Political News

ప‌వ‌న్ చెప్పిందేంటి.. సేన‌ల‌కు అర్థ‌మైంది ఏంటి?

స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌కు సంబంధించి జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిందేంటి? క్షేత్ర‌స్థాయిలో జ‌న‌సేన నాయ‌కుల‌కు అర్ధ‌మైంది ఏంటి? అనేది ఆసక్తిగా మారింది. వ‌చ్చే స్థానిక ఎన్నిక‌ల్లో విజ‌య‌వాడ‌, ఏలూరు, విశాఖ‌, తిరుప‌తి మునిసిప‌ల్ కార్పొరేష‌న్ మేయ‌ర్ స్లానాల‌ను జ‌న‌సేన పార్టీ నాయ‌కులు కోరుకుంటున్నారు. ఈ విష‌యం అధినేత‌కు కూడా తెలుసు. కానీ, ఇవే స్థానాల్లో టీడీపీ కూడా బ‌లంగా ఉంది. అయితే.. ఈ విష‌యం వివాదాల‌కు దారితీసే అవ‌కాశం ఉన్న నేప‌థ్యంలో స‌మ‌న్వయ క‌మిటీల‌ను వేశారు.

అయితే.. క‌మిటీలు ఒక‌వైపు స‌ర్దుబాటు చేస్తున్నా.. మ‌రోవైపు నాయ‌కులు మాత్రం ఈ మేయ‌ర్‌పీఠాల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేస్తున్నారు. తిరుపతి, ఏలూరు ప్రాంతాల్లో మేయ‌ర్ పీఠాలు త‌మ‌కు ఇవ్వాల‌ని.. తాము రెడీగా ఉన్నామ‌ని కొంద‌రు నాయ‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. ఆయా జిల్లాల జ‌న‌సేన పార్టీ నాయ‌కులే ఈ వ్యాఖ్య‌లు చేయ‌డం గ‌మ‌నార్హం. దీనికి ప‌వ‌న్ క‌ల్యాణ్ ఈ నెలలో చేసిన వ్యాఖ్య‌ల‌ను వారు గుర్తు చేస్తున్నారు. ఫ్రెండ్లీ పోటీ ఉన్న చోట పోటీ చేయండి అని ప‌వ‌న్ క‌ల్యాణ్ చెప్పిన మాట వాస్త‌వ‌మే.

కానీ, దీన‌ర్ధం ఇరు ప‌క్షాలు వివాదానికి దిగ‌మ‌ని కాదు. కానీ, నాయ‌కులు ప‌వ‌న్ చెప్పిన మాటల్లోని అంత‌రార్థాన్ని వ‌దిలేసి.. ఫ్రెండ్లీ పోటీకి రెడీ అంటున్నారు. వాస్త‌వానికి ఫ్రెండ్లీ పోటీ అంటే.. రెండు ప‌క్షాలు ఏక‌గ్రీవంగా ఒక మాట అనుకుని.. ఆ మేర‌కు రంగంలోకి దిగాల్సి ఉంటుంద‌ని ప‌వ‌న్ క‌ల్యాణ్ చెబుతున్న మాట‌. కానీ, ఏలూరు, తిరుప‌తి, విశాఖ‌, విజ‌య‌వాడల్లో టీడీపీ నేత‌లు కూడా మేయ‌ర్ పీఠాల‌కు అభ్య‌ర్థుల‌ను రెడీ చేసుకున్నారు. విజ‌య‌వాడ‌లో టీడీపీ ఎమ్మెల్యే త‌న‌యుడు రెడీ అయ్యారు.

విశాఖ‌లో బీజేపీ ఎంపీ స‌తీమ‌ణి ఒక‌రు రెడీ అయ్యారు. తిరుప‌తిలో టీడీపీ సీనియ‌ర్ నాయ‌కురాలు సై అంటున్నారు. ఏలూరులో ఎమ్మెల్యే కుటుంబం నుంచి ఓ వార‌సుడు రెడీగా ఉన్నారు. ఇలా.. వారంతా రెడీ అంటున్నా.. జ‌న‌సేన నాయ‌కులు.. వారితో చ‌ర్చించ‌డం లేదు. కేవ‌లం రాజ‌కీయంగా కామెంట్లు చేస్తున్నారు. దీనికి ప‌వ‌న్ వ్యాఖ్య‌ల‌ను జోడిస్తున్నారు. ఇది మ‌రింత వివాదానికి దారి తీసే ప‌రిస్థితి త‌ప్ప స‌ర్దుబాటు ధోర‌ణికి, లేదా ఫ్రెండ్లీ పోటీకి దారితీసేలా లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on September 30, 2026 10:08 pm

Share

Recent Posts

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

10 minutes ago

ఈ అరాచకమేంటి గిల్ బాబు

వన్డేల్లో ఒక్క డబుల్ సెంచరీ కొట్టడమే చాలా అరుదు. శుభ్‌మన్ గిల్ మాత్రం రెండోసారి 200 మార్క్ దాటేశాడు. వెస్టిండీస్‌తో…

2 hours ago

జ‌గ‌న్‌కు షాక్ ఇవ్వాలని ఫిక్స్ అయిన సాయిరెడ్డి

వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా పార్టీ పెట్ట‌నున్న‌ట్టు రాజ్య‌స‌భ మాజీ స‌భ్యుడు సాయిరెడ్డి చెప్పారు. తాజాగా విశాఖ‌ప‌ట్నంలో మాట్లాడిన ఆయ‌న‌..…

2 hours ago

తండ్రిపై ప్రేమ‌.. శ‌వాన్ని నాలుగేళ్లుగా.. !

తల్లిదండ్రుల‌పై ప్రేమ ఉండాల్సిందే. కానీ, అది వారు జీవించినంత వ‌ర‌కు ఉండాల్సిందే. కానీ, జ్యాత‌స్య‌హి ధ్రువో మృత్యు.. అన్న‌ట్టుగా కాలం…

2 hours ago

దుబాయ్ విమానంలో ఫైటింగ్… 180 మందిని కాపాడిన ఇండియన్ కెప్టెన్

భూమికి 33 వేల అడుగుల ఎత్తులో... ఆకాశంలో యుద్ధం జరిగింది. సినిమాను తలపించిన ఈ యుద్ధంలో హీరో ఇండియన్ కెప్టెన్…

2 hours ago

405 అయినా సరే… తగ్గేదే లే!!

వన్డేల్లో 405 పరుగులు చేసిన తర్వాత కూడా ఓడిపోతామని వెస్టిండీస్ ఊహించి ఉండదు. గువాహటిలో ఆ జట్టు బ్యాటర్లు చెలరేగిపోయారు.…

2 hours ago