Movie News

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్ తో తీసి ఉంటారు కాబట్టి సహజంగానే పిల్లా పెద్దా ఎగబడటం ఖాయం. కానీ పరిమిత బడ్జెట్ తో రెండు మూడు లొకేషన్లలోనే మొత్తం సినిమా తీసి దాని కోసం ప్రేక్షకులు ఎదురు చూసేలా చేసింది మాత్రం దృశ్యం ఒక్కటే. అది కూడా మలయాళంలో మొదలై అటునుంచి తెలుగు తమిళం కన్నడ మీదుగా హిందీ దాకా వెళ్లి బ్లాక్ బస్టర్లు అందుకునే స్థాయికి చేరుకుంది.

ఆ మధ్య మోహన్ లాల్ దృశ్యం 3 ప్రేక్షకులను మెప్పించడంలో విఫలమైన సంగతి తెలిసిందే. ఒరిజినల్ వెర్షన్ కి డబ్బులు వచ్చాయి కానీ మిగిలిన చోట్ల తిరస్కారం ఎదురయ్యింది. ముఖ్యంగా టీవీ సీరియల్ తరహా నెరేషన్, క్లైమాక్స్ మరీ అతిగా ఉండటం జనాలకు నచ్చలేదు. కట్ చేస్తే రేపు అజయ్ దేవగన్ దృశ్యం 3 హిందీ వెర్షన్ రిలీజ్ కానుంది. ది కంక్లూజన్ పేరుతో ముగింపు ఇవ్వబోతున్నారు. అజయ్ దేవగన్, శ్రేయ జంటగా నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ పూర్తిగా వేరే ట్విస్టులతో రాసుకున్నారట.

విచిత్రంగా అడ్వాన్స్ బుకింగ్స్ ఆశ్చర్యపరిచే రీతిలో బాగుండటం ట్రేడ్ వర్గాలను సంతోషంలో ముంచెత్తుతోంది. ఇప్పటిదాకా ముందస్తు అమ్మకాల ద్వారా సుమారు నలభై కోట్ల దాకా గ్రాస్ వసూలైనట్టు సమాచారం. గత నెల వచ్చిన అక్షయ్ కుమార్ హైవాన్ ఫుల్ థియేటర్ రన్ కనీసం పది కోట్లు కూడా చేయలేదు. అలాంటిది దృశ్యం 3 విడుదలకు ముందే ఇంత పెద్ద నెంబర్లు నమోదు చేయడం విశేషమే. ఈ ఫ్రాంచైజ్ కున్న బ్రాండ్ వేల్యూ ఆ స్థాయిలో ఉంది మరి.

మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే గతంలో దృశ్యం 2 మలయాళం, తెలుగు వెర్షన్లు నేరుగా ఓటిటిలో రిలీజయ్యాయి. కరోనా టైం కావడంతో మోహన్ లాల్, వెంకటేష్ లాంటి హీరోలున్నా నిర్మాతలు రిస్క్ చేయలేదు. కానీ అజయ్ దేవగన్ తొందరపడకుండా ఆగి ఆలస్యమైనా థియేటర్స్ వైపే మొగ్గు చూపాడు. అది సూపర్ డూపర్ హిట్ అయింది. అందుకే దృశ్యం 3 మీద ఇంత హైప్ ఉందని అనుకోవచ్చు. బాగా డల్లుగా కనిపిస్తున్న నార్త్ బాక్సాఫీస్ కు ఇదేమైనా ఊపు తీసుకొస్తుందేమో చూడాలి.

This post was last modified on October 1, 2026 10:21 am

Share

Recent Posts

టీ 20 చూస్తూ పారిశ్రామికవేత్తలతో చర్చించా

నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…

14 minutes ago

సుడిగుండంలో చిక్కుకున్న జ‌గ‌న్ .. !

గ‌తంలో అంటే.. 2012 నాటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్ అనే చెప్పాలి. అప్ప‌ట్లో ఆయ‌న‌పై అక్ర‌మాస్తుల కేసులు…

1 hour ago

ప్రజల మన్ననలు పొందుతున్న లేడీ లీడర్

గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన ఒక‌రిద్ద‌రు టీడీపీ అభ్య‌ర్థులు ప‌ట్టు బిగిస్తున్నారు. త‌మ‌కు మంత్రి నారా లోకేషే ఆద‌ర్శమ‌ని కూడా చెబుతున్నారు.…

4 hours ago

టాలీవుడ్ ఇంటర్వ్యూల తీరు మారిపోయింది

గతంలో పెద్ద హీరోలు తమ సినిమాల విడుదలకు ముందు పెద్దగా ప్రమోషన్లే చేసేవాళ్లు కాదు. మహా అయితే ఆడియో వేడుకలో…

6 hours ago

అసంతృప్తి ఓట్లు కూడా కూట‌మికేనా?

కూట‌మి ప్ర‌భుత్వం ల‌క్ష‌కు పైగా కొత్త పింఛ‌న్లు ఇచ్చేందుకు రెడీ అయింది. సుదీర్ఘ‌కాలంగా ఎదురు చూస్తున్న ల‌బ్ధి దారుల‌కు మేలు…

9 hours ago

చిరు-ఓదెల… ముందుకు కదలాలంటే?

ఒక దర్శకుడి జీవితం మారిపోవడానికి ఒకే ఒక్క సినిమా చాలు. ‘దసరా’ శ్రీకాంత్ ఓదెలకు అలాంటి సినిమానే అయింది. అక్కడికి…

9 hours ago