Political News

పవన్ చెప్పినా రాజీనామాకు నో ?

మున్సిపల్ ఎన్నికలైన పాతిక రోజుల తర్వాత అక్కడక్కడా కొన్ని సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. మున్సిపల్ చైర్మన్ ఎంపిక సజావుగానే కొనసాగింది. అదేం చిత్రమో కానీ వైస్ చైర్మన్ పదవి ఎంపికలు తలనొప్పిగా మారాయి. పార్టీ నిర్ణయించిన అభ్యర్థికి మద్దతు ఇచ్చేందుకు కొందరు నాయకులు అంగీకరించడం లేదు. మేమంటే మేమని మరికొన్ని చోట్ల కౌన్సిలర్లు తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు. అధినేతల ఆదేశాలను సైతం ధిక్కరిస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మున్సిపల్‌ వైస్ ఛైర్మన్ వ్యవహారం గురించి ఇప్పుడు రాష్ట్రంలో చర్చ జరుగుతుంది. 

పొత్తులో భాగంగా నిడదవోలు మున్సిపల్ పదవి జనసేనకు ఇచ్చారు. వైస్ చైర్మన్ పదవి టీడీపీకి కేటాయించారు. దాంతో 32 మంది కౌన్సిలర్లతో సహా ఛైర్‌ పర్సన్ మురాల జ్యోతి ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత వైస్ ఛైర్మన్ పదవికి ఎన్నికలు జరిగాయి. కూటమి అభ్యర్థిగా టీడీపీ కౌన్సిలర్‌ కొమ్మిన వెంకటేశ్వరావును వైస్ ఛైర్మన్ పదవికి ఎంపిక చేశారు. అధిష్టానం ఒకటి తలిస్తే క్షేత్రస్థాయిలో జనసేన నాయకులు మరొకటి ప్లాన్ చేశారు.  అటు టీడీపీ, ఇటు జనసేన అధినేతలకు షాక్ ఇచ్చారు. జనసేన తరపున పోటీ చేసి 4వ వార్డు నుంచి గెలుపొందిన కళ్యాణ చక్రవర్తి వైస్ ఛైర్‌పర్సన్ బరిలో పోటీకి దిగారు. ఆయన పేరును 8వ వార్డు జనసేన కౌన్సిలర్‌ గంగుల వెంకటలక్ష్మి ప్రతిపాదించగా, 6వ వార్డు కౌన్సిలర్‌ సంజీవ్‌ సాగర్‌ బలపరిచారు.

ఏకగ్రీవం అనుకున్న పదవికి పోటీ నెలకొంది. కూటమి పార్టీలకు చెందిన అభ్యర్థులు పోటీకి దిగినప్పటికి కూటమిలోని బీజేపీ, ప్రతిపక్ష వైసీపీ పార్టీలు జనసేన రెబల్ అభ్యర్థికి మద్దతు పలకడం విశేషం. 14 మంది జనసేన కౌన్సిలర్లు, ఒక బీజేపీ కౌన్సిలర్‌, మరొక ఇండిపెండెంట్‌లతో పాటుగా ప్రతిపక్ష వైసీపీకి చెందిన ఇద్దరు కౌన్సిలర్లు కళ్యాణ్ చక్రవర్తికి ఓటు వేశారు. టీడీపీ అభ్యర్థి వెంకటేశ్వరరావుకు 13 ఓట్లు రాగా జనసేన రెబల్ అభ్యర్థికి 18 ఓట్లు వచ్చాయి. కళ్యాణ చక్రవర్తి విజయం సాధించారు.  ఇక్కడే అసలు కథ మొదలైంది.

ఈ పంచాయితీ టీడీపీ, జనసేన అధినేతల వద్దకు చేరింది. పొత్తు ధర్మం ప్రకారం టీడీపీకి కేటాయించిన వైస్ చైర్మన్ పదవి వారికే ఇవ్వాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయించారు. వైస్ ఛైర్‌పర్సన్ గా ఎంపికైన కళ్యాణ చక్రవర్తి చేత వెంటనే రాజీనామా చేయించాలని ఆదేశించారు. స్వయంగా డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్ చెప్పినా సరే రాజీనామా చేసేందుకు కళ్యాణ్ చక్రవర్తి ఒప్పుకోవడం లేదని ప్రచారం జరుగుతుంది.

కళ్యాణ చక్రవర్తి తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న నిడదవోలు టీడీపీ నేతలు తాడో పేడో తేల్చుకునేందుకు సిద్ధం అవుతున్నట్లు సమాచారం. వైస్ ఛైర్మన్ పదవి విషయంలో జనసేన దిగిరాకపోతే ఆమరణ నిరాహారదీక్షకు దిగుతానని నిడదవోలు నియోజకవర్గ టీడీపీ ఇంఛార్జ్ బూరుగుపల్లి శేషారావు ప్రకటించడంతో మరింత వేడి రాజేసినట్లయ్యింది. చివరికి ఏమి జరుగుతుందో చూడాలి.

This post was last modified on November 25, 2026 6:35 pm

Share

Recent Posts

కోడ్ రెడ్ యాక్టివేట్ చేసిన మైక్రోసాఫ్ట్

ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగించే మైక్రోసాఫ్ట్ సంస్థకు ఇటీవల ఎదురైన సాంకేతిక సమస్యలు పెద్ద సవాలుగా మారాయి. సంస్థకు చెందిన…

10 minutes ago

మళ్ళీ మొదటికొచ్చిన మెగా కన్ఫ్యూజన్

బహుశా చిరంజీవి కెరీర్ లో చాలా సంవత్సరాల తర్వాత ఒక మెగా కన్ఫ్యూజన్ ఏర్పడింది. నిన్న విశ్వంభరకు షఫీ డబ్బింగ్…

8 hours ago

మాట నిలబెట్టుకోలేక పోయాను.. క్షమించండి

రాజకీయాల్లో నైతిక విలువలు తగ్గిపోతున్నాయని మేధావులు, ప్రజాస్వామికవాదులు ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే సుదీర్ఘ రాజకీయ చరిత్ర…

8 hours ago

సుప్రీమ్ హీరో గట్టెక్కే సూచనలు ఎక్కడ

2027 సంక్రాంతి ఎంతో దూరంలో లేదు. త్వరలో పూర్తి కాబోతున్న నవంబర్ నెలని మినహాయిస్తే ఇంకో నలభై రెండు రోజులు…

12 hours ago

రాజమౌళి ముందే ఫిక్సయ్యారు కాబోలు

వారణాసి ఏప్రిల్ 7 విడుదల కావడం గురించి ఇండస్ట్రీలోనే కాదు ట్రేడ్ వర్గాల్లోనూ అనుమానాలు మొదలయ్యాయి. వాయిదా గురించి ఎలాంటి…

13 hours ago

రావిపూడికి రిపేర్ చేయాల్సిన అవసరముందా

ప్రతి సంక్రాంతికి కొత్త సినిమా రిలీజ్ చేయడమే సంకల్పంగా పెట్టుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి ఈసారి జనవరి 12 విడుదలతో…

16 hours ago