Movie News

బిర్యానీ సంపూ ఏడిపిస్తాడా?

ది ప్యారడైజ్.. దసరా లాంటి రా అండ్ రస్టిక్ బ్లాక్ బస్టర్ తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో దీనిపై అంచనాలు మామూలుగా లేవు. అయితే ఈ సినిమాలో బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు కూడా ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నారు. ఈ సినిమాలో ఆయన పాత్ర పేరు ‘బిర్యానీ’. ఇప్పటికే విడుదలైన పోస్టర్ లో ఆయన లుక్ చూసి ప్రతి ఒక్కరూ ఆశ్చర్యపోయారు.

ఇన్నాళ్లూ సంపూర్ణేష్ బాబు అంటే కేవలం పరోడీలు, స్పూఫ్‌లు, కడుపుబ్బా నవ్వించే కామిక్ క్యారెక్టర్లే గుర్తుకొస్తాయి. కానీ శ్రీకాంత్ ఒదెలా లాంటి సీరియస్ డార్క్ వరల్డ్ ని క్రియేట్ చేసే దర్శకుడి సినిమాలో సంపూ నటిస్తున్నారంటే, ఈ ‘బిర్యానీ’ పాత్ర జస్ట్ కామెడీకే పరిమితం అయి ఉండదనే అనిపిస్తోంది. ఈ క్యారెక్టర్ కి ఒక ఇంటెన్స్ ఎమోషనల్ టచ్ ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది.

అయితే ఇక్కడే ఒక చిన్న పాయింట్ ని గమనించాల్సి ఉంది. సంపూ పాత్రకు ఎమోషనల్ టచ్ ఉంటే ఓకే కానీ, మన రెగ్యులర్ రొటీన్ సినిమాల్లో లాగా విలన్ హీరో మీద పగతో అతని ప్రాణస్నేహితుడిని చంపేసే రోల్ అయితే మాత్రం కాస్త రిస్క్ గా మారే ప్రమాదం ఉంది. ఇప్పటికే రిలీజైన విజువల్స్ చూసి ప్రేక్షకులు ఇదొక కంప్లీట్ నోవెల్ అటెమ్ట్, మునుపెన్నడూ చూడని సరికొత్త సినిమా అని ఊహల్లో ఉన్నారు.

ఇలాంటి టైమ్ లో ఆడియన్స్ ఎక్స్‌పెక్టేషన్స్ కి పూర్తి భిన్నంగా కథనం సాగితేనే కంటెంట్ గట్టిగా క్లిక్ అవుతుంది. ఒకవేళ రొటీన్ క్యారెక్టర్ డిజైనింగ్ ఉన్నప్పటికీ, ప్రెజెంటేషన్ అండ్ స్క్రీన్ ప్లే నెక్స్ట్ లెవెల్ లో ఉంటే ప్రేక్షకులు ఆ చిన్న చిన్న పాయింట్స్ ని పెద్దగా పట్టించుకోరు. గ్రిప్పింగ్ గా నడిచే కథనంతో ఆ మ్యాజిక్ చేయొచ్చు. బర్నింగ్ స్టార్ అని పిలుచుకునే సంపూ ‘బిర్యానీ’ క్యారెక్టర్ తో ఒక సీరియస్ ఎమోషనల్ ట్రాక్ లో కనిపిస్తూ ఆడియన్స్ చేత కన్నీళ్లు పెట్టిస్తారా లేక తన మార్క్ తోనే కథలో సర్ ప్రైజ్ చేస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. 

ఇప్పటివరకు శ్రీకాంత్ ఒదెలా అందించిన కంటెంట్ చూస్తుంటే ఈ పాత్రను చాలా వైవిధ్యంగా డిజైన్ చేసి ఉంటారనిపిస్తోంది. ఆగస్టు 6న రాబోతున్న టీజర్ కట్ తో సినిమా మూడ్ పై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా సంపూర్ణేష్ బాబును ఒక ఇంటెన్స్ రోల్ లో ఏ స్థాయిలో మెప్పిస్తాడో చూడాలంటే మరికొన్ని రోజుల వరకు ఆగాల్సిందే.

This post was last modified on August 2, 2026 11:54 am

Share

Recent Posts

2027 వరల్డ్‌కప్‌లో 13 మ్యాచ్‌లు ఆడితేనే కప్…

2023 వన్డే వరల్డ్‌కప్‌లో ఫైనల్ వరకు వెళ్లిన టీమ్ఇండియా మొత్తం 11 మ్యాచ్‌లు ఆడింది. కానీ 2027లో కప్ వరకు…

3 hours ago

స్పేస్‌లోనే AI ల్యాబ్… పంపింది హైదరాబాద్ కంపెనీ!

ఏఐ కోసం కంప్యూటర్లు, పెద్ద పెద్ద డేటా సెంటర్లు భూమిపైనే ఉంటాయని మనకు తెలుసు. కానీ హైదరాబాద్‌కు చెందిన ఓ…

3 hours ago

ఉత్త‌రాంధ్ర‌లో `నాలుగు` స్తంభాలాట‌.. !

ఉత్త‌రాంధ్ర‌లోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయ‌కుల మ‌ధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…

4 hours ago

రవితేజ – వివేక్ సినిమా పరిస్థితి ఏంటి

మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…

11 hours ago

రాకా… అలా ఫిక్సయిపోవచ్చా?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…

12 hours ago

ఆదర్శ నిర్ణయాలు మంచి ఫలితాలు ఇవ్వాలి

ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…

14 hours ago