మంచి టాలెంట్ ఉన్న యంగ్ జనరేషన్ దర్శకులు కెరీర్ ప్రారంభంలో హిట్లు అందుకున్నప్పటికీ దాన్ని నిలబెట్టుకునే క్రమంలో, కథల ఎంపికలో చేసే పొరపాట్ల వల్ల మూల్యం చెల్లించుకుంటారు. వాళ్లలో మేర్లపాక గాంధీ ఒకరు. 2013 సంవత్సరం సందీప్ కిషన్ ‘వేంకటాద్రి ఎక్స్ ప్రెస్’ రూపంలో డెబ్యూనే సూపర్ హిట్ అందుకున్న ఈ కుర్ర దర్శకుడు తర్వాత శర్వానంద్ ‘ఎక్స్‌ప్రెస్ రాజా’ తీసి సంక్రాంతి పోటీలో కూడా మంచి విజయం అందుకోవడం అప్పట్లో హైలైట్ అయ్యింది.
ఇవి చూసే న్యాచురల్ స్టార్ నాని ‘కృష్ణార్జున యుద్ధం’ ఛాన్స్ ఇచ్చాడు. పాత పౌరాణికం పేరు పెట్టుకుని హీరో డ్యూయల్ రోల్ తో ఏదో కమర్షియల్ గా ట్రై చేద్దామని చూసిన మేర్లపాక గాంధీకి ఆ డిజాస్టర్ ప్రభావం కొంత కాలం వెంటాడింది. స్టార్లతో కలయిక సాధ్యం కాలేదు. దీంతో ‘ఏక్ మినీ కథ’ అనే ఓటిటి మూవీతో మరోసారి తన సెన్సిబిలిటీని ఋజువు చేసుకున్నాడు. తర్వాత నితిన్ ‘మాస్ట్రో’ రూపంలో రీమేక్ ఛాన్స్ దక్కింది కానీ డిజిటల్ రిలీజ్ కావడం వల్ల ప్రయోజనం లేకపోయింది.
ఇవన్నీ ఒక ఎత్తు అయితే ట్రెండ్ ని తప్పుగా అర్థం చేసుకుని తీసిన ‘లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్’ దారుణంగా పోవడం గాంధీకి పెద్ద బ్రేక్ వేసింది. ఏకంగా నాలుగేళ్ల గ్యాప్ తీసుకునేలా ప్రేరేపించింది. అందుకే ఈసారి కసితో ‘కొరియన్ కనకరాజు’ రాసుకున్నట్టు ఆయన మాటల్లో అర్థమవుతోంది. వరుణ్ తేజ్ హీరోగా రితిక నాయక్ హీరోయిన్ గా నటించిన ఈ కామెడీ హారర్ డ్రామాలో రాయలసీమ, కొరియాను కలిపే వెరైటీ పాయింట్ రాసుకున్నారు గాంధీ. ప్రమోషన్లు స్వింగ్ మీదున్నాయి.
ట్రైలర్ రెస్పాన్స్ బాగానే ఉంది. ఫుల్ కామెడీనే నమ్ముకుని మేర్లపాక గాంధీ తీసిన ఈ కొరియన్ కనకరాజులో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయట. ఏక్ మినీ కథకు అండగా నిలబడిన యువి క్రియేషన్స్ సంస్థే ఈ సినిమాని నిర్మించడం గమనార్హం. అటు వరుణ్ తేజ్ కూడా వరస ఫ్లాపుల్లో ఉన్నాడు. తనకు హిట్టివ్వడం ద్వారా మేర్లపాక గాంధీ ఇద్దరికీ మేలు చేసుకున్న వారు అవుతారు. ఆగస్ట్ 7 పెద్దగా పోటీ లేని ప్రయోజనాన్ని కనక కనకరాజు వాడుకుంటే వసూళ్లకు ఢోకా లేనట్టే.
This post was last modified on August 2, 2026 12:17 pm
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…