Movie News

గూఢచారి 2 మీద బరువు పెరిగింది

బాలీవుడ్ లో స్పై డ్రామాలకు గడ్డు కాలం వచ్చేసింది. దురంధర్ పుణ్యమాని ఫిజిక్స్ ని ఛాలెంజ్ చేసే ఫైట్లు పెట్టి నమ్మిస్తామంటే ప్రేక్షకులు అంగీకరించడం లేదు. యష్ రాజ్ సంస్థకు ఇది బాగా అనుభవమవుతోంది. టైగర్ 3 ఊహించని విధంగా ఫ్లాప్ కాగా వార్ 2 వేసిన దెబ్బ అంతా ఇంతా కాదు. హృతిక్ తారక్ ఇమేజులు కొంత కాపాడాయి కానీ లేదంటే పరిస్థితి ఇంకా ఘోరంగా ఉండేది. తాజాగా విడుదల చేసిన అల్ఫా దారుణంగా దెబ్బ తింది. విమర్శకులు విరుచుకు పడ్డారు.

ఇదంతా ఇప్పుడు నిర్మాణంలో ఉన్న పలు స్పై డ్రామా సినిమాల మీద ప్రభావం చూపిస్తోంది. వాటిలో అడవి శేష్ గూఢచారి 2 ఉంది. మొదటి భాగం సూపర్ డూపర్ హిట్ అయ్యాక దాని సీక్వెల్ కోసం చాలా కాలం నుంచి మూవీ లవర్స్ ఎదురు చూస్తున్నారు. దర్శకుడు మారినా సరే సీక్వెల్ క్రేజ్ తగ్గదనే నమ్మకంతో నిర్మాతలు భారీగా ఖర్చు పెడుతున్నారు. డెకాయిట్ కోసం దానికి బ్రేక్ ఇచ్చిన శేష్ ఇటీవలే షూటింగ్ రీ స్టార్ట్ చేశాడు. దాదాపు సగంపైనే పూర్తయ్యిందని ఇన్ సైడ్ టాక్.

ఒకవేళ అడవి శేష్ దురంధర్ తరహాలో ఆర్గానిక్ మేకింగ్ తో కనక ఆకట్టుకుంటే మేజర్ తరహాలో మరో బ్లాక్ బస్టర్ ఖాతాలో వేసుకోవచ్చు. ఎందుకంటే ఈ జానర్ ని సరిగ్గా ప్రెజెంట్ చేయగలిగితే నార్త్ జనాలు కనకవర్షం కురిపిస్తారు. కాకపోతే కంటెంట్ స్ట్రాంగ్ గా ఉండాలి. మేజర్ ఎంత సక్సెస్ అయినా శేష్ కి ఉత్తరాదిలో భారీ ఫాలోయింగ్ లేదు. డెకాయిట్ ఎంత పుష్ చేసినా హిందీలో ఆడలేదు. కారణం అలాంటి సెటప్ ఉన్న సినిమాలు చాలా చూసేశారు కాబట్టి.

సో ఇప్పుడు గూఢచారి 2తో ప్యాన్ ఇండియా లెవెల్ లో ప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇన్ సైడ్ టాక్ అయితే చాలా పాజిటివ్ గా వినిపిస్తోంది. మొదటి భాగానికి పదింతలు రిచ్ విజువల్స్, టేకింగ్ తో తెరకెక్కుతోందని, ఖచ్చితంగా ఆడియన్స్ థ్రిల్ అవుతారని అంటున్నారు. వినయ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న గూఢచారి 2 అనౌన్స్ మెంట్ వచ్చి మూడు సంవత్సరాలు దాటేసింది. ఈ ఏడాది రిలీజ్ అవుతుందో లేదో ఇంకా స్పష్టత రావలసి ఉంది.

This post was last modified on July 10, 2026 10:02 am

Share

Recent Posts

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

2 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

2 hours ago

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…

3 hours ago

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

4 hours ago

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

5 hours ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

7 hours ago