే విషయాన్ని ఆయనతో కూడా చెప్పానని.. కానీ ఏదో ఒక ఎగ్జైటింగ్ స్టోరీ చేద్దాం అని మాత్రం అన్నానని.. పవన్ చాలా స్వచ్ఛమైన మనిషిలా మాట్లాడాడని.. ఆయన దగ్గర మనం కూడా ఏమైనా మాట్లాడొచ్చని.. తాను కూడా అలాంటి వ్యక్తినే కావడంతో పవన్‌తో బాగా కనెక్ట్ అయ్యానని చెప్పాడు విష్ణువర్ధన్.
పవన్‌లో ఉన్న లక్షణాలే తమిళ స్టార్ అజిత్‌లోనూ ఉన్నాయని, ఇద్దరూ చాలా సింపుల్ అని విష్ణువర్ధన్ వ్యాఖ్యానించాడు. అంతకుముందు పవన్ చేసిన సినిమాలు చూసినపుడు ఆయన గడ్డంతో ఉంటే బాగుంటుందని అనిపించేదని.. ఆ ఆలోచనతోనే పంజాలో గడ్డంతో ఆయన లుక్ డిజైన్ చేశామని అతను చెప్పాడు. పంజా ఆ సమయానికి ఫ్లాప్ అయినప్పటికీ.. కాల క్రమంలో కల్ట్ స్టేటస్ తెచ్చుకుంది. రీ రిలీజ్‌లో ఈ సినిమాకు మాంచి క్రేజే కనిపిస్తోంది.
This post was last modified on September 2, 2026 11:30 pm
దసరా పండగ బాక్సాఫీస్ ఈసారి వైరెటీగా కనిపిస్తోంది. భీభత్సమైన హైప్ ఉండాల్సిన జైలర్ 2 అడ్వాన్స్ బుకింగ్స్ నెమ్మదిగా ఊపందుకుంటుండగా,…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్.. మంగళవారం సాయంత్రం విజయవాడలో పర్యటించేందుకు వచ్చారు. తొలుత కనకదుర్గమ్మ ఆలయాన్ని సందర్శించుకున్న ఆయన.. అనంతరం..…
ప్రభాస్ అభిమానులను నిద్రలో లేపి అడిగినా అయ్యో అని ఫీలయ్యే పేరు రాజా సాబ్. ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ…
తమిళనాడు సీఎం విజయ్ నేడు విజయవాడలో పర్యటించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత సీఎం విజయ్ తొలిసారి ఏపీకి వచ్చారు.…
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కు హీరోగా ఎంత క్రేజ్ వుందో ముఖ్యమంత్రిగా కూడా అంతే క్రేజ్ సంపాదించాడు. ఎవరూ…
వంగవీటి రంగా వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన ఆయన కుమారుడు వంగవీటి రాధా.. త్వరలోనే జనసేన పార్టీ తీర్థం పుచ్చుకుంటారన్న…