Movie News

అనుపమ కరెక్టే అన్న శంకర కూతురు

అనుపమ పరమేశ్వరన్.. ఈ మలయాళ కథానాయిక వ్యక్తిగత వ్యవహారం గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాను ముంచెత్తుతున్న సంగతి తెలిసిందే. ఒక తమిళ సినిమా చేస్తున్న టైంలో ఆ కథానాయకుడితో ప్రేమలో పడ్డ ఆమె.. అతడితో రెండేళ్లు ప్రయాణం చేసింది. కానీ అతడితో అభిప్రాయ భేదాలు వచ్చి ఈ ఏడాది తన నుంచి విడిపోయింది. ఐతే తనతో రిలేషన్‌షిప్‌లో ఉన్నంత కాలం ఏమీ మాట్లాడని అనుపమ.. బ్రేకప్ తర్వాత తన ఎక్స్‌ లవర్ మీద అనేక ఆరోపణలు చేస్తోంది.

అదొక టాక్సిక్ రిలేషన్‌షిప్ అని.. అతడి వల్ల మానసిక వేదన అనుభవించానని.. తనను కాపాడాల్సిన వాడే నాశనం చేయాలని చూశాడని.. అతడి వల్ల తన ఆరోగ్యం కూడా దెబ్బ తిందని.. అతను తన పీరియడ్స్ మీద కూడా తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడని.. ఇలా ఎన్నో ఆరోపణలు చేసింది అనుపమ. ఐతే ఎక్కడా పేరు ప్రస్తావించకపోయినా.. ఆమె ఆరోపణలన్నీ ఆ తమిళ యువ హీరోనే అన్నది ఓపెన్ సీక్రెట్. దీనిపై ఇటీవల అతను కూడా ఇన్‌డైరెక్ట్‌గా స్పందించాడు కూడా.

ఐతే సోషల్ మీడియాలో చాలామంది అనుపమ వైపే ఉండగా.. కొందరు అతడి వైపు నిలుస్తున్నారు. ఈ వ్యవహారాన్ని ఒకవైపే చూడడం కరెక్ట్ కాదంటున్నవాళ్లూ ఉన్నారు. సినీ ప్రముఖుల్లో మాత్రం ఎవ్వరూ దీని మీద ఇప్పటిదాకా స్పందించలేదు. ఇది వ్యక్తిగత వ్యవహారం కాబట్టి అలా మౌనం వహిస్తున్నారు. ఐతే తమిళ లెజెండరీ డైరెక్టర్ శంకర్ తనయురాలు, కథానాయిక అదితి శంకర్ మాత్రం ఒక ఇంటర్వ్యూలో ఈ వ్యవహారం మీద స్పందించింది. ఆమె హీరోని ఏమీ నిందించకుండానే, అనుపమ ఇలా మాట్లాడడాన్ని కొనియాడింది.

‘‘ఈ మధ్య నేను ఒక ఇంటర్వ్యూ చూశాను. దాని మీద జనాలకు భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. కానీ నాకు మాత్రం ఆమె జనాల్లో ఎంతో అవగాహన తీసుకొచ్చినట్లు అనిపించింది. రిలేషన్‌షిప్‌‌లో ఇలాంటి అనుభవాలు ఎదుర్కొంటున్న వాళ్లు తాము కూడా ఇందులో భాగం అని తెలుసుకునేలా చేసింది. ఆమె కథలో నిజాయితీ ఉందనిపించింది. ఆమెకు అవతలి వ్యక్తిని తక్కువ చేయడం ఉద్దేశం కాదనుకుంటున్నా. నేనిక్కడ తీసుకోవాలనుకుంటున్న విషయం.. ఆమె ఇతరులలో అవగాహన పెంచే ప్రయత్నం చేయడం’’ అంటూ అనుపమ పేరు పెట్టకుండా ఆమెను కొనియాడింది అదితి.

This post was last modified on August 21, 2026 10:55 pm

Share

Recent Posts

13 కోట్ల ఓట్లు ఎవరి అనుమతితో తొలగించారు?

కాక్రోచ్ పార్టీ మరో ఉద్యమానికి శ్రీకారం చుట్టింది. నీట్ పేపర్ లికేజి వ్యవహారంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర చేపట్టిన…

44 minutes ago

ట్రబుల్ తట్టుకుని నిలబడుతుందా

రాజమౌళి ఫ్యామిలీ మొత్తం ప్రమోషన్లు చేసింది. మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ ప్రత్యేకంగా పొడవైన ట్వీట్ రివ్యూలతో సినిమాను మెచ్చుకున్నారు.…

1 hour ago

గరివిడి లక్ష్మి చేస్తోంది పెద్ద సాహసమే

దసరా పండక్కు భారీ పోటీ నెలకొనడం చూస్తున్నాం. సంక్రాంతి రేంజులో మూడు పెద్ద సినిమాలు క్యూ కట్టడం బయ్యర్ వర్గాల్లో…

1 hour ago

అద్భుత ప్రయోగాల నిలయం ‘సింగీతం’

లెజండరీ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూయడం యావత్ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేసింది. 94 వయసులో కూడా సినిమా తీయడానికి…

2 hours ago

ఒక్క పిల్ల‌ర్‌పైనే వైసీపీ భారం… !

వైసీపీ... ఇప్పుడు ఏపీ రాజ‌కీయాల్లో ప్ర‌ధానంగా చ‌ర్చ‌కు వ‌స్తున్న పార్టీ. ఈ పార్టీ ప్ర‌భావం నానాటికి త‌గ్గిపోతోంద‌న్న వాద‌న ఒక‌వైపు…

5 hours ago

తండ్రీ కొడుకుల వెరైటీ క్లాష్

బాక్సాఫీస్ విచిత్రాలు కొన్ని భలే ఉంటాయి. వచ్చే నెల నవంబర్ 20 దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార విడుదల…

6 hours ago