Political News

పవన్ ఏళ్ల గాయానికి గంటల తరబడి ఆపరేషన్

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కు శనివారం శస్త్ర చికిత్స జరిగింది. ముంబైలో జరిగిన ఈ శస్త్ర చికిత్సకు ఏకంగా 3.5 గంటల సమయం పట్టింది. ఏళ్ల క్రితం అయిన గాయాలకు సంబంధించి పవన్ చాలా కాలంగా విపరీతమైన నొప్పితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. 2018లో రెండు భుజాలకు గాయాలు కాగా… వాటికి సంబంధించిన చికిత్సను ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ వచ్చారు. అయితే వాటిని మరింత కాలం వాయిదా వేయడం ప్రమాదమన్న వైద్యుల సూచనలతో తాజాగా ఆపరేషన్ చేయించుకున్నారు.

ఇటీవలే ముక్కుకు చేయించుకున్న శస్త్ర చికిత్స సందర్భంగా భుజాలకు ఉన్న గాయాలను ముంబై వైద్యులు గుర్తించారు. విపరీతమైన నొప్పి ఉన్న ఆ గాయాలను ఇంతకాలం ఎలా భరించారంటూ వైద్యులు పవన్ ను ప్రశ్నించిన సంగతి తెలిసిందే. రెండు భుజాలకు అయిన గాయాలకు తక్షణమే చికిత్స చేయించుకోవాలని, లేని పక్షంలో ప్రమాదమేనని వైద్యులు సూచించారు. అయితే అప్పటికే డిప్యూటీ సీఎం హోదాలో ఖరారైన పలు కార్యక్రమాలను వాయిదా వేయడం ఇష్టంలేని పవన్… వైద్యులు చెప్పినా… ఆపరేషన్ ను వాయిదా వేశారు. తాజాగా శుక్రవారం ముంబై వెళ్లి… ఆపరేషన్ చేయించుకున్నారు.

శనివారం జరిగిన ఆపరేషన్ లో కుడి భుజానికి మాత్రమే శస్త్ర చికిత్స జరిగింది. రొటేటర్ కఫ్ గాయానికి జరిగిన ఈ చికీత్సకు ఏకంగా 3.5 గంటల సమయం పట్టిందని వైద్యులు తెలిపారు. శనివారం నాటి ఆపరేషన్ లో కేవలం కుడి భుజానికి మాత్రమే చికిత్స జరగగా… ఎడమ భుజానికి రెండు నెలల్లోగా ఆపరేషన్ చేయాల్సి ఉంది. రెండు భుజాలకూ ఒకే సారి ఆపరేషన్ చేస్తే ఆ నొప్పి తీవ్రంగా ఉంటుందని, ఆ నొప్పిని భరించడం సాధ్యం కాదన్న భావనతోనే వైద్యులు ప్రస్తుతానికి ఒక్క భుజానికి మాత్రమే ఆపరేషన్ చేశారు. అంటే… రెండు నెలల్లోగా మరోమారు ముంబై వెళ్లి ఎడమ భుజానికి ఆపరేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. 

పవన్ కు ఆపరేషన్ విజయవంతం అయిన తీరుపై తెలుగు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పవన్ కు ఆపరేషన్ సక్సెస్ అయిన విషయాన్ని తెలుసుకున్న టీడీపీ అదినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. పవన్ త్వరగా కోలుకోవాలని కోరుతూ ఆయన ఓ సందేశాన్ని విడుదల చేశారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు రాజకీయ నేతలు, పలు రంగాలకు చెందిన ప్రముఖులు కూడా పవన్ త్వరగా కోలుకోవాలని ఆశిస్తూ సందేశాలు విడుదల చేస్తున్నారు. ఆపరేషన్ విజయవంతం కావడం పట్ల ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్ హర్షం ప్రకటించారు. 

This post was last modified on July 11, 2026 2:50 pm

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

44 minutes ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

2 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

2 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

4 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

4 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

5 hours ago