తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు, యువ ఉద్యోగుల మరణ వార్తలు అమెరికా నుంచి వరుసగా వస్తుండటం ఆందోళన కలిగిస్తోంది. రోడ్డు ప్రమాదాలు, ఆరోగ్య సమస్యలు, అనుకోని ఘటనల కారణంగా ఎంతోమంది యువకులు ప్రాణాలు కోల్పోతుండటం కుటుంబాలను విషాదంలో ముంచెత్తుతోంది.
తాజాగా తెలంగాణలోని మహబూబ్‌నగర్‌కు చెందిన 26 ఏళ్ల అరుణ్ సాయి రెడ్డి బొల్లెండుల అమెరికాలో కన్నుమూశాడు. ఉన్నత భవిష్యత్తు కోసం అమెరికాకు వెళ్లిన అరుణ్, అక్కడ STEM OPTపై ఉంటూ పూర్తి స్థాయి ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు.
అయితే అనారోగ్య కారణాలతో అతను మరణించినట్లు సమాచారం. ఈ విషాద వార్తతో కుటుంబ సభ్యులు, బంధువులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఎంతో ఆశలతో విదేశాలకు వెళ్లిన కుమారుడు ఇలా అకాల మరణం చెందడంతో కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ప్రస్తుతం అరుణ్ మృతదేహాన్ని స్వదేశానికి తరలించేందుకు స్నేహితులు, తెలుగు సంఘాల ప్రతినిధులు ప్రయత్నాలు చేస్తున్నారు. మృతదేహం భారత్‌కు చేరుకున్న తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
This post was last modified on June 22, 2026 7:56 am
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…
దసరా నెల ప్రారంభంలో విడుదలవుతున్న మొదటి వారం సినిమాల్లో సిగ్మా మీద మంచి అంచనాలే నెలకొన్నాయి. తమిళనాడు సిఎం కొడుకు…
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…