2027 సంక్రాంతి ఎంతో దూరంలో లేదు. త్వరలో పూర్తి కాబోతున్న నవంబర్ నెలని మినహాయిస్తే ఇంకో నలభై రెండు రోజులు మాత్రమే టైం ఉంది. పండగను టార్గెట్ చేసుకున్న సినిమాలు ఆల్రెడీ ప్రమోషన్లు మొదలుపెట్టాయి. ‘జనవరి 12 విడుదల’ నుంచి రావిపూడి ఒక లేడీస్ సాంగ్ వదిలి సోషల్ మీడియాని తగులుకునే పనిలో ఉండగా ‘కాకా’ నుంచి మొదటి ఆడియో సింగల్ డిసెంబర్ ఫస్ట్ వీక్ లో వచ్చేందుకు రెడీ అవుతోంది. ‘జార్జ్ క్రిష్’ ఆల్రెడీ ఒక టీజర్ ఇవ్వగా ‘ఫ్యామిలీ ప్యాక్’ ప్రోమో తక్కువ గ్యాప్ లో అటెన్షన్ తీసుకుంది. ప్రశాంత్ వర్మ నిర్మాతగా రూపొందిన ‘మహాకాళి’ కూడా ఇంకా సౌండ్ చేయాల్సి ఉంది.
కానీ సుప్రీమ్ హీరో సాయిదుర్గ తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ నుంచి ఎలాంటి సౌండ్ లేకపోవడం అభిమానులను అయోమయానికి గురి చేస్తోంది. తన మేనమామ చిరంజీవి సినిమా బరిలో ఉన్నప్పటికీ మేము వెనక్కు తగ్గే పరిస్థితి లేదని నెలక్రితమే నిర్మాత ఒక ఇంటర్వ్యూలో చెప్పడం చూశాం. మరి అలాంటప్పుడు ప్రమోషన్లు మొదలుపెట్టేస్తే ఆడియన్స్ దృష్టి ఇటువైపు తిరిగే ఛాన్స్ ఉంటుంది. అసలే తేజు కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన ప్రెస్టీజియస్ మూవీ ఇది. విపరీతమైన జాప్యం జరిగింది.
చూస్తుంటే మళ్ళీ వాయిదా పడుతుందేమోననే డౌట్లు రావడం సహజం. ఇటీవలే హనుమాన్ 2 ప్రకటన ఇచ్చిన ప్రైమ్ షో సంస్థ సంబరాల ఏటిగట్టు ఊసులు మాత్రం చెప్పడం లేదు. పోస్ట్ ప్రొడక్షన్ ఒక కొలిక్కి వచ్చిందని గతంలోనే చెప్పారు. అలాంటప్పుడు ఏదో ఒక విజువల్ కంటెంట్ ఇస్తూ పోతే అభిమానులు కూడా అలెర్ట్ అవుతారు. అదేమి లేకుండా బజ్ దానంతట అదే వస్తుందనే ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉంటే మటుకు ఓపెనింగ్స్ నుంచే ఇబ్బందులు తలెత్తుతాయి.
రోహిత్ కెపి దర్శకత్వం వహించిన సంబరాల ఏటిగట్టు స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఒక ప్రాంతంలో జరిగిన నిజ జీవిత ఘటనల ఆధారంగా తీశారని ఇన్ సైడ్ టాక్. ఐశ్యర్య లక్ష్మి, అనన్య నాగళ్ళ, జగపతిబాబు, శ్రీకాంత్, సాయికుమార్ లాంటి ప్రామిసింగ్ క్యాస్ట్ ఇందులో పెద్దదే ఉంది. అజనీష్ లోకనాథ్ సంగీతం ఎలా ఉంటుందో చెప్పనక్కర్లేదు. మరి ఇంత కాన్వాస్ పెట్టుకుని ఎందుకు ఇంత లేట్ చేస్తున్నారో అంతు చిక్కడం లేదు. వీలైనంత త్వరగా ఈ అయోమయానికి చెక్ పెట్టడం బెటర్.
This post was last modified on November 24, 2026 11:03 pm
వారణాసి ఏప్రిల్ 7 విడుదల కావడం గురించి ఇండస్ట్రీలోనే కాదు ట్రేడ్ వర్గాల్లోనూ అనుమానాలు మొదలయ్యాయి. వాయిదా గురించి ఎలాంటి…
ప్రతి సంక్రాంతికి కొత్త సినిమా రిలీజ్ చేయడమే సంకల్పంగా పెట్టుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి ఈసారి జనవరి 12 విడుదలతో…
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో నిజాం కాలం నాటి నుంచి పేద రోగులకు సేవలు అందిస్తున్న నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్…
గుడివాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో జరుగుతున్న సమయంలో కొందరు వైసీపీ కార్యకర్తలు…
2024 సంక్రాంతికి విడుదలై పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషనల్ హిట్టయిన ‘హనుమాన్’ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఆల్రెడీ ‘జై హనుమాన్’…
``నువ్వు కొంచెం గ్లామర్‌గా ఉండాలి. పంజాబీ డ్రస్.. నీకు బాగుంటుంది. చీరల సెలక్షన్ కూడా బాగోలేదు.``- ఇది ఏదో కామాంధుడు…