2024 సంక్రాంతికి విడుదలై పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషనల్ హిట్టయిన ‘హనుమాన్’ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఆల్రెడీ ‘జై హనుమాన్’ అనే సీక్వెల్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ‘హనుమాన్’ నిర్మాత నిరంజన్ రెడ్డి బేనర్లో కాకుండా.. మైత్రి మూవీ మేకర్స్‌లో తీస్తున్నాడు ప్రశాంత్. కానీ కొన్ని రోజుల ముందు నిరంజన్ రెడ్డి వేరుగా ‘హనుమాన్’ సీక్వెల్ ప్రకటించి పెద్ద షాకిచ్చాడు. ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ దర్శకుడు వీఐ ఆనంద్ ఈ చిత్రాన్ని రూపొందించనుండగా.. మెగా ఫ్యామిలీ హీరో పంజా వైష్ణవ్ తేజ్ ఇందులో లీడ్ రోల్ చేయబోతున్నాడు.
ఒకే టైంలో ఒక సినిమాకు రెండు సీక్వెల్స్ ఏంటి అంటూ అందరూ తలలు పట్టుకున్నారు. ప్రశాంత్ వర్మ.. ప్రైమ్ షో బేనర్లో కాకుండా మైత్రి సంస్థలో ‘హనుమాన్’ సీక్వెల్ మొదలుపెట్టినపుడే నిరంజన్ రెడ్డితో విభేదాలున్నాయని అందరికీ అర్థమైంది. కానీ నిరంజన్ రెడ్డి వేరుగా సీక్వెల్ కోసం పేరున్న దర్శకుడితో స్క్రిప్టు రెడీ చేయించి, పెద్ద బ్యాగ్రౌండ్ ఉన్న హీరోతో సినిమాను అనౌన్స్ చేయడంతో ఇది చిన్న వివాదం కాదని అర్థమైపోయింది.
కాగా ఈ వివాదం ఇప్పుడు ఇంకా పెద్ద స్థాయికి వెళ్లే సంకేతాలు కనిపిస్తున్నాయి. తనకు పోటీగా ‘హనుమాన్’కు సీక్వెల్ అనౌన్స్ చేయడాన్ని ప్రశాంత్ వర్మ తేలిగ్గా వదిలేలా కనిపించడం లేదు. ‘హనుమాన్’ సీక్వెల్ హక్కులు తనకే సొంతం అంటూ అతను కోర్టుకు వెళ్తున్నాడట. ఈ వివాదాన్ని పరిష్కరంచడానికి ఇప్పటికే కొందరు సినీ పెద్దలు ప్రయత్నించినా కూడా ఫలితం లేకపోయిందని తెలుస్తోంది.
ఇరు వర్గాలు పంతానికి పోతుండడంతో వ్యవహారం కోర్టులోనే తేలబోతోంది. మరి కోర్టు ఏం తేలుస్తుందో చూడాలి. ప్రశాంత్ వర్మకు, నిరంజన్ రెడ్డికి మధ్య రూ.23 కోట్ల మొత్తానికి సంబంధించిన సెటిల్మెంట్ దగ్గర పీటముడి బిగుసుకుందని.. అది తేలకపోవడంతోనే నిరంజన్ రెడ్డి వేరుగా సీక్వెల్ అనౌన్స్ చేసే వరకు పరిస్థితి వెళ్లిందని ఇండస్ట్రీలో చర్చ నడుస్తోంది. మరి ఈ వివాదం ఎలా పరిష్కారం అవుతుందో.. నిరంజన్ రెడ్డి అనౌన్స్ చేసిన ‘హనుమాన్-2’ కూడా తెరకెక్కితే పరిస్థితి ఏంటో చూడాలి.
This post was last modified on November 24, 2026 11:39 pm
గుడివాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో జరుగుతున్న సమయంలో కొందరు వైసీపీ కార్యకర్తలు…
``నువ్వు కొంచెం గ్లామర్‌గా ఉండాలి. పంజాబీ డ్రస్.. నీకు బాగుంటుంది. చీరల సెలక్షన్ కూడా బాగోలేదు.``- ఇది ఏదో కామాంధుడు…
వచ్చే నెల డిసెంబర్ 17 విడుదల కాబోతున్న అవెంజర్స్ డూమ్స్ డే క్రేజ్ చూస్తుంటే మతి పోవడమనే మాట చిన్నదనిపిస్తుంది.…
బాలకృష్ణ దాదా విడుదల తేదీలో ఎలాంటి మార్పు లేదు. డిసెంబర్ 24 రిలీజ్ కన్ఫర్మ్ చేస్తూ కౌంట్ డౌన్ పోస్టర్లు…
కీడా కోలా నుంచి ఆశించిన ఫలితం దక్కకపోవడంతో నటుడిగా కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టిన తరుణ్ భాస్కర్ ఇటీవలే…
తెలంగాణ రక్షణ సేన(టీఆర్ ఎస్) పేరుతో సొంత పార్టీ పెట్టుకున్న మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె, మాజీ ఎంపీ.. కవిత…