Political News

మెగా డీఎస్సీపై అనుమానాలకు ఫుల్ స్టాప్..

2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీల్లో ఒకటైన మెగా డీఎస్సీ నిర్ణీత కాల వ్యవధిలోనే ముగిసింది. 16,347 మంది నిరుద్యోగులు ఉపాధ్యాయులుగా మారిపోయారు. కూటమి సర్కారు రికార్డు స్థాయిలో మెగా డీఎస్సీని కేవలంచ 148 రోజుల్లోనే ముగించిన నేపథ్యంలో ఇప్పుడు వారంతా ఎంచక్కా సర్కారీ బడుల్లో పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. కూటమి సర్కారు సాధించిన విజయాల్లో మెగా డీఎస్సీ నిర్వహణ కీలకమని చెప్పక తప్పదు. ఎందుకంటే… మెగా డీఎస్సీపై వెల్లువెత్తుతున్న విమర్శలను తిప్పికొడుతూ ప్రభుత్వం మంగళవారం ఓ సుదీర్ఘ వివరణను విడుదల చేసింది. అంతేకాకుండా మెగా డీఎస్సీని ఏ రీతిన నిర్వహించామన్న విషయాన్ని ఈ వివరణలో క్లిష్టర్ క్లియర్ గా చెప్పేసింది. వెరసి మెగా డీఎస్సీలో అక్రమాల్లేవని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు.

మెగా డీఎస్సీలో ఆది నుంచి అక్రమాలు జరిగాయని, నిబంధనలను కాలరాసి… తన అనుయాయులకు పోస్టింగులు ఇచ్చుకున్నారని, ఇందులో స్సోర్ట్స్ కోటా ఒకటని విపక్ష వైసీపీ పెద్ద ఎత్తున ఆరోపణలు చేసింది. పరీక్షలో అర్హత సాధించని అభ్యర్తులను తమ వైపునకు తిప్పుకుని డీఎస్సీ నిర్వహణ లోపభూయిష్టంగా సాగిందని చెప్పించింది. కోర్టుల్లో కేసులూ వేయించింది. అంతేకాకుండా నిత్యం మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పదే పదే చెబుతూ సాగుతున్నారు. ఈ నేపథ్యంలో మెగా డీఎస్సీని ఏ రీతిన నిర్వహించామన్న విషయాన్ని తాజాగా ప్రభుత్వం విస్పష్టంగా వివరించింది.

మెగా డీఎస్సీ 2025 ప్రక్రియకు సంబంధించి నోటిఫికేషన్ నుంచి అభ్యర్థుల తుది ఎంపిక దాకా మొత్తం ప్రక్రియను అత్యంత పారదర్శకంగా, నిబంధనలకు అనుగుణంగా జరిగిందని ప్రభుత్వం వెల్లడించింది. ఈ మొత్తం ప్రక్రియకు టీసీఎస్ అయాన్ డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్, 256 బిట్స్ ఎన్క్రిప్షన్, ర్యాండమైజేషన్ వంటి అత్యంత భద్రతా వ్యవస్థలను వినియోగించినట్లుగా ప్రభుత్వం పేర్కొంది. ఇక ప్రశ్నాపత్రం లీక్ కు గురికాకుండా ఉండేలా 42 వేల ప్రశ్నల బ్యాంక్, పరిమిత యాక్సెస్, బహుళ భద్రతా చర్యలలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది. మూడు స్థాయిల పరిష్కార వ్యవస్థ ద్వారా వేలాది మంది అభ్యర్థుల ఫిర్యాదులను విపులంగా పరిశీలించి పరిష్కరించినట్లు తెలిపింది. మెరిట్ లిస్టులు, ఆన్సర్ కీలు, ఎంపిక ప్రక్రియకు సంబంధించిన అన్ని వివరాలను అధికారిక వెబ్ సైట్లలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొంది.

ఇక ఫైనల్ గా విపక్షం చేస్తున్న ఆరోపణలు ఏ రీతిన బయటకు వస్తున్నాయన్న విషయాన్ని కూడా ప్రభుత్వం వెల్లడించింది. 2019 ఎన్నికలకు ముందు జాబ్ కేలండర్ పేరిట హామీ ఇచ్చిన వైసీపీ… అదికారం అందగానే దానిని తుంగలో తొక్కేసింది. వేలకు మించి ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నా… వాటి భర్తీ గురించి ఆలోచించిన పాపానే పోలేదు. అయితే అందుకు భిన్నంగా కూటమి సర్కారు అధికారంలోకి రాగానే… ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలును పట్టాలెక్కించింది. అందులో భాగంగానే 16 వేల పైచిలుకు పోస్టులతో మెగా డీఎస్సీని ప్రకటించి.. దానిని నిర్ణీత కాల వ్యవధిలోనే పూర్తి చేసింది. ఈ క్రెడిట్ వల్ల 2029 ఎన్నికల్లో ఎక్కడ కూటమికి లబ్ది చేకూరుతుందోనన్న భయంతో వైసీపీ… మెగా డీఎస్సీపై నిరాధార ఆరోపణలు చేస్తోందని ప్రభుత్వం ఆరోపించింది.

This post was last modified on July 28, 2026 9:53 pm

Share

Recent Posts

అమెరికా సైతం ఉచితాల బాట‌… భార‌త్‌ను చూసి నేర్చిందా?!

ఎన్నిక‌ల స‌మ‌యంలో ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించే దేశం ఏది అని అడిగితే.. ఠ‌క్కున చెప్పే పేరు భార‌త్‌. రాష్ట్రాల అసెంబ్లీల…

37 minutes ago

జగన్ బీజేపీని కూడా టార్గెట్ చేస్తున్నారండోయ్…

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీపై ఎప్పుడూ పల్లెత్తు మాట అనడానికి కూడా వెనకాడే జగన్.. ఇప్పుడు తన గొంతు పెంచారు.…

52 minutes ago

గోపీచంద్ సౌండ్ చేయడం లేదెందుకు

మాచో స్టార్ గా ఒకప్పుడు మాస్ మార్కెట్ ని బాగా ఎంజాయ్ చేసిన హీరో గోపిచంద్. విలన్ గా కెరీర్…

52 minutes ago

సామజిక చైతన్యం వైపు అల్లు అర్జున్ అభిమానులు

సాధారణంగా అభిమాన సంఘాలంటే కొత్త సినిమాల విడుదల, సంబరాలు, పుట్టినరోజు వేడుకలకే పరిమితమవుతుంటాయి. అయితే, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్…

2 hours ago

కోర్టులను అనుమానిస్తున్నారా జగన్?

న్యాయస్థానాలపై, న్యాయమూర్తుల విషయంలో వైసీపీ అధినేత జగన్ తీరు గతంలో తీవ్రస్థాయిలో విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే. సుప్రీం కోర్టు…

3 hours ago

కన్నీటి పర్యంతమైన బొత్స

వైసీపీ ఎమ్మెల్సీ బొత్స మేనల్లుడు, ఉత్తరాంధ్రలో వైసీపీ కీలక నేత, విజయనగరం జిల్లా వైసీపీ అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న…

3 hours ago