Political News

ఇకపై అలా జరగదన్న బోండా ఉమ

దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ హాజరు కావడంపై టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్ అయిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ఆ సభలో వైసీపీ నేత అంబటి రాంబాబుతో ఉమ సన్నిహితంగా ఉండడం, చంద్రబాబు ఆదేశాలు బేఖాతరు చేసి వైసీపీ నేతలతో కలిసి వేదిక పంచుకోవడంపై టీడీపీ హై కమాండ్ సీరియస్ అయింది.

ఈ క్రమంలోనే ఈ రోజు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, మంత్రి నిమ్మల రామానాయుడు, కిలారు రాజేష్ లతో ఏర్పాటైన త్రిసభ్య కమిటీని కలిసి బోండా ఉమ వివరణనిచ్చారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఉమ కీలక వ్యాఖ్యలు చేశారు.

ఇకపై వైసీపీ నేతలు హాజరయ్యే కార్యక్రమాలకు తాను హాజరు కాబోనని బోండా ఉమ స్పష్టం చేశారు. తాను పాతికేళ్లుగా పార్టీలో ఉన్నానని, ఏనాడూ పార్టీ లైన్ దాటలేదని అన్నారు. తమ పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశాలు ధిక్కరించేలా ఏరోజూ ప్రవర్తించలేదని, ప్రవర్తించబోనని చెప్పారు. 2019-24 మధ్యకాలంలో ప్రాణాలొడ్డి పార్టీని కాపాడుకునేందుకు ఏ విధంగా పనిచేశానో అందరికీ తెలుసని, అందుకు మీడియా కూడా సాక్షి అని చెప్పారు.

ముద్రగడ సంస్మరణ సభ సందర్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు తన దగ్గరకు వచ్చి పలకరించారని, మాట్లాడుకున్నామని అన్నారు. అది వాస్తవమేనని, బహిరంగ వేదికపైనే జరిగిందని చెప్పారు. కాపు జేఏసీ తరఫున ఆ కార్యక్రమం చేశారని, తనను ఆహ్వానించారు కాబట్టి అన్ని పార్టీలకు చెందిన నేతలతో పాటు వేదికను పంచుకోవాల్సి వచ్చిందని వివరణనిచ్చారు.

కానీ, ఆ విషయం గురించి సోషల్ మీడియాలో తీవ్రస్థాయిలో చర్చ జరిగిందని, ట్రోలింగ్ జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. తన మాటలను వక్రీకరించారని, అక్కడ జరిగిన కలయిక వేరని చెప్పారు. ఈ విషయమే కమిటీ ముందు వివరించానని అన్నారు.

This post was last modified on July 28, 2026 7:10 pm

Share

Recent Posts

పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…

13 minutes ago

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్?

ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…

42 minutes ago

ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…

2 hours ago

అక్టోబర్ మార్కెట్… ఎవరెవరికి జాక్‌‌పాట్

కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…

2 hours ago

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

3 hours ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

3 hours ago