దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తోనే సినిమా స్థాయిని రెండు మూడింతలు పెంచే టాలెంట్ తనకు మాత్రమే సొంతం. జైలర్, దేవర, విక్రమ్ కన్నా ఉదాహరణలు అక్కర్లేదు. అలాంటి అనిరుధ్ ఈ మధ్య బాగా తగ్గాడు. డిసి, ప్యారడైజ్ లో ఆయా షేర్ పాట మినహాయిస్తే గత ఏడాది కాలంలో తను కంపోజ్ చేసిన జన నాయకుడు, ఎల్ఐకె, మదరాసి, కింగ్డమ్, ఇండియన్ 2 అన్నీ ఫెయిల్యూర్సే.
ఇలాంటి టైంలో దర్శక నిర్మాతలు మరో బలమైన ప్రత్యాన్మయం కోసం ఎదురు చూస్తున్న టైంలో వాళ్లకు సాయి అభ్యంక్కర్ దొరికాడు. ఏ టైంలో అట్లీ తనను ‘రాకా’ కోసం లాక్ చేసుకున్నాడో అప్పటి నుంచి దశ తిరిగిపోయింది. అది ఎప్పుడు రిలీజవుతుందో కానీ దానికన్నా ముందు చేస్తున్న సినిమాలు ఒకదాన్ని మించి మరొకటి సక్సెస్ కొడుతూ సాయి డిమాండ్ పెంచేస్తున్నాయి. ప్రదీప్ రంగనాధన్ ‘డ్యూడ్’ తో మొదలుపెట్టిన కెరీర్ సూర్య ‘కరుప్పు’తో మరింత బలమైన పునాది వేసుకుంది.
తాజాగా విడుదలైన విజయ్ సేతుపతి ‘బత్తా’కు పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. ఇది కూడా హిట్టు క్యాటగిరీలో పడటం ఖాయమని రివ్యూలు, పబ్లిక్ టాక్ స్పష్టం చేస్తున్నాయి. అంటే కోలీవుడ్ లో సక్సెస్ ఫుల్ గా హ్యాట్రిక్ పూర్తయ్యిందన్న మాట. తన మొదటి మూవీ మలయాళంలో చేసిన ‘బల్టీ’ పెద్దగా ఆడలేదు కానీ మ్యూజిక్ కి పేరొచ్చింది. కానీ తమిళంలో మాత్రం సాయి అభ్యంక్కర్ దూసుకుపోతున్న తీరు చూస్తుంటే అనిరుధ్ కి బెస్ట్ ఆప్షన్ అయ్యేలా ఉన్నాడు.
ఇక్కడో డౌట్ రావొచ్చు. ఇంత ట్రాక్ రికార్డు మెయింటైన్ చేస్తున్న సాయి అభ్యంక్కర్ వెనుక మన టాలీవుడ్ నిర్మాతలు, దర్శకులు పడటం లేదాని. అందులో అనుమానం లేదు. అడుగుతున్నారు, భారీ రెమ్యునరేషన్ ఆఫర్ చేస్తున్నారు. కానీ రాకానే తన తొలి తెలుగు సినిమా కావాలని ముందుగానే ఒప్పందం చేసుకోవడం వల్ల ఇప్పట్లో తన డైరెక్ట్ టాలీవుడ్ సాంగ్స్ వినలేమట. ప్రస్తుతం రాకా కాకుండా తన చేతిలో ధనుష్ ఓమ్, లారెన్స్ బెంజ్, కార్తీ మార్షల్ ఉన్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates
