Movie News

దర్శకుడి కూతురు ఫోటోలు దేనికి సంకేతం

శ్రీను వైట్ల ప్రస్తుతం శర్వానంద్‌తో సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు. ఆయన రీ ఎంట్రీ సంగతి పక్కనపెడితే, ఇప్పుడు ఆయన పెద్దమ్మాయి ఆనంది వైట్ల సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె షేర్ చేస్తున్న లేటెస్ట్ ఫొటోలు యూత్‌ను ఎట్రాక్ట్ చేస్తున్నాయి. ఇప్పటివరకు పెద్దగా బయటకు రాని డైరెక్టర్ కూతురు ఒక్కసారిగా ఇలా కనిపించడంతో నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.

ఆనంది హైదరాబాద్‌లో చదువు పూర్తి చేసుకుని, హయ్యర్ స్టడీస్ కోసం యూఎస్ వెళ్లారు. ప్రస్తుతం లాస్ ఏంజెలెస్‌లో ఉంటున్న ఈమె, అప్పుడప్పుడు తన లైఫ్‌స్టైల్ పిక్స్ పోస్ట్ చేస్తుంటారు. రీసెంట్‌గా బ్లాక్ కలర్ అవుట్‌ఫిట్‌లో పెట్టిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. డైరెక్టర్ల కుటుంబాల నుంచి వచ్చే అమ్మాయిలు సాధారణంగా చాలా సింపుల్‌గా కనిపిస్తుంటారు. కానీ ఆనంది మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా మోడ్రన్ లుక్స్‌తో మెప్పిస్తున్నారు.

సాధారణంగా మోడలింగ్ లేదా యాక్టింగ్ వైపు వెళ్లాలనుకునే వాళ్లే ఇలాంటి ఫొటోషూట్లు చేయించుకుంటారు. కెమెరా ముందు ఆమె బాడీ లాంగ్వేజ్, ఆటిట్యూడ్ చూస్తుంటే పక్కాగా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీకి రెడీ అవుతున్నట్లే ఉందనే టాక్ నడుస్తోంది. దీంతో టాలీవుడ్ వర్గాల్లో కొత్త హీరోయిన్ దొరికిందంటూ కామెంట్లు వినిపిస్తున్నాయి.

అయితే ఆనంది వైపు నుంచి ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ లేదు. ఉన్నత చదువులు, కెరీర్ పనిమీద విదేశాల్లో ఉంటున్న ఆమె కేవలం సరదాగానే ఈ పిక్స్ షేర్ చేసి ఉండొచ్చని కొందరు అంటున్నారు. అయినప్పటికీ సినీ నేపథ్యం ఉన్న ఫ్యామిలీ కావడంతో మేకర్స్ ఫోకస్ ఆమెపై పడే అవకాశం లేకపోలేదు.

మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉండటంతో ఇండస్ట్రీ జనాలు కూడా ఆసక్తిగానే చూస్తున్నారు. శ్రీను వైట్ల కమర్షియల్ సినిమాలతో మెప్పిస్తే, ఆయన కూతురు మాత్రం తనదైన స్టైల్‌తో ఇన్‌స్టాలో ఫాలోయింగ్ పెంచుకుంటున్నారు. మరి ఇది కేవలం సోషల్ మీడియా బజ్ మాత్రమేనా లేక నిజంగానే వెండితెరపైకి అడుగుపెడతారా అనేది తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

This post was last modified on October 1, 2026 11:07 am

Page: 1 2

Share

Recent Posts

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్?

ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…

15 minutes ago

ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…

2 hours ago

అక్టోబర్ మార్కెట్… ఎవరెవరికి జాక్‌‌పాట్

కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…

2 hours ago

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

3 hours ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

3 hours ago

టీ 20 చూస్తూ పారిశ్రామికవేత్తలతో చర్చించా

నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…

3 hours ago