Political News

మాట నిలబెట్టుకోలేక పోయాను.. క్షమించండి

రాజకీయాల్లో నైతిక విలువలు తగ్గిపోతున్నాయని మేధావులు, ప్రజాస్వామికవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కొన్ని కుటుంబాలు నేటికీ కొన్ని విలువల్ని పాటిస్తున్నాయి. గౌతు లచ్చన్న కుటుంబం అందులో ఒకటి. అందుకే పలాస ప్రజలు గౌతు కుటుంబాన్ని ఆదరిస్తూ వస్తున్నారు. ఇప్పుడీ ప్రస్తావన ఎందుకంటే…

ఇటీవల రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. ఎన్నికల ప్రచారంలో భాగంగా పలాస- కాశీబుగ్గ మున్సిపాలిటీలో వైస్ చైర్మన్ పదవిని కళింగ కోమాట్లకు ఇస్తానని ఎమ్మెల్యే గౌతు శిరీష మాట ఇచ్చారు. అయితే ఎన్నికల తరువాత టీడీపీ అధిష్టానం కూటమి ధర్మంలో భాగంగా ఈ సీటును జనసేనకు కేటాయించింది. అధిష్టానం నిర్ణయాన్ని ఎమ్మెల్యే శిరీష శిరసావహించక తప్పని పరిస్థితి. దాంతో వైస్ చైర్మన్ పదవి జనసేనకు దక్కింది. కళింగ కోమాట్లకు ఇచ్చిన మాట నెరవేరలేదు.

మరో ఎమ్మెల్యే అయితే ఈ విషయాన్ని పెద్దగా పట్టించుకునే వారు కాదు. లైట్ గా తీసుకునే వారు. అవసరమైతే ఇంకోసారి న్యాయం చేస్తానంటూ మరో హామీ ఇచ్చి చేతులు దులుపుకునే వారు. కానీ గౌతు కుటుంబానికి అలా చేయడం ఇష్టం లేదు. మాట తప్పానే అనే ఆవేదనకు గురయ్యారు ఎమ్మెల్యే గౌతు శిరీష. అందుకే కళింగ కోమాట్లకు క్షమాపణలు కోరుతూ ఒక వీడియో విడుదల చేశారు.

మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక పోయాను.. నన్ను క్షమించండి. వైస్ చైర్మన్ పదవికి అభ్యర్థిని ఎమ్మెల్యేనే నిర్ణయిస్తారని భావించాను. కానీ నేరుగా అధిష్టానమే వైస్ చైర్మన్ అభ్యర్థిని నియమించింది. పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించింది. నేనేమి మాట్లాడలేని పరిస్థితి. నన్ను అర్ధం చేసుకొండి. మీకు ముఖం చూపించలేక పోతున్నాను.. అంటూ వేడుకోవడం పార్టీ నాయకులను, కళింగ కోమటి సామాజికవర్గ నాయకులను కదిలించింది. 

నిజానికి పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో  మొత్తం 36 వార్డులుండగా అందులో 32 స్థానలను కూటమి గెలుచుకుంది. అందులోనూ టీడీపీ ఒక్కటే 28 స్థానాల్లో విజయం సాధించింది. జనసేన కేవలం మూడు చోట్ల మాత్రమే గెలిచింది. అయినప్పటికీ పొత్తు ధర్మం అంటూ జనసేనకు వైస్ చైర్మన్ పదవిని కేటాయించడం టీడీపీ నాయకులు, కార్యకర్తలకు మింగుడు పడటం లేదు. అత్యధిక స్థానాల్లో విజయం సాధించిన టీడీపీకి కాదని అతి తక్కువ స్థానాల్లో గెలిచిన జనసేనకు పదవి కట్టబెట్టారన్న అసంతృప్తి వ్యక్తం అవుతోంది.

పలాస మున్సిపాలిటీ రెండో అతిపెద్ద కమ్యూనిటీగా వున్న కళింగ కోమట్లు మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీకి అండగా నిలిచారు. మంత్రి అచ్చెన్నాయుడు, కేంద్రమంత్రి రామ్మోహననాయుడు సమక్షంలో పలాసలో సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే శీరీష వైస్ చైర్మన్ పదవి ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడా హామీ నెరవేర్చనందుకు ఇంటింటికీ వచ్చి సారీ చెబుతానంటున్నారు.

This post was last modified on November 25, 2026 10:39 am

Share

Recent Posts

సుప్రీమ్ హీరో గట్టెక్కే సూచనలు ఎక్కడ

2027 సంక్రాంతి ఎంతో దూరంలో లేదు. త్వరలో పూర్తి కాబోతున్న నవంబర్ నెలని మినహాయిస్తే ఇంకో నలభై రెండు రోజులు…

4 hours ago

రాజమౌళి ముందే ఫిక్సయ్యారు కాబోలు

వారణాసి ఏప్రిల్ 7 విడుదల కావడం గురించి ఇండస్ట్రీలోనే కాదు ట్రేడ్ వర్గాల్లోనూ అనుమానాలు మొదలయ్యాయి. వాయిదా గురించి ఎలాంటి…

5 hours ago

రావిపూడికి రిపేర్ చేయాల్సిన అవసరముందా

ప్రతి సంక్రాంతికి కొత్త సినిమా రిలీజ్ చేయడమే సంకల్పంగా పెట్టుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి ఈసారి జనవరి 12 విడుదలతో…

8 hours ago

ఆ వైద్య కళాశాలలో ఏం జరుగుతోంది?

తెలంగాణ రాజ‌ధాని హైదరాబాద్‌లో నిజాం కాలం నాటి నుంచి పేద రోగుల‌కు సేవ‌లు అందిస్తున్న నిజాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిక‌ల్…

11 hours ago

టీడీపీ జెండాను తొక్కిన వైసీపీ కార్యకర్తలు.. కరెక్టుగా డీల్ చేసిన గుడివాడ ఎమ్మెల్యే

గుడివాడ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో అనూహ్య సంఘటన చోటు చేసుకుంది.  ఎన్నికల ప్రచారంలో  జరుగుతున్న సమయంలో కొందరు వైసీపీ కార్యకర్తలు…

11 hours ago

కోర్టుకెక్కుతున్న ‘హనుమాన్’ పంచాయితీ?

2024 సంక్రాంతికి విడుదలై పాన్ ఇండియా స్థాయిలో సెన్సేషనల్ హిట్టయిన ‘హనుమాన్’ సినిమాకు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో ఆల్రెడీ ‘జై హనుమాన్’…

11 hours ago