Political News

ఆ వైద్య కళాశాలలో ఏం జరుగుతోంది?

తెలంగాణ రాజ‌ధాని హైదరాబాద్‌లో నిజాం కాలం నాటి నుంచి పేద రోగుల‌కు సేవ‌లు అందిస్తున్న నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్ సైన్స్‌(నిమ్స్‌) వైద్య విద్యా క‌ళాశాల అవినీతి రాష్ట్రాలు దాటింది. ఇక్క‌డి అవినీతిపై కేంద్రం స్పందిస్తూ.. నాలుగు రోజుల్లో నివేదిక ఇవ్వాల‌ని, లేకపోతే.. నిధులు ఆపేస్తామ‌ని హెచ్చ‌రించ‌డంతో ప్ర‌భుత్వం అలెర్ట్ అయింది. ఈ వ్య‌వ‌హారంపై సీఎం రేవంత్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. గ‌త నెల‌లోనే నిమ్స్‌లో అవినీతిపై పెద్ద ఎత్తున మీడియాలో క‌థ‌నాలువ‌చ్చాయి. వెంట‌నే ఏసీబీ అధికారులు రంగంలోకి దిగారు. అణువ‌ణువూ ప‌రిశీలించారు.

ఈ క్ర‌మంలో అనేక అవ‌క‌త‌వ‌క‌లు, అక్ర‌మాలు, అవినీతి ఆరోప‌ణ‌లు వెలుగు చూశాయి. అయితే.. ఈ వ్య‌వ‌హారాల‌కు పాల్ప‌డుతున్న ఓ డాక్ట‌ర్‌కు భారీ ప్రొఫైల్ ఉండ‌డం, అధికార‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష పార్టీల‌లోని కీల‌క నాయ‌కులకు ఆయ‌న `ద‌గ్గ‌రి`వాడు కావ‌డంతో నివేదిక అందినా ప్ర‌భుత్వం పెద్ద‌గా స్పందించ‌లేద‌న్న ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. దీనిపై బీజేపీకి చెందిన ఓ నాయ‌కుడు కేంద్రానికి లేఖ రాసిన‌ట్టు తెలిసింది. ఈ ప‌రిణామాల‌పై స్పందించిన కేంద్రం.. త‌క్ష‌ణ‌మే అవినీతి నివేదిక‌ను త‌మ‌కు పంపించాల‌ని.. లేకపోతే వార్షిక నిధులు నిలిపివేస్తామ‌ని హెచ్చ‌రించింది. ఈ ప‌రిణామాలు ప్ర‌భుత్వానికి తీవ్ర‌సంక‌టంగా మారాయి. చిత్రం ఏంటంటే.. ఈ అవినీతిపై బీఆర్ ఎస్ నాయ‌కులు మౌనంగా ఉండ‌డం.

ఏం జ‌రిగింది?

ఏసీబీ నిర్వ‌హించిన 5 రోజుల త‌నిఖీల్లో 25 కోట్ల రూపాయ‌ల మేర‌కు మింగేశార‌ని గుర్తించింది. అక్రమాలు, నిబంధనల ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి. అక్టోబర్ 29 నుంచి నవంబర్ 2 వ‌ర‌కు ఏసీబీ అధికారులు బృందాలుగా ఏర్ప‌డి తనిఖీలు నిర్వహించారు. ప్ర‌ధానంగా ఆసుప‌త్రిలో వివిధ కార‌ణాల‌తో రోగులు మరణించిన 3 నెలల తర్వాత కూడా బిల్లులు ప్రాసెస్ చేసినట్లు గుర్తించారు. ఈ బిల్లుల్లో 20-30 శాతం క‌మీష‌న్లు నొక్కేశార‌ని అధికారులు త‌మ నివేదిక‌లో పేర్కొన్నారు. ఇక‌, ఆసుప‌త్రిలో వైద్యులు, సిబ్బంది వినియోగించే గ్లౌజ్‌(చేతుల‌కు ధ‌రించేవి)ల విష‌యంంలో కూడా ప‌క్కా అవినీతి క‌నిపించింది. ఒక్కొక్క‌ రోగికి వారంలో 800 గ్లౌజుల వరకు వినియోగించిన‌ట్టు పేర్కొని  బిల్లులు పెట్టి సొమ్ము చేసుకున్నారు.

ఆపరేషన్ థియేటర్లలో 5 కోట్ల రూపాయ‌ల‌ విలువైన ఇంప్లాంట్లు, వైద్య సామగ్రిలో అక్రమాలు వెలుగు చూశాయి. ఇంప్లాంట్ల అనధికారిక నిల్వలను ఏసీబీ గుర్తించింది. మ‌రీ ముఖ్యంగా సిబ్బంది నియామకాల్లో నిబంధనల ఉల్లంఘనలు, గడువు ముగిసిన ఆహార పదార్థాల వ్యవహారాలు కూడా తనిఖీల్లో బయటపడ్డాయి. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో ఆసుప‌త్రి సూప‌రింటెండెంట్‌ను గ‌తంలోనే అరెస్టు చేసినా.. ఆయ‌న బెయిల్ తెచ్చుకుని బ‌య‌ట‌కు వ‌చ్చారు. దీనివెనుక ప్ర‌భుత్వంలోని కొంద‌రు చ‌క్రం తిప్పార‌న్న విమ‌ర్శ‌లు వున్నాయి. ఈ ప‌రిణామాల క్ర‌మంలోనే కేంద్రం సీరియ‌స్ అయింది. 

This post was last modified on November 24, 2026 11:49 pm

Share

Recent Posts

టీడీపీ జెండాను తొక్కిన వైసీపీ కార్యకర్తలు.. కరెక్టుగా డీల్ చేసిన గుడివాడ ఎమ్మెల్యే

గుడివాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది.  ఎన్నికల ప్రచారంలో  జరుగుతున్న సమయంలో కొందరు వైసీపీ కార్యకర్తలు…

29 minutes ago

కోర్టుకెక్కుతున్న ‘హనుమాన్’ పంచాయితీ?

2024 సంక్రాంతికి విడుదలై పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషనల్ హిట్టయిన ‘హనుమాన్’ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఆల్రెడీ ‘జై హనుమాన్’…

40 minutes ago

క‌లెక్ట‌ర్‌ తోనే పెట్టుకున్న ఎమ్మెల్యే… తమిళనాట రచ్చ రచ్చ!

``నువ్వు కొంచెం గ్లామ‌ర్‌గా ఉండాలి. పంజాబీ డ్ర‌స్.. నీకు బాగుంటుంది. చీర‌ల సెల‌క్ష‌న్ కూడా బాగోలేదు.``- ఇది ఏదో కామాంధుడు…

44 minutes ago

అవెంజర్స్ అంటే ఇంత పిచ్చి ఉందా

వచ్చే నెల డిసెంబర్ 17 విడుదల కాబోతున్న అవెంజర్స్ డూమ్స్ డే క్రేజ్ చూస్తుంటే మతి పోవడమనే మాట చిన్నదనిపిస్తుంది.…

1 hour ago

దాదా ముందూ వెనకా ఎన్నో సవాళ్లు

బాలకృష్ణ దాదా విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదు. డిసెంబర్ 24 రిలీజ్ కన్ఫర్మ్ చేస్తూ కౌంట్ డౌన్ పోస్టర్లు…

1 hour ago

తరుణ్ భాస్కర్ నుంచి కోరుకునేది ఇదే

కీడా కోలా నుంచి ఆశించిన ఫలితం దక్కకపోవడంతో నటుడిగా కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టిన తరుణ్ భాస్కర్ ఇటీవలే…

2 hours ago