Political News

టీడీపీని చూసైనా నేర్చుకోవాలి క‌దా!

జ‌న‌సేన నాయ‌కుల‌కు ఆ పార్టీ అధినేత చెబితే చెవికి ఎక్క‌డం లేదా? అంటే.. ఔన‌నే స‌మాధాన‌మే వినిపిస్తోంది. ప్ర‌త్య‌ర్థులు చేస్తున్న విమ‌ర్శ‌ల‌కు దీటుగా స‌మాధానం ఇవ్వాల‌ని.. ఎప్ప‌టిక‌ప్పుడు వారు చేస్తున్న ఆరోప‌ణ‌ల‌ను ఆధారాల‌తో స‌హా తిప్పికొట్టాల‌ని ప‌వ‌న్ కల్యాణ్‌.. గ‌త రెండు నెల‌ల కాలంలో మూడు సార్లు నాయ‌కుల‌కు దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు, మంత్రుల‌కు, ఎమ్మెల్సీల‌కు కూడా ఇదే సూచ‌న చేశారు.

కానీ, ఒక‌రిద్ద‌రు మాత్ర‌మే స్పందిస్తున్నారు. పోనీ.. ఇలా స్పందించిన వారైనా స‌క్ర‌మంగా కౌంట‌ర్ ఇస్తున్నారా? అంటే.. కాకినాడ రూర‌ల్ ఎమ్మెల్యే పంతం నానాజీ.. వైసీపీ నేత‌ల‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు మ‌రో ర‌చ్చ‌కు దారితీశాయి. దీనిపై ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రోసారి వివ‌ర‌ణ ఇవ్వాల్సి వ‌చ్చింది. దీనికి తోడు ఇప్ప‌టికే ఉన్న స‌మ‌స్య‌ల‌తో పాటు కొత్త‌వి పుట్టుకొచ్చాయి. తాజాగా `రావ‌ణ్` అరెస్టు, ఉపా కేసు వంటివి ర‌చ్చ రేపుతున్నాయి.

సోష‌ల్ మీడియాలో జ‌న‌సేన అధినేత‌ను ల‌క్ష్యంగా చేసుకుని వైసీపీ నాయ‌కులు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. కానీ, ఇటు వైపు నుంచి ఒక్క‌రంటే ఒక్క‌రు కూడా కౌంట‌ర్ ఇవ్వ‌డం లేదు. మ‌ళ్లీ సైలెంట్ అయిపోయారు. దీంతో వైసీపీ చేస్తున్న ప్ర‌చారానికి వ‌స్తున్న ఇమేజ్‌.. జ‌న‌సేన వైపు నుంచి ఎలాంటి ప్ర‌చారం లేక‌పోవ‌డంతో అదే నిజ‌మ‌ని న‌మ్మే ప‌రిస్థితి వ‌చ్చింది. తాజాగా ప‌వ‌న్ క‌ల్యాణ్ మ‌రోసారి దిద్దుబాటు చ‌ర్య‌ల‌కు దిగారు. నాయ‌కుల‌కు ఈ సారి ఘాటుగానే క్లాస్ ఇవ్వ‌నున్నారు.

ఇదిలావుంటే.. మిత్ర‌ప‌క్షం టీడీపీలో ఉన్న వ్య‌వ‌స్థ జ‌న‌సేన‌లో లేద‌న్న‌ట్టుగానే ఉంది. టీడీపీ అధినేత చంద్ర‌బాబును ఎవ‌రైనా ఏదైనా అంటే.. జిల్లాలు, నియోజ‌క‌వ‌ర్గాల‌తో సంబంధం లేకుండా.. ప‌ద‌వుల‌తో కూడా సంబంధం లేకుండా నాయ‌కులు మీడియా ముందుకు వ‌స్తారు. కౌంట‌ర్ల‌పై కౌంట‌ర్లు ఇస్తారు. ప్ర‌త్య‌ర్థులు చేసిన వ్యాఖ్య‌ల‌కు నాలుగింత‌లు ముట్ట‌జెపుతారు. తిరిగి చంద్ర‌బాబు జోక్యం చేసుకుని ఇక చాల్లే అంటే త‌ప్ప‌.. ఆగ‌రు. అలాంటి ప‌రిస్థితి జ‌న‌సేన‌లో లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on July 10, 2026 9:22 am

Share

Recent Posts

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

2 hours ago

రాహుల్ ముందే పసిగడుతున్నారా?

కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…

2 hours ago

మోహన్ బాబును మోసం చేసిన ఓదెల

తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…

3 hours ago

‘హోటళ్ళు నా భార్యా బిడ్డల కోసం’

సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…

4 hours ago

హిట్టు కొట్టిన పది నెలలకు దర్శనం

టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…

5 hours ago

షాకింగ్ టాక్… బత్తా అంత కొత్తగా ఉందా

విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…

7 hours ago