Movie News

దీపికా విషయంలో సందీప్ వంగానే కరెక్ట్

ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందుతున్న స్పిరిట్ షూటింగ్ మొదలుకాక ముందు హాట్ టాపిక్ గా మారింది హీరోయిన్ దీపికా పదుకునే. ఆమెను తప్పించి యానిమల్ ఫేమ్ త్రిప్తి డిమ్రిని తీసుకోవడం ముంబై వర్గాలను సైతం షాక్ కు గురి చేసింది. స్టార్ హీరోయిన్ స్థానంలో ఒక అప్ కమింగ్ ఆర్టిస్టుని తీసుకోవడం ద్వారా సందీప్ పెద్ద ఛాలెంజ్ స్వీకరించారని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. తాజాగా సందీప్ సోదరుడు ప్రణయ్ వంగా దీని గురించి ఓపెన్ అయ్యారు.

దీపికా పదుకునే డిమాండ్లు తాళలేకే ఆమెను వదులుకున్నట్టు కుండబద్దలు కొట్టేశారు. ఇటీవలే ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాలు పంచుకున్నారు. పారితోషికంతో పాటు లాభాల్లో పది శాతం అదనంగా డిమాండ్ చేయడమే కాకుండా.. పని గంటలు ఆరుకి మించకూడదని పెట్టిన కండీషన్లు సందీప్ వంగాని వేరే ఆప్షన్ వైపు మళ్ళించాయని క్లారిటీ ఇచ్చారు. షూట్ కు ముందు ఈ పాత్ర కోసం ఏడాదిన్నర దీపికాతో ట్రావెల్ చేసిన స్పిరిట్ సృష్టికర్త సరైన నిర్ణయమే తీసుకున్నారు.

వాస్తవంగా చెప్పాలంటే బాలీవుడ్ హీరోయిన్ల డిమాండ్లకు మరీ తలొగ్గాల్సిన అవసరం లేదు. సౌత్ లో ఎంత మంచి అవకాశాలు వస్తాయో, బ్రేక్ దక్కితే కెరీర్ ఎలా పుంజుకుంటుందో అక్కడ చాలా మందికి తెలుసు. కియారా అద్వానీ, కృతి సనన్, జాన్వీ కపూర్ లాంటి ఎందరో ఇక్కడ మర్చిపోలేని హిట్స్ అందుకున్నారు. దీపికా పదుకునే కల్కి 2 విషయంలోనూ బెట్టు చేసి దర్శకుడు నాగ్ అశ్విన్ ని సైతం వేరే ఛాయస్ కు వెళ్లిపోయేలా చేయడం అభిమానులు ఇంకా మర్చిపోలేదు.

సందీప్ వంగా ఇక్కడ నష్టపోయింది ఏమి లేదు. దీపికా లేనంత మాత్రాన కథలో ఇంటెన్సిటీ తగ్గదు. తను కోరుకున్న అవుట్ ఫుట్ మారదు. యానిమల్ లో రష్మిక మందన్నని తీసుకునే సమయానికి తనకు హిందీలో వరస ఫ్లాపులు ఉన్నాయి. అయినా ఏమయ్యింది. పెద్ద బ్రేక్ అందుకుని బిజీగా మారిపోయింది. అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ లో కియారా కోరి మరీ ప్రాణం పెట్టి నటించింది. ఇదంతా ఏమో కానీ అల్లు అర్జున్ రాకాకు ఇలాంటి కండీషన్లు ఒప్పుకునే అట్లీ ఆమెతో ఓకే చేయించుకున్నారా. ఏమో మరి. 

This post was last modified on August 20, 2026 10:26 pm

Share

Recent Posts

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

2 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

3 hours ago

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది…

3 hours ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

4 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

4 hours ago

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

4 hours ago