Movie News

బంగారం లాంటి ఓపెనింగ్స్ తీసుకొచ్చింది

పెద్ది మొదటి రెండు వారాలు బాగా సందడి చేసి కలెక్షన్ల వర్షం కురిపించాక మళ్ళీ దాన్ని కొనసాగించే సినిమా ఏది వస్తుందని ఎదురు చూసిన బయ్యర్ వర్గాలకు సమంత మూవీ కొంగు బంగారమే అయ్యింది. మొదటి వీకెండ్ ప్రపంచవ్యాప్తంగా సుమారు 45 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేసినట్టు తెలిసి అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. నిన్న దాదాపు అన్ని సెంటర్స్ లో టికెట్లు లేవు. ముఖ్యంగా మహిళలు, కుటుంబ ప్రేక్షకులు థియేటర్ల దగ్గర బారులు తీరారు.

ఓవర్సీస్ లో మిలియన్ మార్క్ దాటేసి స్ట్రాంగ్ గా ఉన్న మా ఇంటి బంగారం ఇక ఇవాళ్టి నుంచి ఎలా పెర్ఫార్మ్ చేస్తుందనేది ఆసక్తికరంగా మారింది. ట్రెండ్స్ గమనిస్తే విపరీతంగా డ్రాప్ అయ్యే సూచనలు తక్కువగా ఉన్నాయి. మొదటి మూడు రోజుల్లో మిస్ అయినవాళ్లు వీక్ డేస్ లో అయినా చూసే తీరాలని నిర్ణయించుకోవడం కలెక్షన్లకు బాగా ఉపయోగపడనుంది. మాస్ జనాలకు నచ్చే అంశాలు కూడా సరిపడా ఉండటంతో టాక్ పరంగా బంగారంకు ప్లస్ అవుతోంది.

ఈ జోరు ఎప్పటి వరకు ఉంటుందనే దాన్ని బట్టి వంద కోట్ల మార్కును అందుకుంటుందా లేదానేది ఆధారపడి ఉంటుంది. రిలీజ్ కు ముందు చేసిన ప్రమోషన్లు ఓపెనింగ్స్ కు చాలా ఉపయోగపడ్డాయి. ముఖ్యంగా ఒక సాంప్రదాయ తెలుగు కుటుంబంలోని కోడలిగా సామ్ ని ప్రోజెక్ట్ చేయడం ఎంత సానుకూలంగా మారిందో జనాల రియాక్షన్లు చూసి చెప్పొచ్చు. ఏదో మల్టీ మిలియనీర్ ఫ్యామిలీ కాకుండా ఒక పల్లెటూరిలో కథను నడిపించడం కనెక్టివిటీని పెంచింది.

పోటీలో ఉన్న ఇతర సినిమాలు మా ఇంటి బంగారంకి కనీస పోటీ ఇవ్వలేని స్థితిలో ఎదురీదుతున్నాయి. దీవానాను నగర యువత చూస్తోంది కానీ కింది స్థాయి కేంద్రాల్లో ఆడియన్స్ కి చేరడం లేదు.. పబ్లిసిటీ స్ట్రాటజీ మార్చాల్సిన అవసరం చాలా కనిపిస్తోంది. వంద దేవుళ్ళు, బాలన్ టాక్ కొంచెం బాగానే ఉన్నా టికెట్ కౌంటర్ల దగ్గర సందడి లేదు. ట్రాన్స్ ఫర్ త్రిమూర్తులు త్వరగా ట్రాన్స్ ఫర్ అయ్యేలా ఉన్నాడు. సో ఇంకో వీకెండ్ కూడా మా ఇంటి బంగారం కంట్రోల్ లోకి రావడం ఖాయమే.

This post was last modified on June 22, 2026 10:22 am

Share

Recent Posts

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

1 hour ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

2 hours ago

హైదరాబాద్ తగలబెడతానంటోన్న దానం

ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…

2 hours ago

జగన్ పిలిచినా సాయిరెడ్డి వెళ్ళరు

ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…

3 hours ago

సిగ్మా తీర్చాల్సిన బాకీ ఇద్దరిదే

దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…

3 hours ago

అభయం ఇస్తున్న సాయి అభ్యంక్కర్

దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…

4 hours ago