Movie News

సూర్య సరైన దారిలోకి వచ్చినట్టే

ఎప్పుడో గజిని తర్వాత అంత పెద్ద బ్లాక్ బస్టర్ మళ్ళీ చూడలేకపోయాననే సూర్య కొరతని కరుప్పు మూడు వందల కోట్లు తీసుకొచ్చి మరీ తీర్చింది. డబ్బింగ్ వెర్షన్ వీరభద్రుడు నెగటివ్ టాక్ లోనూ వసూళ్లు రాబట్టడం అనూహ్యమని చెప్పాలి. ఆగస్ట్ లో విశ్వనాథ్ అండ్ సన్స్ తో తక్కువ గ్యాప్ లో సూర్య మరోసారి ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. ఆల్రెడీ ఒక లిరికల్ సాంగ్ విడుదల చేయగా వచ్చే నెల నుంచి సితార ఎంటర్ టైన్మెంట్స్ ప్రమోషన్ల వేగం పెంచనుంది.

దీని తర్వాత ప్రస్తుతం జీతూ మాధవన్ డైరెక్షన్లో సూర్య ఒక మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. కాక కాక, సింగం తర్వాత వాటిని మించిన పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సూర్యని కొత్తగా చూస్తారని చెన్నై మీడియా తెగ చెబుతోంది. ఫహద్ ఫాసిల్ కు ఆవేశం లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన జీతూ మాధవన్ దర్శకుడు కావడంతో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఇదింకా షూటింగ్ లో ఉండగా సూర్య తనకు జై భీం ఇచ్చిన టీజె జ్ఞానవేల్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇవాళ ఈ ప్రాజెక్టుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చేసింది. హోంబాలే ఫిలింస్ దీనికి నిర్మాతగా వ్యవహరించనుండగా కయదు లోహర్ హీరోయిన్ గా ఎంపికయ్యింది. ఇక్కడ సూర్య ప్లానింగ్ ని మెచ్చుకోవాలి. ఇకపై కెరీర్ లో ఎక్కువ గ్యాప్ రాకుండా జాగ్రత్త పడుతూ వరసగా సినిమాలను ఒప్పేసుకుంటున్నాడు. కంగువ, రెట్రో కొట్టిన దెబ్బల నుంచి కోలుకున్నాక ఇంత వేగంగా కంబ్యాక్ అవ్వడం అభిమానులను సంతోషం కలిగిస్తోంది.

ఇకపై దీన్ని నిలబెట్టుకోవడం మీద సూర్య దృష్టి పెట్టాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా మార్కెట్ మళ్ళీ మొదటికే వస్తుంది. విజయ్ తమిళనాడు ముఖ్యమంత్రి అయ్యాక ఇప్పుడున్న హీరోల్లో ఆయన వదిలేసిన మాస్ వర్గాన్ని తిరిగి ఆకట్టుకునే సత్తా ఉన్న హీరో సూర్యనే అని ఫ్యాన్స్ నమ్మకం. కాకపోతే సరైన కథలు, దర్శకులు, కాంబినేషన్లు పడాలి. సూర్య ఇంకొంచెం కష్టపడితే దాన్ని అందుకోవడం సులభమే. రజనీకాంత్ సెలెక్టివ్ అయిపోగా అజిత్ ఎక్కువగా ఆసక్తి చూపించడం లేదు.

This post was last modified on June 29, 2026 4:03 pm

Share

Recent Posts

నంది అవార్డులు వచ్చేస్తున్నాయహో…

ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ప్ర‌భుత్వం ప్రకటించే నంది అవార్డుల‌కు ఎంత విలువ ఉండేదో తెలిసిందే. వాటిని జాతీయ అవార్డుల‌తో స‌మానంగా చూసేవారు.…

19 minutes ago

వందేమాత‌రంపై కేంద్రానికి సుప్రీంకోర్టు షాక్‌?

జాతీయ గేయం వందేమాత‌రం వ్య‌వ‌హారంపై జ‌రుగుతున్న వివాదాలు అన్నీ ఇన్నీ కావు. దేశానికి స్వాతంత్రం రాక మునుపు నుంచి ఈ…

2 hours ago

కలెక్షన్ కింగ్ అందుకే వెనుక ఉన్నారా

ఒకప్పుడు కలెక్షన్ కింగ్ గా తొంభై దశకంలో స్టార్ హీరోలకు బలమైన పోటీ ఇచ్చిన మోహన్ బాబుకి ఇప్పటికీ ఫాలోయింగ్…

3 hours ago

జడల్ జమానాకు సెన్సార్ ట్విస్టులు

ప్యారడైజ్ సెన్సార్ అయిపోయింది. ఊహించినట్టే ఏ సర్టిఫికెట్ వచ్చింది. 2 గంటల 54 నిమిషాల సవారి జాతి ప్రపంచంలోకి తీసుకెళ్లేందుకు…

3 hours ago

ఇక పిఠాపురంలోనే పవన్ మకాం?

చాలా రోజుల తర్వాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కనిపించారు. ప్రకృతి వైద్యం కోసం కేరళం వెళ్లి 20 రోజుల…

4 hours ago

టీమిండియాకు చెమటలు పట్టించిన జపాన్

జపాన్‌తో మ్యాచ్ అంటే టీమిండియా సులభంగా గెలుస్తుందని అనుకున్నారు క్రికెట్ ఫ్యాన్స్. కానీ ఈసారి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. తడి…

4 hours ago