కీలకమైన వీక్ డేస్ పరీక్షలో ప్యారడైజ్ తడబడుతోంది. మొదటి నాలుగు రోజులు ఆదివారం దాకా ట్వంటీ ట్వంటీ మ్యాచ్ ఆడిన నాని ఊహించినట్టుగా బాగా నెమ్మదించాడు. హైదరాబాద్ లాంటి నైజం మెయిన్ సెంటర్స్ లో ఇబ్బంది లేదు కానీ ఉత్తరాంధ్ర, సీడెడ్ లాంటి ప్రాంతాల్లో అలారం మ్రోగిన తరహాలో ఆక్యుపెన్సీలు తగ్గినట్టు ట్రేడ్ రిపోర్ట్స్ చెబుతున్నాయి. టీమ్ ఆపకుండా ప్రమోషన్లు చేస్తూనే ఉంది. తాజాగా సమ్మక్క సారక్క దర్శనం కోసం బృందం మొత్తం మేడారం వెళ్లి వచ్చింది.
మరి ప్యారడైజ్ సండే దాకా అంత భారీ కలెక్షన్లు రాబట్టి హఠాత్తుగా ఇంత తగ్గడాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చనే కోణంలోకి వద్దాం. కెజిఎఫ్ రేంజ్ లో కనక టాక్ వచ్చి ఉంటే ఇప్పుడీ డిస్కషన్ వచ్చేది కాదు. సోషల్ మీడియా నెగటివిటీ ప్రభావం క్రమంగా పెరుగుతోంది. పబ్లిక్ టాక్ కూడా ఏమంత ఆశాజనకంగా లేకపోవడం వల్ల మిక్స్డ్ టాక్ తో పాటు సెన్సార్ ఏ సర్టిఫికెట్ ఫ్యామిలీ ఆడియన్స్ ని దూరం చేసింది. అందులోనూ కొందరు తెలంగాణ నేటివిటీ మూవీగా ఎక్స్, ఇన్స్ టాలో అతిగా ప్రచారం చేయడం మరో దెబ్బ.
జరుగుతున్నదంతా నాని, శ్రీకాంత్ ఓదెలకు తెలుసు. కలెక్షన్ రిపోర్ట్ షీట్స్ ని నానికి చూపించి మరీ ఆ వీడియో వదిలిన మైత్రి శశి ఇప్పుడా పని చేయలేరు. ఎందుకంటే డ్రాప్స్ కి, ముందు వచ్చిన నెంబర్లకు దూరం ఉంటుంది కాబట్టి. మళ్ళీ ఇంకో వీకెండ్ కి పికప్ ఉండొచ్చు. కాని సాధారణ రోజుల్లో డీసెంట్ హోల్డ్ ఉంటేనే ట్రేడ్ కోరుకున్న మేజిక్ నెంబర్లు సాధ్యమవుతాయి. ఇరుముడి అసలు రోజుతో సంబంధం లేకుండా పాతిక రోజులు నాన్ స్టాప్ గా చేసిన బ్యాటింగ్ ఇక్కడ గుర్తు చేసుకోవాలి.
ఎలా చూసినా నాని పుల్లింగ్ పవర్, మార్కెట్ పెరిగాయనేది వాస్తవం. కాకపోతే కుటుంబ ప్రేక్షకులను మరీ దూరం చేసుకోకుండా, ఓవర్ వయొలెన్స్ కి ప్రాధాన్యం ఇవ్వకుండా బాలన్స్డ్ సబ్జెక్టుల మీద దృష్టి పెడితే బాగుంటుంది. ఎలా అంటే అల వైకుంఠపురములో చేసిన అల్లు అర్జునే పుష్ప ఎంచుకున్నాడు. ఇప్పుడు రాకా అనే ఫాంటసీ జానర్ కు వెళ్ళిపోయాడు. కెజిఎఫ్ తరహా కథలను వద్దనుకున్నాడు. నాని కూడా ఇదే తరహాలో ఆలోచించాలి. బ్లడీ రోమియో దానికి మొదటి అడుగు అవుతుందేమో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates
