తమిళ స్టార్ హీరోల్లో ఒకడైన రవి మోహన్ అలియాస్ జయం రవి.. ఈ మధ్య సినిమాలతో కంటే వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వివాదాలతోనే వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. తన భార్య ఆర్తికి అతను మూడేళ్లుగా దూరంగా ఉంటున్నాడు. కోర్టులో వీరి విడాకుల కేసు సుదీర్ఘ కాలంగా నడుస్తుండగా.. ఈలోపు భార్యకు రవి నెలవారీ ఖర్చుల కోసం డబ్బులు ఇచ్చే విషయమై వివాదం నెలకొంది. తనకు నెలకు రూ.40 లక్షలు చెల్లించాలని ఆర్తి డిమాండ్ చేయగా, రూ.3 లక్షలు మాత్రమే చెల్లించేలా ఇటీవల కోర్టు ఆదేశాలు జారీ చేయడం చర్చనీయాంశమైంది.
ఇది ఆర్తికి చెంపపెట్టు లాంటి తీర్పు అంటూ సోషల్ మీడియాలో వ్యాఖ్యానాలు వినిపించాయి. నెలకు రూ.40 లక్షలు అడగడం అంటే మరీ అత్యాశ కదా అనే చర్చ జరిగింది. ఐతే ఆ 40 లక్షల లెక్క గురించి ఆర్తి తల్లి, రవి మోహన్ అత్త సుజాత ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడరు. ఆమె రవి మోహన్ మీద తీవ్ర వ్యాఖ్యలే చేశారు.
ఆర్తి నెలకు రూ.40 లక్షలు ఇవ్వమని ఊరికే అడగలేదని.. రవి మోహన్ సినిమాల కోసం తమ కుటుంబం రూ.100 కోట్ల దాకా ఖర్చు చేసిందని, అప్పులు చేసిందని, ఆ డబ్బులకు వడ్డీలు కట్టడానికే అంత మొత్తం అడిగామని సుజాత చెప్పారు. రవి గత రెండేళ్లుగా పిల్లల బాగోగులు చూసుకోవడం లేదని.. వారి తిండి, చదువు, ఇతర ఖర్చులకు డబ్బులు ఇవ్వడం లేదని ఆమె అన్నారు. రవి ఇప్పుడు ఇచ్చే డబ్బులు అతడి పిల్లల తిండికి మాత్రమే సరిపోతాయని, వారి చదువులకు ఎవరు ఖర్చు చేస్తారని ఆమె ప్రశ్నించారు.
పిల్లల స్కూల్ ఫీజుల బకాయిలు రూ.86 లక్షలు ఉన్నాయని, ఆ డబ్బులు చెల్లించాలని కోర్టు చెప్పిందని ఆమె పేర్కొంది. తాను తన పిల్లలను పెంచమంటే పెంచుతా కానీ.. రవి పిల్లల్ని పెంచాల్సిన అవసరం తనకు లేదని ఆమె స్పష్టం చేశారు. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకునే తన కుమార్తె నెలకు రూ.40 లక్షలు ఇవ్వాలని కోరిందని, దీని మీద దుష్ప్రచారం తగదని ఆమె అన్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
