కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్ కొంత నీరసంగా ఉన్నప్పటికీ జూన్ నుంచి ఫుల్ జోష్ లోకి వచ్చేసింది. పెద్ది నుంచి మొదలుపెట్టి అటుపై మా ఇంటి బంగారం, లెనిన్, చెన్నై లవ్ స్టోరీ లాంటి వరస విజయాలు పలకరిస్తూనే ఉన్నాయి. వీరభద్రుడు, మండాడి, ఒడిస్సి లాంటి డబ్బింగ్ మూవీస్ సైతం థియేటర్లకు మంచి ఫీడింగ్ ఇచ్చాయి. ఇక దసరా నెలగా చెప్పుకునే అక్టోబర్ వైపు అందరూ చూస్తున్నారు.
విజయదశమి, శని ఆదివారాలు మొత్తం కలిపి ఈ నెల సెలవులు సుమారు రెండు వారాలకు పైగా రాబోతున్నాయి. అంటే టికెట్ కౌంటర్లు కళకళలాడే పరిస్థితన్న మాట. గాంధీ జయంతిని టార్గెట్ చేసుకున్న డోంట్ ట్రబుల్ ది ట్రబుల్, తెల్లకాగితం, ఎస్ఐ యుగంధర్, సిగ్మా, అనకాపల్లి, ప్రేమనే ఊరిలో మొదలైనవన్నీ టాక్ ని నమ్ముకుని బరిలో దిగుతున్నవే. స్టార్ క్యాస్టింగ్ లేకుండా కేవలం కంటెంట్ తో మెప్పించే లక్ష్యంతో బరిలో దిగుతున్నాయి. జనాలు ఏ మేరకు ఆదరిస్తారనేది టాక్ మీద ఆధారపడనుంది.
అసలైన సందడి అక్టోబర్ 9 మొదలుకానుంది. వెంకటేష్ త్రివిక్రమ్ కలయికలో రూపొందిన ‘ఆదర్శ కుటుంబం ఏకె 47’ మీద క్రమంగా అంచనాలు ఎగబాకుతున్నాయి. డీసెంట్ గా ఉన్నా చాలు ఫ్యామిలీ ఆడియన్స్ నెత్తిన బెట్టుకునేలా ఉన్నారు. అదే రోజు శ్రీవిష్ణు ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఉంది. ప్రస్తుతానికి వాయిదా లేదనే అంటున్నారు. వారం తిరక్కుండానే రజనీకాంత్ ‘జైలర్ 2’ దిగుతుంది. ఇప్పటికి హైప్ సంగతేమో కానీ భారీ ఓపెనింగ్ రావడం ఖాయం.దాన్ని నిలబెట్టాల్సింది టాకే.
విజయ్ దేవరకొండ ప్యాన్ ఇండియా మూవీ ‘రణబాలి’ మెల్లగా అటెన్షన్ లోకి వస్తోంది. క్లిక్ అయితే రౌడీ హీరోకి పెద్ద కంబ్యాక్ సినిమా అవుతుంది. ఆ తర్వాత మైత్రి నిర్మించిన హారర్ థ్రిల్లర్ ‘418’ వచ్చే అవకాశముంది. నెలాఖరులో విశ్వక్ సేన్ ‘కల్ట్’ తో పాటు రోషన్ మేక ‘ ఏమో ఏమో ఇది’ రిలీజ్ కానున్నాయి. ప్రమోషన్లతో సౌండ్ చేస్తున్న ‘ఇట్లు అర్జున’ ఏదైనా సర్ప్రైజ్ ఇస్తుందేమో చూడాలి. ప్రతివారం చెప్పుకోదగ్గ కొత్త రిలీజులు బోలెడు ఉన్నాయి. వీటిలో ఏవేవి జాక్‌పాట్ కొడతాయనేది వేచి చూడాలి.
This post was last modified on October 1, 2026 11:20 am
గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…
బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…
నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…
గతంలో అంటే.. 2012 నాటి పరిస్థితులను గమనిస్తే.. జగన్‌కు పెద్ద మైనస్ అనే చెప్పాలి. అప్పట్లో ఆయనపై అక్రమాస్తుల కేసులు…
గత ఎన్నికల్లో ఓడిపోయిన ఒకరిద్దరు టీడీపీ అభ్యర్థులు పట్టు బిగిస్తున్నారు. తమకు మంత్రి నారా లోకేషే ఆదర్శమని కూడా చెబుతున్నారు.…
రాజకీయాల్లో కీలక స్థానాల్లో ఉండే వారి నుంచి వచ్చే మాటల వెనుక ఊహకు అందని లెక్కలు.. సమీకరణాలు ఉంటాయి. అందునా..…