సినిమా అనేది ఎంతో శక్తిమంతమైన మాధ్యమం. అందులో చూపించే చిన్న చిన్న విషయాలు కూడా ఈజీగా జనాల్లోకి వెళ్లిపోతుంటాయి. అందులోనూ ఈ సోషల్ మీడియా రోజుల్లో సినిమా సంబంధిత విషయాలు వైరల్ కావడానికి ఎంతో సమయం పట్టదు. ఒక సినిమా బృందం అనుకోకుండా స్క్రీన్ మీద ఒక ఫోన్ నంబర్‌ను చూపిస్తే.. అది కాస్తా వైరల్ అయి ఒక వ్యక్తికి తీవ్ర ఇబ్బంది కలిగించిన ఉదంతం కేరళలో చోటు చేసుకుంది. గత ఏడాది జయసింహా ప్రధాన పాత్రలో వచ్చిన ఆఫీసర్ ఆన్ డ్యూటీ అనే మలయాళ సినిమాలోని ఒక సన్నివేశంలో ఒక మహిళా వైద్యురాలి పాత్రకు సంబంధించిన కాంటాక్ట్ నంబర్‌ను ప్రదర్శించడంతో.. ఆ నంబర్ వాడుతున్న ఒరిజినల్ యూజర్‌కు తలనొప్పి తప్పలేదు.
ఆఫీసర్ ఆన్ డ్యూటీ టీం చేసిన పనికి.. తన ప్రశాంతత దెబ్బతిందని బాధితుడు కోర్టుకు ఎక్కాడు. సినిమా రిలీజైన దగ్గర్నుంచి తనకు దేశ విదేశాల నుంచి కాల్స్ వస్తున్నాయని.. అందులో చాలామంది తనను బూతులు తిడుతున్నారని బాధతుడు ఆవేదన వ్యక్తం చేశాడు. దీని వల్ల తన ప్రైవసీ దెబ్బ తిందని, అనుమతి లేకుండా తన ఫోన్ నంబర్ వాడడం ఐటీ చట్టం నిబంధనల ఉల్లంఘనేనని, చిత్ర బృందంపై చర్యలు చేపట్టాలని అతను తన పిటిషన్లో పేర్కొన్నాడు. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయమూర్తి.. ఈ వ్యవహారంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని పోలీసులను ఆదేశించారు.
మహేష్ బాబు సినిమా ఒక్కడులో ఒక కామెడీ సీన్లో ధర్మవరపుతో ఇలాగే ఒక ఫోన్ నంబర్ చెప్పిస్తారు. అది నిర్మాత ఎం.ఎస్.రాజు నంబర్ కావడం గమనార్హం. ఆ సంగతి ఆయనకు తెలియదు. ఐతే రిలీజ్ అనంతరం ఆ నంబర్‌కు విపరీతంగా కాల్స్ రావడంతో ఆయన నంబర్ మార్చుకోవాల్సి వచ్చింది. ఇక శివమణిలోనూ ఒక ఫోన్ నంబర్ చుట్టూ కామెడీ ఉంటుంది. అప్పట్లో ఆ నంబర్ కోసం చాలామంది ట్రై చేశారు కానీ.. ఆ నంబర్ మనుగడలో లేకపోవడంతో ఇబ్బంది లేకపోయింది.
This post was last modified on November 24, 2026 11:36 pm
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో నిజాం కాలం నాటి నుంచి పేద రోగులకు సేవలు అందిస్తున్న నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్…
గుడివాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో జరుగుతున్న సమయంలో కొందరు వైసీపీ కార్యకర్తలు…
2024 సంక్రాంతికి విడుదలై పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషనల్ హిట్టయిన ‘హనుమాన్’ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఆల్రెడీ ‘జై హనుమాన్’…
``నువ్వు కొంచెం గ్లామర్‌గా ఉండాలి. పంజాబీ డ్రస్.. నీకు బాగుంటుంది. చీరల సెలక్షన్ కూడా బాగోలేదు.``- ఇది ఏదో కామాంధుడు…
వచ్చే నెల డిసెంబర్ 17 విడుదల కాబోతున్న అవెంజర్స్ డూమ్స్ డే క్రేజ్ చూస్తుంటే మతి పోవడమనే మాట చిన్నదనిపిస్తుంది.…
బాలకృష్ణ దాదా విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదు. డిసెంబర్ 24 రిలీజ్ కన్ఫర్మ్ చేస్తూ కౌంట్ డౌన్ పోస్టర్లు…