Movie News

మరి సురేందర్ రెడ్డి సంగతేంటి?


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’యే చివరి చిత్రం అవుతుందనే అంచనాలు కలిగాయి ఒక దశలో. ఒక టైంలో ఒకవైపు రాజకీయాలు, ఇంకోవైపు సినిమాలను మేనేజ్ చేయలేక పవన్ బాగా ఇబ్బంది పడడం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం అయ్యాక చాలా కష్టపడి టైం సర్దుబాటు చేసుకుని ఆయన తాను పెండింగ్‌లో పెట్టిన మూడు సినిమాలను పూర్తి చేశారు. వాటిలో ముందుగా హరిహర వీరమల్లు.. తర్వాత ఓజీ, ఉస్తాద్ భగత్ సింగ్ ఒకదాని తర్వాత ఒకటి రిలీజయ్యాయి.

దీంతో పవన్ రిలాక్స్ అయ్యారు. ఇక ఆయన్నుంచి ఇప్పుడిప్పుడే సినిమాలు రావని అంతా అనుకున్నారు. కానీ ఎప్పుడో కమిట్మెంట్ ఇచ్చిన సురేందర్ రెడ్డి, రామ్ తాళ్ళూరి సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఆశ్చర్యపరిచారు పవన్. ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన కూాడా ఇచ్చారు. ఇదే పవన్ నెక్స్ట్ మూవీ అవుతుందని అనుకున్నారు.

కానీ అనూహ్యంగా మధ్యలో ‘ఓజీ-2’ తెరపైకి వచ్చింది. నిజానికి దర్శకుడు సుజీత్.. ఇప్పుడు నానితో ‘బ్లడీ రోమియో’ చేస్తుండాల్సింది. కానీ ‘ది ప్యారడైజ్’ ఆలస్యం కావడంతో నాని అందుబాటులోకి రాలేదు. దీంతో సుజీత్ దృష్టి ‘ఓజీ-2’ మీదికి మళ్లింది.

కానీ ఆ చిత్రం పెద్ద స్థాయిలో తీయాల్సిన నేపథ్యంలో అంత తేలిగ్గా ముందుకు కదలకపోవచ్చనే అనుకున్నారు. కానీ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తూ ‘ఓజీ-2’ పనులు మొదలుపెట్టింది టీం. పవన్, సుజీత్ కథా చర్చలు జరుపుతున్న ఫొటో కూడా బయటికి రావడంతో ఈ సినిమా త్వరలోనే ముందుకు కదలబోతోందని అర్థమైంది.

మరిప్పుడు సురేందర్ సినిమా సంగతేంటన్నదే అర్థం కావడం లేదు. ఈ చిత్రం ఈపాటికే మొదలుకావాల్సింది. కానీ పవన్‌ను సంతృప్తి పరిచేలా స్క్రిప్టు రెడీ కాలేదని, అందుకే ఆలస్యం అని గతంలో వార్తలు వచ్చాయి. పవన్ ఇప్పుడు ‘ఓజీ-2’ను టేకప్ చేయాలని చూస్తుండడంతో సూరి సినిమా మళ్లీ అటకెక్కేస్తుందా.. అసలా సినిమా ఉంటుందా అన్న సందేహాలు కలుగుతున్నాయి.

అసలు ఉండదనుకున్న సినిమాకు పవన్ పచ్చజెండా ఊపినపుడు.. వీలైనంత త్వరగా పర్ఫెక్ట్ స్క్రిప్టుతో రెడీ అవ్వాల్సింది సూరి అండ్ టీం. కానీ ఆ పని చేయలేకపోవడంతో ఇప్పుడీ చిత్రం మీద నీలినీడలు కమ్ముకున్న పరిస్థితి. కాకపోతే తనకు వ్యక్తిగతంగా, జనసేన కోసం ఎంతో చేసిన రామ్ తాళ్ళూరి కోసం ఇంకొంత ఆలస్యంగా అయినా పవన్ ఈ సినిమా చేసే అవకాశముంది. కాకపోతే ముందు పవన్‌కు నచ్చే స్క్రిప్టుతో సూరి రావాలి.

This post was last modified on June 22, 2026 10:43 am

Share

Recent Posts

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

57 minutes ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

2 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

2 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

2 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

2 hours ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

4 hours ago