Political News

ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి లోకల్ వార్ లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించడంతో బీసీ నేతలను వెతికే పనిలో అన్ని పార్టీలు బిజీగా ఉన్నాయి. ఈ క్రమంలోనే అనూహ్యంగా బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన రెండు జీవోలను హైకోర్టు కొట్టివేసింది. జీవో నంబర్ 105, జీవో నంబర్ 1065 సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయని పేర్కొంది.

మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న సుప్రీం కోర్టు తీర్పునకు ఈ జీవోలు విరుద్ధంగా ఉన్నాయని కోర్టు తెలిపింది. ఏపీలో కూడా మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదని స్పష్టం చేసింది. ఇక, 6 వారాలలోపు పాత రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక సంస్థల ఎన్నికలను మొదలుబెట్టాలని తీర్పునిచ్చింది. ఈ ప్రకారం ఏపీ ప్రభుత్వంతోపాటు రాష్ట్ర ఎన్నికల సంఘానికి ఆదేశాలు జారీ చేసింది. ఇక, ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు జరిపేలా ఆదేశాలివ్వాలని వైసీపీ దాఖలు చేసిన పిటిషన్ ను కూడా కోర్టు కొట్టివేసింది.

తాజా తీర్పుతో ఏపీలో లోకల్ వార్ కు నోటిఫికేషన్ మరో నాలుగైదు రోజుల్లో వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పంచాయతీలకు రావాల్సిన ఆర్థిక సంఘం నిధులు మురిగిపోయే అవకాశమున్నందుకు ఏపీ సర్కార్ కూడా ఎన్నికలకు సిద్ధంగానే ఉంది. ఆ నిధులు సద్వినియోగం చేసుకునేందుకు అక్టోబర్ నెలాఖరు లోపు ఎన్నికలు పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు కూడా భావిస్తున్నారట.

This post was last modified on October 1, 2026 11:34 am

Share

Recent Posts

పరీక్షలు బాగా రాపించి సినిమాకి తీసుకురండి

చిన్న లేదు.. పెద్ద లేదు.. ఇప్పుడు చాలా సినిమాలకు ముందు రోజే ప్రిమియర్స్ వేసేస్తున్నారు. చిన్న సినిమాలకు సెలెక్టివ్‌గా కొన్ని…

26 minutes ago

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్?

ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను…

55 minutes ago

అక్టోబర్ మార్కెట్… ఎవరెవరికి జాక్‌‌పాట్

కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…

3 hours ago

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

3 hours ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

4 hours ago

టీ 20 చూస్తూ పారిశ్రామికవేత్తలతో చర్చించా

నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…

4 hours ago