Movie News

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం కంటే ముందే జక్కన్న కాంపౌండ్ నుంచి మరో ప్రాజెక్ట్ ముస్తాబైంది, అదే ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. పైకి చిన్న సినిమాగా కనిపించినా, లోపల చూస్తే మాత్రం అసలైన రాజమౌళి కోర్ టీమ్ మొత్తం ఈ సినిమా కోసమే రంగంలోకి దిగడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. వారణాసి లాంటి అంతర్జాతీయ స్థాయి ప్రాజెక్ట్ కి ముందు జక్కన్న సైన్యం దింపుతున్న అసలైన అస్త్రం ఇదే.

ఈ ప్రాజెక్ట్ వెనుక ఉన్నది మరెవరో కాదు, రాజమౌళి ఫ్యామిలీ మెంబర్, చంద్రశేఖర్ ఏలేటి కజిన్ అయిన శశాంక్ ఏలేటి. మొదటి సినిమానే అయినప్పటికీ జక్కన్న బ్రాండ్ విలువ తెలిసినవాడు కావడంతో ఎక్కడా తొందరపడకుండా కథను పక్కాగా తీర్చిదిద్దాడట. శశాంక్ చెప్పిన యూనిక్ ఐడియా నచ్చడంతో స్వయంగా బాహుబలి నిర్మాతలు శోభు యార్లగడ్డ, ఎస్ఎస్ కార్తికేయ ఈ ప్రాజెక్ట్‌ను భుజాన వేసుకున్నారు. బ్యాకింగ్ ఇవ్వడమే కాకుండా, రాజమౌళి కాంపౌండ్ లోని కీలక వ్యక్తులంతా ఈ సినిమా కోసం పనిచేశారు.

అన్నింటికంటే ముఖ్యంగా, రాజమౌళి కూడా ఈ ప్రాజెక్ట్ లో నేరుగా ఇన్వాల్వ్ అయ్యారన్నది అసలు విషయ. రాజమౌళి రెగ్యులర్ రైటర్స్ లో ఒకరైన కాంచితో పాటు జక్కన్న స్వయంగా కూర్చుని స్క్రిప్ట్ లోని ప్రతి సన్నివేశాన్ని, పాత్రల బిహేవియర్ ను ఫైన్ ట్యూన్ చేసినట్లు కార్తికేయ వివరణ ఇచ్చాడు. పైగా రఫ్ కట్ చూసి జక్కన్న స్వయంగా ఎమోషనల్ అయ్యారని ప్రొడ్యూసర్లు చెప్పడంతో, ఈ సోషియో ఫాంటసీ ఫన్ ఎమోషనల్ రైడ్ పై ఇండస్ట్రీ వర్గాల్లో అంచనాలు పెరిగిపోయాయి.

ఆస్ట్రేలియా డీవోపీ బ్రాడ్ ఫ్రాన్సిస్ ని తీసుకొచ్చి విజువల్స్ ని హై లెవెల్ లో తీర్చిదిద్దడమే కాకుండా, దాదాపు వంద రోజుల పాటు పక్కాగా షూటింగ్ లాగించారు. సినిమాలో కీలకమైన డాగ్ క్యారెక్టర్ కోసం ఎనిమిది నెలల పాటు ట్రైనింగ్ ఇప్పించి, మోషన్ క్యాప్చర్ టెక్నాలజీని కూడా బ్యాలెన్స్డ్ గా వాడినట్లు చెప్పుకొచ్చారు. మరి వారణాసి కంటే ముందే దిగుతున్న ఈ జక్కన్న కోర్ టీమ్ థియేటర్లలో ఏ రేంజ్ సక్సెస్ కొడుతుందో చూడాలి.

This post was last modified on October 1, 2026 10:40 am

Share

Recent Posts

పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…

27 minutes ago

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్?

ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…

56 minutes ago

ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…

2 hours ago

అక్టోబర్ మార్కెట్… ఎవరెవరికి జాక్‌‌పాట్

కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…

3 hours ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

4 hours ago

టీ 20 చూస్తూ పారిశ్రామికవేత్తలతో చర్చించా

నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…

4 hours ago