తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై తెలంగాణ రక్షణసేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తీవ్ర వ్యాఖ్య లు చేశారు. నకిలీ ఓట్లతోనే రేవంత్ విజయం దక్కించుకున్నారని అన్నారు. కొడంగల్ నియోజకవర్గంలో 33 వేల నకిలీ ఓట్లు ఉన్నాయని.. రేవంత్ రెడ్డికి 32 వేల ఓట్ల మెజారిటీ లభించిందని.. అంటే.. ఆయన నకిలీ ఓట్లతోనే విజయం దక్కించుకున్నట్టు కదా! అని కవిత అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ ఓట్లు ఎక్కువగా ఉన్నాయని ఆరోపించారు.
తెలంగాణలో 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో కర్ణాటక నుంచి నోట్లతోపాటు ఓట్లు కూడా బదిలీ అయ్యాయనే అనుమానం ఉందన్నారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని కేంద్ర ఎన్నికల సంఘానికి కవిత విజ్ఞప్తి చేశారు. గత సర్ ప్రక్రియలో కొడంగల్ నియోజకవర్గంలో 800 ఓట్లు మాత్రమే తొలగించారన్న ఆమె.. ప్రస్తుతం 33 వేల నకిలీ ఓట్లు ఉన్నాయని చెప్పారు. దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న సర్‌పైనా అనుమానాలు ఉన్నాయని తెలిపారు.
ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొ క్క విధంగా సర్ ప్రక్రియను చేపడుతున్నారని తెలిపారు. ఈ తేడాను గమనించాలని ఎన్నికల సంఘానికి ఆమె విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లో ఉన్న సెటిలర్లకు ఏపీలో కూడా ఓటు ఉందన్నారు. అయితే.. ఒక వ్యక్తికి ఒక ఓటు మాత్రమే ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నకిలీ ఓట్లను తొలగించడం మంచిదేనని.. అయితే ఒక్కొక్క చోట ఒక్కొక్క విధంగా వ్యవహరించడం సరికాదని అభిప్రాయపడ్డారు. దీనిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నట్టు వెల్లడించారు.
కేసీఆర్ సంగతేంటి: కాంగ్రెస్
సీఎం రేవంత్ రెడ్డిపై కవిత చేసిన విమర్శలకు కాంగ్రెస్ పార్టీ కౌంటర్ ఇచ్చింది. రేవంత్ రెడ్డి సంగతిని బాగా చెబుతున్న కవిత.. తన అన్న కేటీఆర్, తండ్రి కేసీఆర్ నియోజకవర్గాల గురించి కావాలనే మరిచి పోయారా? అని ప్రశ్నించారు. అక్కడ కూడా నకిలీ ఓట్లు ఉన్నాయని తమ నాయకులు చెబుతున్నారని.. వాటిని ప్రశ్నించరా? అని నిలదీయడం గమనార్హం. కాగా, ప్రస్తుతం రాష్ట్రంలో సర్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. బూత్ లెవిల్ అధికారులు ఇంటింటికీ పత్రాలు పంపిణీ చేస్తున్నారు.
This post was last modified on June 29, 2026 9:47 pm
పాన్ ఇండియా క్రేజ్ లో పడి వందల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ రోజుల్లో.. ఒక చిన్న కన్నడ సినిమా…
సూపర్ స్టార్ రజినీకాంత్, లోకనాయకుడు కమల్ హాసన్ ఎంత మంచి మిత్రులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఐతే కెరీర్…
ఇండస్ట్రీలో చిన్న సినిమాలకు మెగాస్టార్ చిరంజీవి ఎలాంటి మద్దతు ఇస్తారో చెప్పడానికి ఇది తాజా రుజువు. ఈ శుక్రవారం విడుదలైన…
నిర్మాత, రచయిత కోన వెంకట్ తాజాగా ఒక ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ బాగా వైరలవుతున్నాయి. కొందరు దర్శకులు మూడు గంటల…
స్థానిక ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల విషయంలో సుప్రీం కోర్టు తీర్పు కూడా వచ్చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ పెంచింది. లోకల్…
రణబాలినే కాదు ఇకపై తన సినిమాలు దేనికీ తన పరిధి మేరకు టికెట్ రేట్ల పెంపు ఉండకుండా చూసుకుంటానని విజయ్…