Movie News

ప్రొడ్యూసర్ నానితో… హీరో నితిన్

నేచురల్ స్టార్ నాని కేవలం నటుడిగానే కాకుండా ‘వాల్ పోస్టర్ సినిమా’ బ్యానర్‌పై నిర్మాతగా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కెట్ ను క్రియేట్ చేసుకున్నారు. ఇప్పటివరకు ‘అ’ నుంచి ‘కోర్టు’ వరకు చిన్న సినిమాలు, ప్రియదర్శి లాంటి కాన్సెప్ట్ ఓరియంటెడ్ హీరోలతో ప్రాజెక్ట్‌లు చేస్తూ వచ్చిన నాని, ఇప్పుడు మెల్లగా ప్రొడక్షన్ పరంగా నెక్స్ట్ లీగ్‌లోకి అడుగుపెడుతున్నట్లు కనిపిస్తోంది.

ఇప్పటికే శ్రీకాంత్ ఒదెలా దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవితో ఒక భారీ ప్రాజెక్ట్ ను సుధాకర్ చెరుకూరితో కలిసి అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. ‘ది ప్యారడైజ్’ ఆరంభంలోనే రెండేళ్ల క్రితం ఈ కాంబోను లాక్ చేసుకున్నారు. మెగాస్టార్ లాంటి బిగ్ లీగ్ హీరోతో సినిమా సెట్ చేసిన తర్వాత, నాని బ్యానర్ లో రాబోయే తదుపరి హీరో ఎవరనే దానిపై ఇండస్ట్రీలో రకరకాల టాక్స్ నడుస్తున్నాయి.

ఇందులో భాగంగానే యంగ్ హీరో నితిన్ తో ‘దండోరా’ ఫేమ్ మురళీకాంత్ దేవసోత్ దర్శకత్వంలో ఒక సినిమా ఉండబోతోందని, ప్రీ ప్రొడక్షన్ కూడా పూర్తయిందనే ప్రచారం వైరల్ అవుతోంది. వచ్చే వారంలోనే పూజా కార్యక్రమం ఉంటుందట. కథ డిమాండ్ చేస్తే మెగాస్టార్ స్థాయి హీరోనే ప్రొడ్యూస్ చేయడానికి వెనుకాడని నాని, మిడ్ రేంజ్ హీరోలతో ప్రాజెక్ట్‌లు చేయడం పెద్ద కష్టమేమీ కాదు. టాలీవుడ్ లో దాదాపు అందరి స్టార్ హీరోలతో నానికి మంచి స్నేహబంధం ఉంది.

అయితే కాన్సెప్ట్ డ్రివెన్ సినిమాలకు అలవాటుపడిన వాల్ పోస్టర్ బ్యానర్ లో కమర్షియల్ ఇమేజ్ ఉన్న హీరోలు నటిస్తే బాక్సాఫీస్ దగ్గర ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉంటుందనేది అసలైన ప్రశ్న. కేవలం స్టార్‌డమ్ మాత్రమే కాకుండా కథలోని కాన్సెప్ట్ ని బ్యాలెన్స్ చేస్తూ నాని ఎలాంటి ప్రణాళికలతో ముందుకు వెళ్తారో చూడాలి. త్వరలోనే ఈ నితిన్ ప్రాజెక్ట్ అండ్ నాని ప్రొడక్షన్ ప్లాన్స్ పై పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

This post was last modified on August 2, 2026 6:18 pm

Share

Recent Posts

సూపర్ హిట్ హీరోల విచిత్ర పరిస్థితి

ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…

2 hours ago

చంద్రబాబు సభ సమీపంలో పేలుడు!

విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…

4 hours ago

కుల పిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా… మతపిచ్చి పార్టీకి ఓటు వెయ్యాలా

వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…

4 hours ago

వాల్యూమ్ పెంచండి జైలర్ సాబ్

ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…

6 hours ago

మహాకాల్… ఊహించని కాంబినేషన్

ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…

6 hours ago

సునీల్ యాద‌వ్ ఎవ‌రు…?

వైసీపీ అధినేత జ‌గ‌న్ చిన్నాన్న వైఎస్ వివేకానంద‌రెడ్డి దారుణ హ‌త్య‌కు సంబంధించి సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేస్తున్న సునీల్ యాద‌వ్ వ్య‌వ‌హారం…

6 hours ago