Political News

హైకోర్టు తీర్పుపై సుప్రీం కోర్టుకు ఏపీ సర్కార్?

ఏపీలో త్వరలో జరగాల్సి ఉన్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పించేలా జారీ అయిన జీవోలను ఏపీ హైకోర్టు కొట్టి వేసిన సంగతి తెలిసిందే. ఆ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ కల్పించేలా జారీ చేసిన జీవో నంబర్ 105, జీవో నంబర్ 1065 సుప్రీం కోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయని హైకోర్టు వాటిని కొట్టివేసింది. ఈ నేపథ్యంలోనే హైకోర్టు తీర్పును సుప్రీం కోర్టులో సవాల్ చేయాలని ఏపీ సర్కార్ భావిస్తోందని తెలుస్తోంది.

ఈ ప్రకారం సంబంధిత అధికారులకు ఏపీ సీఎం చంద్రబాబు ఆదేశాలు కూడా జారీ చేశారని తెలుస్తోంది. హైకోర్టు ఇచ్చిన తీర్పును మరియు జీవోల రద్దును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్ల కొనసాగింపు అంశాన్ని దేశపు అత్యున్నత న్యాయస్థానంలో తేల్చుకోవాలని చంద్రబాబు సర్కార్ నిర్ణయించుకుందని తెలుస్తోంది.

దేశంలో మొత్తం రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ 50 శాతానికి మించకూడదని సుప్రీంకోర్టు ఇందిరా సాహ్ని కేసు(1992) విచారణ సందర్భంగా ఇచ్చిన చరిత్రాత్మక తీర్పులో స్పష్టం చేసింది. స్థానిక సంస్థల్లో కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు అన్నీ కలిపి ఈ 50 శాతం సీలింగ్ దాటకూడదని తేల్చి చెప్పింది. అయితే, ఏపీలో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తే ఎస్సీ, ఎస్టీ కోటాలతో కలిపి మొత్తం రిజర్వేషన్లు సుమారు 59 శాతం అవుతున్నాయి. ఇది సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధమని హైకోర్టు తన తీర్పులో పేర్కొంది.

This post was last modified on October 1, 2026 12:58 pm

Share

Recent Posts

ఏపీలో బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు

ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం అన్ని పార్టీలు అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందులోనూ, ఈ సారి…

2 hours ago

అక్టోబర్ మార్కెట్… ఎవరెవరికి జాక్‌‌పాట్

కొత్త నెల వచ్చేసింది. చూస్తుండగానే నెలలు హారతి కర్పూరంలా కరిగిపోతున్నాయి. సంక్రాంతి తర్వాత రెండు మూడు నెలలు టాలీవుడ్ బాక్సాఫీస్…

2 hours ago

రాజమౌళి టచ్ చేసిన స్క్రిప్ట్… హిట్ కొడతారా?

గ్లోబల్ బాక్సాఫీస్ ఫోకస్ మొత్తం ఇప్పుడు మహేష్ బాబు, రాజమౌళిల ‘వారణాసి’ పైనే ఉంది. అయితే ఆ భారీ చిత్రం…

2 hours ago

దృశ్యం బ్రాండ్ విలువ మహత్యం

బాహుబలి, కెజిఎఫ్ లాంటి విజువల్ గ్రాండియర్ సీక్వెల్స్ కి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు. వందల కోట్ల బడ్జెట్, విఎఫ్ఎక్స్…

3 hours ago

టీ 20 చూస్తూ పారిశ్రామికవేత్తలతో చర్చించా

నేను క్రికెట్ మ్యాచ్ చూడ్డానికి ఎక్కడికివెళ్లినా అక్కడ కూడా పెట్టుబడుల మీద ఒప్పందాల గురించి చర్చిస్తుంటాను. ఒక టీ 20…

3 hours ago

సుడిగుండంలో చిక్కుకున్న జ‌గ‌న్ .. !

గ‌తంలో అంటే.. 2012 నాటి ప‌రిస్థితుల‌ను గ‌మ‌నిస్తే.. జ‌గ‌న్‌కు పెద్ద మైన‌స్ అనే చెప్పాలి. అప్ప‌ట్లో ఆయ‌న‌పై అక్ర‌మాస్తుల కేసులు…

4 hours ago