Movie News

స్టేజీపై ఏడ్చేసిన భాగ్యశ్రీ బోర్సే

ఫిలిం ఇండస్ట్రీలో అవకాశాలు అందుకోవడం ఒకెత్తయితే.. విజయాలు సాధించడం మరో ఎత్తు. వచ్చిన అవకాశాలు సద్వినియోగం అయ్యేలా సక్సెస్ సాధించకపోతే కెరీర్ ముందుకు సాగదు. ఐతే ఫలితాలతో సంబంధం లేకుండా కొందరికి మాత్రం వరుసగా అవకాశాలు వస్తాయి. భాగ్యశ్రీ బోర్సే ఈ కోవకే చెందుతుంది. దక్షిణాదిన తన తొలి చిత్రం ‘మిస్టర్ బచ్చన్’ ఎంత పెద్ద డిజాస్టరో తెలిసిందే. తర్వాత ఆమె నటించిన కింగ్డమ్, కాంత, ఆంధ్ర కింగ్ తాలూకా కూడా నిరాశపరిచాయి.

అయినా భాగ్యశ్రీకి అవకాశాలేమీ ఆగిపోలేదు. తెలుగులో ‘లెనిన్’, తమిళంలో ‘సెయాన్’ చిత్రాల్లో ఛాన్సులు అందుకుంది. ఇందులో ‘లెనిన్’ ఈ శుక్రవారమే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ఎబోవ్ యావరేజ్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లే సాధిస్తోంది. ఈ చిత్రంలో గ్లామర్‌తో ఆకట్టుకోవడమే కాక.. నటనలోనూ ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా భాగ్యశ్రీ పెర్ఫామెన్స్‌ను పేర్కొంటున్నారు.

ఈ నేపథ్యంలో భాగ్యశ్రీ ‘లెనిన్’ సక్సెస్ మీట్‌లో చాలా ఎమోషనల్ అయిపోయింది. ఇప్పటిదాకా హిట్టు కొట్టకపోయినా తన మీద అభిమానులు అమితమైన ప్రేమ చూపించడం.. ఇప్పుడు ‘లెనిన్’లో తన పాత్రకు మంచి స్పందన వస్తుండడం ఆమెను తీవ్ర భావోద్వేగానికి గురి చేసినట్లే కనిపిస్తోంది. ‘లెనిన్’ ఈవెంట్లో మాట్లాడే క్రమంలో ఆమె కన్నీళ్లు పెట్టేసుకుంది. మాట తడబడుతుండగా.. గత ఏడాదిన్నరగా తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో తన జర్నీ గురించి గుర్తు చేసుకుంది భాగ్యశ్రీ.

అభిమానులు తన మీద చూపించే ప్రేమ, వాళ్లు పంపించే మెసేజ్‌లు.. తన సినిమాలకు సంబంధించిన రీల్స్ గురించి చెబుతుండగా భాగ్యశ్రీకి కన్నీళ్లు ఆగలేదు. చివరగా ఒక మాట చెబుతా అంటూ.. హైదరాబాాద్‌ను తన కర్మభూమిగా అభివర్ణించింది భాగ్యశ్రీ. అంతేకాక తన చివరి చిత్రం తెలుగులోనే చేస్తానని కూడా ఆమె స్పష్టం చేసింది. రెండేళ్ల కెరీర్లో ఎప్పుడూ చలాకీగానే కనిపించిన భాగ్యశ్రీ ఇంత ఎమోషనల్ అవడం.. హైదరాబాద్ గురించి, తెలుగు సినిమాల గురించి ఇంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.

This post was last modified on July 11, 2026 2:43 pm

Share

Recent Posts

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

48 minutes ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

2 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

2 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

9 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

11 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

12 hours ago