Movie News

ఢమాల్ అన్నారు… అయినా వసూళ్లు ఇస్తున్నారు

బాలీవుడ్ లో కొంత కాలంగా విచిత్రమైన ట్రెండ్ నడుస్తోంది. రొటీన్ కథలు, సిల్లీ కాన్సెప్ట్స్ తో సినిమాలు వస్తుంటాయి. క్రిటిక్స్ తలంటుతారు. సోషల్ మీడియా జనాలు ట్రోలింగ్ చేస్తారు. కానీ థియేటర్లలో కలెక్షన్లు కనిపిస్తాయి. ఆ మధ్య ‘వెల్కమ్ టు ది జంగల్’కు ఇదే జరిగింది. తాజాగా ఢమాల్ 4 రిలీజయ్యింది. ఈ సిరీస్ పంతొమ్మిది సంవత్సరాల క్రితం 2007లో మొదలయ్యింది. మొదటి భాగం హిట్ కావడంతో తర్వాత ఇంకో రెండు వచ్చాయి. ఇప్పుడు నాలుగోది దింపారు.

కథ మహా ఖంగాళీ ఉంటుంది. వెరైటీ మనస్తత్వాలున్న ఒక గుంపు అమూల్యమైన నిధిని చేజిక్కించుకోవడం కోసం సముద్రాలు, కొండలు దాటుతూ ఒక ద్వీపానికి చేరుకుంటారు. మధ్యలో ఎన్నో అడ్డంకులు ఆటంకాలు ఎదురవుతాయి. తీరా అక్కడికి వెళ్ళాక మరికొన్ని ట్విస్టులు ఎదురవుతాయి. ఈ క్రమంలో అర్థం లేని గందరగోళం ఏర్పడి గొడవలు పడే దాకా వెళ్తుంది. అసలు ఇంత మంది ఎందుకు వెళ్లారు, ఆ నిధి విలువ ఎంతనేది తెరమీద చూసి తరించాలి.

సిల్లీగా లాజిక్స్ లేకుండా, ఏ మాత్రం నమ్మశక్యం కాని రీతిలో దర్శకుడు ఇంద్ర కుమార్ దీన్ని తెరకెక్కించారు. ఇంత అత్తెసరుగా ఎలా ఆలోచిస్తారనిపించే సన్నివేశాలు చాలా ఉన్నాయి. విఎఫెక్స్ భారీగా వాడినా చాలా చోట్ల చీప్ గా అనిపిస్తుంది. కొన్ని సన్నివేశాల్లో క్వాలిటీ మెయింటైన్ చేశారు. అజయ్ దేవగన్ భుజాల మీద అధిక భారం పెట్టేయగా రితీష్ దేశ్ ముఖ్, అర్షద్ వార్సీ, రవి కిషన్, జావేద్ జాఫ్రీ, ఉపేంద్ర లిమయ తదితరులు తమ వంతు పాత్ర పోషించారు.

కంటెంట్ పరంగా ఎంత ఢమాల్ అనిపించుకున్నా కలెక్షన్లు బాగానే నమోదవుతున్నాయి. బుక్ మై షోలో గంటకు 20 వేలకు పైగా టికెట్లతో ట్రెండింగ్ లో ఉన్న ఢమాల్ 4 వీకెండ్ కూడా జోరు కొనసాగించేలా ఉంది. గత వారం భారీ అంచనాలతో వచ్చిన ఆల్ఫా డిజాస్టర్ కాగా నార్త్ బయ్యర్ల ఆశలన్నీ అజయ్ దేవగన్ మీదే ఉన్నాయి. ఇది కూడా వందల కోట్ల వసూళ్లు రాబట్టలేకపోవచ్చు కానీ ఉన్నంతలో ఇదే జోరు కొనసాగిస్తే డీసెంట్ గా గట్టెక్కే ఛాన్స్ ఉంది. అన్నట్టు ఢమాల్ 5 కూడా తీస్తారట.

This post was last modified on July 11, 2026 12:21 pm

Share

Recent Posts

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

43 minutes ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

2 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

8 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

10 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

11 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

11 hours ago