ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్ ఎలా ఉందనేది పక్కన పెడితే వీటి వల్ల పెద్ది, ప్యారడైజ్ కు ఎంతో కొంత డ్యామేజ్ జరిగింది. అర్ధరాత్రికే టాక్ రకరకాలుగా వెళ్లిపోవడంతో ఉదయం అసలు షో పడేలోపే జనాల మెదళ్ళు ప్రభావితం చెందుతున్నాయి. అయిదారు వందలు టికెట్ రేట్ పెట్టి ఎక్కువ వసూళ్లు తెచ్చుకున్నామన్న ఆనందం కన్నా వీటి వల్ల జరుగుతున్న నష్టం ఎక్కువ చేటు చేస్తున్నది వాస్తవం.
అందుకే ఆదర్శ కుటుంబం ఏకె 47 ప్రీమియర్ల జోలికి వెళ్లడం లేదు. రెగ్యులర్ గా అక్టోబర్ 9 నుంచే రిలీజ్ ఉంటుందని నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇవ్వడంతో ఫ్యాన్స్ హమ్మయ్య అనుకుంటున్నారు. ఆయన నేరుగా చెప్పలేదు కానీ టికెట్ రేట్ల పెంపు కూడా ఉండకపోవచ్చని టాక్. అదే నిజమైతే సామాన్య ప్రేక్షకులకు కూడా గుడ్ న్యూస్ అవుతుంది. ఎందుకంటే వెంకీ గత రెండు సినిమాలు మన శంకరవరప్రసాద్ గారు, సంక్రాంతికి వస్తున్నాం హైక్స్ తీసుకుని లాభపడినవే.
ఆదర్శ కుటుంబం ట్రైలర్ లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్నీ ప్లానింగ్ ప్రకారం జరగబోతున్నాయి. ప్రమోషన్స్ పరంగా కొంచెం లో ప్రొఫైల్ ఉందని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు కానీ టీమ్ మొత్తం చివరి దశ పనుల్లో బిజీగా ఉండటం వల్ల పబ్లిసిటీ మీద దృష్టి పెట్టలేకపోతున్నారని ఇన్ సైడ్ టాక్. గుంటూరు కారం తర్వాత దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ కి రెండున్నరేళ్ల గ్యాప్ వచ్చేసింది. దాని యావరేజ్ ఫలితాన్ని పూర్తిగా మర్చిపోయేలా ఇది బ్లాక్ బస్టరవ్వాలని సినీ ప్రియుల కోరిక.
పాత్రల టీజర్లు, నారాయణమ్మ పాట ఇప్పటిదాకా ఆదర్శ కుటుంబం నుంచి వచ్చిన కంటెంట్. ట్రైలర్ చూశాక హైప్ మోతాదు పెరుగుతుందా లేదానేది చెప్పొచ్చు. తమన్ రీ రికార్డింగ్ మంచి స్వింగ్ లో ఉందట. కేవలం వారం గ్యాప్ లో జైలర్ 2, రణబాలి ఉన్నప్పటికీ కుటుంబం ప్రేక్షకుల అండదండలు ఆదర్శ కుటుంబానికే ఉంటాయని టీమ్ బలంగా నమ్ముతోంది. ఇది అయిపోయిన కేవలం మూడు నెలల గ్యాప్ లో జనవరి 12 విడుదలతో మరోసారి వెంకటేష్ థియేటర్లకు రానున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates
