టాలీవుడ్ విలక్షణ నటుడు దగ్గుబాటి రానా ఇంతకుముదులా వరుసగా సినిమాలు చేయడం లేదు. హీరోగా అయితే సినిమాలు పూర్తిగా ఆపేశాడు. విలన్, క్యారెక్టర్ రోల్స్ విషయంలోనూ ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. అప్పుడప్పుడూ ప్రత్యేక పాత్రల్లో కనిపిస్తున్నాడు. చివరగా రానా పూర్తి స్థాయి పాత్ర చేసింది ‘వేట్టయాన్’లో.
అందులో సూపర్ స్టార్ రజినీకాంత్‌కు విలన్‌గా కనిపించాడు రానా. ఆ తర్వాత ‘మిరాయ్’లో క్యామియో రోల్ చేశాడు. కాంత, పరాశక్తి లాంటి చిత్రాల్లో ప్రత్యేక పాత్రల్లో కనిపించాడు. ఆ తర్వాత రానా నటించే కొత్త సినిమా సంగతులేవీ వినిపించలేదు. ఐతే ఇప్పుడు ఒక క్రేజీ సీక్వెల్లో ఈ దగ్గుబాటి హీరో నటించబోతున్న విషయం వెల్లడైంది. ఆ చిత్రమే.. జై హనుమాన్.
2024 సంక్రాంతికి విడుదలైన సెన్సేషన్ క్రియేట్ చేసిన సోషియో ఫాంటసీ ఫిలిం ‘హనుమాన్’కు సీక్వెల్‌గా తెరకెక్కుతున్న ‘జై హనుమాన్’లో రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. ఈసారి హనుమంతుడి పాత్ర నేపథ్యంలో ఒక పురాణ గాథగా ఈ సినిమాను తెరకెక్కనున్నాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. కాబట్టి ఇందులో చాలా పురాణ పాత్రలు కనిపించబోతున్నాయి. వాటిలో అశ్వథ్థామ పాత్ర కూడా ఒకటి. ఆ పాత్రలో దగ్గుబాటి రానా నటించనున్నాడట.
మహాభారతంలో ఎంతో కీలకంగా, శక్తిమంతంగా కనిపించే ఈ పాత్రకు రానా బాగా సూటవుతాడనడంలో సందేహం లేదు. విశేషమేంటంటే.. బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబ్ బచ్చన్ కూడా ఇదే టైంలో ఆ పాత్ర చేస్తున్నారు. ఇప్పటికే ‘కల్కి’లో ఆయనీ క్యారెక్టర్లో మెప్పించారు. ఆ సినిమాకు ఒక రకంగా ఆయనే హీరో. ఇప్పుడు ‘కల్కి-2’లోనూ ఆ పాత్ర కొనసాగబోతోంది. అమితాబ్ ఆ సినిమా చిత్రీకరణలోనూ పాల్గొంటున్నాడు. ఇలా అమతాబ్ లాంటి లెజెండరీ నటుడు ఒక ఐకానిక్ పాత్ర చేస్తుండగా.. అదే సమయంలో ఆ క్యారెక్టర్‌ను రానా పోషించబోతుండడం అరుదైన విషయమే.
This post was last modified on July 28, 2026 6:59 pm
చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…
ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…
కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…